మంత్రి పత్తిపాటితో లగడపాటి రాజగోపాల్ భేటీ, ఎందుకంటే
విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ తన రెండో కొడుకు ఆశ్రిత్ వివాహ శుభలేఖను ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు ఆదివారం అందించారు.
గుంటూరు: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ తన రెండో కొడుకు ఆశ్రిత్ వివాహ శుభలేఖను ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు ఆదివారం అందించారు.
గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలోని మంత్రి పత్తిపాటి నివాసానికి వచ్చిన లగడపాటి శుభలేఖను ఆయనకు అందించారు.

నవంబర్ 25వ తేదీన హైదరాబాదులో పెళ్లి జరగనుందని, ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా లగడపాటితో పత్తిపాటి కాసేపు ఏకాంతంగా భేటీ అయ్యారని, రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగిందని వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications