Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ ఎంపీగా లగడపాటి పోటీ - నియోజకవర్గం ఫిక్స్..!!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జగన్ వై నాట్ 175 నినాదంతో అభ్యర్దుల ఖరారు పైన కసరత్తు ప్రారంభించారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను మార్పు చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ - జనసేన పొత్తుతో అధికారం పైన రెండు పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఎంపీగా పోటీకి సిద్దమైనట్లు ప్రచారం సాగుతోంది.

పొలిటికల్ రీ ఎంట్రీ: మాజీ ఎంపీ..ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మరోసారి రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారని తెలుస్తోంది. టీడీపీలో చేరటం తో పాటుగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం సాగుతోంది. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ 2014,2019లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విజ‌యవాడ ఎంపీగా ప‌నిచేసారు.రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో లోక్ స‌భ‌లో పోరాడిన ఆయ‌న‌...రాష్ట్రం విడిపోతే శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని అన్నారు..

Lagadapati Raja Gopal likely to contest as TDP MP Candidate in next Elections

ఆ త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న జ‌ర‌గ‌డంతో అన్న మాట ప్ర‌కారం త‌న పొలిటిక‌ల్ కెరీర్ కు గుడ్ బై చెప్పారు. 2014-19 లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయనను పలు మార్లు కలిసారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెప్పినా..ఆ సర్వే బోల్తా కొట్టింది. ఫలితంగా సర్వేలకు లగడపాటి దూరంగా ఉంటున్నారు.

టీడీపీలో చేరుతున్నారా: ల‌గ‌డ‌పాటి ఎంపీగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌తో ఉన్న ముఖ్య అనుచరులు విజ‌య‌వాడ‌లో సమావేశమయ్యారు. లగడపాటి తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎంపీగా పోటీ చేయాలని కోరారు. ఏ పార్టీలో ఆయన చేరినా మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కానీ, లగడపాటి తొలుత తిరిగి రాజకీయంగా రీ ఎంట్రీ ఇవ్వటానికి సిద్దపడలేదు. కానీ, టీడీపీ ముఖ్యులు లగడపాటితో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం.

సంప్రదింపుల తరువాత టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు మూడ లోక్ సభ సీట్లను ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు స్థానాల నుంచి లగడపాటి రాజగోపాల్ పోటీ చేసేందుకు సిద్దమైతే సీటు ఖరారుకు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో, లగడపాటి తన రీ ఎంట్రీ ప్రకటనకు ముందే దీని పైన నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

Lagadapati Raja Gopal likely to contest as TDP MP Candidate in next Elections

ఎంపీగా ఎన్నికల బరిలో..!: విజయవాడ నుంచి రెండు సార్లు గెలిచి ఉండటంతో అక్కడి నుంచి పోటీ చేస్తే కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని తిరిగి పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో సొంత పార్టీ నేతల నుంచి నానికి వ్యతిరేకత ఉంది. దీంతో, గుంటూరు లేదా ఏలూరు నుంచి పోటీ చేసేందుకు ప్రస్తుతం లగడపాటి తరపు సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

గుంటూరు నుంచి టీడీపీ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. దీంతో...అక్కడ టీడీపీకి బలమైన అభ్యర్ది లేరు. ఈ సమయంలో లగడపాటిని గుంటూరు నుంచి టీడీపీ అభ్యర్దిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతోంది. దీంతో..లగడపాటి టీడీపీ నుంచి పోటీ చేయటం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీని పైన లగడపాటి అధికారికంగా తన నిర్ణయం ఏం చెబుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+