ల‌గ‌డ‌పాటి చెప్పేసారు : అనుభ‌వానికే ప‌ట్టం క‌డ‌తారు : ఆక్టోప‌స్ మైండ్ గేమ్ వ‌ర్క‌వుట్ అవుతుందా..!

Recommended Video

    AP Assembly Election 2019 : ఆక్టోప‌స్ మైండ్ గేమ్ వ‌ర్క‌వుట్ అవుతుందా..? || Oneindia Telugu

    మాజీ ఎంపి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చెప్పాల‌నుకున్న‌ది చెప్పేసారు. అధికారికంగా స‌ర్వేలు చెప్ప‌లేదు. ప్ర‌చారం ఇంకా పూర్తి కాలేదు. కానీ, మైండ్ గేమ్ ప్రారంభించారు. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో ల‌గ‌డ‌పాటి జోస్యం బొక్క బోర్లా ప‌డిం ది. ఆయ‌న జోస్యం రివ‌ర్స్ అయింది. దీంతో..ల‌గ‌డ‌పాటి ఇప్పుడు ఏం చెప్పినా పూర్తిగా న‌మ్మే ప‌రిస్థితులు గ‌తంలో లాగా లేవు. అయినా..ల‌గ‌డ‌పాటి త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌న మ‌న‌సులోని భావాల‌ను బ‌య‌ట పెడుతున్నారు...

    ల‌గ‌డ‌పాటి మ‌న‌సులో మాట‌..

    ల‌గ‌డ‌పాటి మ‌న‌సులో మాట‌..

    మాజీ ఎంపి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఏపి ఎన్నిక‌ల్లో స‌ర్వే చేస్తున్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పారు. కొద్ది రోజ‌ల క్రితం ల‌గ డ‌పాటి ఏపి ఎన్నిక‌ల ఫ‌లితాల పై 11న పోలింగ్ ముగిసిన వెంట‌నే ఏపి ఫ‌లితాల వ‌ర‌కు స‌ర్వే వివ‌రాల‌ను చెబుతాన‌ని ప్ర‌క‌టించారు. కానీ, ఇప్పుడు మాత్రం తాను మే 19న తుది విడ‌త ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన వెంట‌నే తెలుగు రాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తాన‌ని స్ప‌ష్టం చేసారు. అయితే, గ‌తంలో తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఆయ‌న తిరుమ‌ల వెళ్లారు. అక్క‌డే తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల పై తొలి వ్యాఖ్య‌లు చేసారు. స్వ‌తంత్ర అభ్య‌ర్దులు ఎంత మం ది గెలిచేది నాడు చెప్పారు. ఇక‌, ఇప్పుడు అదే విధంగా తిరుమ‌ల లోనే ఏపి ఎన్నిక‌ల ఫ‌లితాల పై వ్యాఖ్య‌లు చేసారు. ఫలితాల‌ని నేరుగా చెప్ప‌క‌పోయినా.. అనుభ‌వం ఉన్న వారికే ప‌ట్టం క‌డ‌తారంటూ త‌న మ‌న‌సులో మాట చెప్పేసారు.

    తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ..

    తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ..

    ఇదే ర‌కంగా తిరుమ‌ల వ‌చ్చిన ల‌గ‌డ‌పాటి తెలంగాణ పోలింగ్ ముగియ కుండానే తెలంగాణ లో ప‌ది మంది వ‌ర‌కు స్వ‌తంత్ర అభ్య‌ర్దులు గెలుస్తున్నార‌ని..రోజుకు ఇద్ద‌రు అభ్య‌ర్దుల పేర్ల‌ను బ‌ట‌య పెడ‌తాన‌ని ఆస‌క్తి పెంచారు. అదే విధంగా ప్ర‌క‌టించారు. ఇక‌, పోలింగ్ పూర్తయిన వెంట‌నే ఫలితాల పై స‌ర్వే వివ‌రాలు చెబుతానంటూనే...పోలింగ్ కు ముందే కాంగ్రెస్ - టిడిపి కూట‌మి గెలుస్తుందంటూ లీకులు ఇచ్చేసారు. ఆ త‌రువాత ఆ కూట‌మి గెల‌వ‌బోతోందంటూ తేల్చి చెప్పేసారు. దీని పై టిఆర్‌య‌స్ నేత‌లు ఫైర్ అయ్యారు. ఇదంతా చంద్రబాబు కు మ‌ద్ద‌తుగా ఆడుతున్న మైండ్ గేమ్ అంటూ కొట్టి పారేసారు. ఇక‌, ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టిఆర్‌య‌స్ స్వీప్ చేసింది. ఆ త‌రువాత ల‌గ‌డ‌పాటి త‌న జోస్యం త‌ప్పింద‌ని అంగీక‌రించారు. అయితే, పోలింగ్ ముందు రోజు జ‌రిగిన ప‌రిణామాలే టిఆర్‌య‌స్ గెలుపుకు దోహ‌దం చేసా య‌ని చెప్పుకొచ్చారు.

    ఏపిలో ప్ర‌భావితం అవుతారా..

    ఏపిలో ప్ర‌భావితం అవుతారా..

    ఈ సారి ఏపి ఎన్నిక‌ల్లో పార్టీలు మైండ్ గేమ్ ను న‌మ్ముకుంటున్నారు. ఇప్ప‌టికే అనేక జాతీయ సంస్థ‌ల సర్వేలు వైసిపి కి మ‌ద్ద‌తుగా ఉన్నాయి. ఇక‌, ఏపిలో ప్ర‌చార శైలి..ప్ర‌జ‌ల నుండి ఫీడ్ బ్యాక్..వ్యూహాల పై ల‌గ‌డ‌పాటి టిడిపి అధినేత తో ట‌చ్ లోనే ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో చంద్రబాబు ఇంట‌లిజెన్స్ రిపోర్టుల‌తో పాటుగా ప్ర‌యివేటు సం స్థ‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు తెప్పించుకుంటూ..అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు కేడ‌ర్ కు చేస్తున్నారు. ఇక‌, ఇదే స‌మ యం లో ల‌గ‌డపాటి ప‌రోక్షంగా తాను చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది చెబుతూ...ఓట‌ర్ల పై ఎంతో కొంత ప్ర‌భావితం చేసే ప్ర‌య త్నాలు చేస్తున్నార‌నే వాద‌న మొద‌లైంది. అయితే, తెలంగాణ ఎన్నిక‌ల త‌రువాత ల‌గ‌డ‌పాటి విశ్వ‌స‌నీయ‌త దెబ్బ తిం ద‌ని చెబుతున్నారు. మ‌రి..ఈ రెండు రోజుల పాటు ఇటువంటి నేత‌లు మ‌రి కొంత మైండ్ గేమ్ అడే అవ‌కాశం ఉందం టున్నారు. మ‌రి..వీటికి ఏపి లో ఓట‌ర్లు ప్ర‌భావితం అవుతారా లేదో చూడాలి..

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+