అంచనా మాత్రమే: నంద్యాలపై టిడిపికి లగడపాటి షాక్! ఇదీ లెక్క
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన గురువారం ఉదయం విలేకరులతో మాట్లాడారు.

మూడేళ్లుగా ఎన్నికలు లేనందునే
మూడేళ్లుగా ఏపీలో ఎన్నికలు లేవని, అందుకే నంద్యాల ఉప ఎన్నికకు చాలా ప్రాధాన్యం ఏర్పడిందని లగడపాటి చెప్పారు. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మా టీం (సర్వే టీం) తెలిపిందని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికను మా బృందం పరిశీలించిందని చెప్పారు.
Recommended Video


మాది అంచనా మాత్రమేనంటూ టిడిపికి షాక్!
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపిదే గెలుపు అని చెప్పిన లగడపాటి.. ఆ తర్వాత ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశారు. తమది అంచనా మాత్రమే అన్నారు. ప్రజల అభిప్రాయం ఉంటుందని చెప్పారు. ఈ నెల 28న ఎవరు గెలుస్తారనే విషయం తేలుతుందని చెప్పారు. అయితే, తాము అన్ని పరిశీలించి అంచనాకు వచ్చామని అభిప్రాయపడ్డారు.

హాబీగా.. సర్వేలపై లగడపాటి
రాజకీయాలకు దూరమయ్యాక ఎన్నికల్లో సర్వేలు చేయడంపై విలేకరులు లగడపాటి రాజగోపాల్‌ను ప్రశ్నించారు. అయితే, తాను హాబీ కోసమే రాజకీయ విశ్లేషణ చేస్తున్నానని, సర్వేలు చేస్తున్నానని ఆయన చెప్పారు.

లగడపాటి ఏమన్నారంటే..
బుధవారం సాయంత్రం పోలింగ్ ముగిశాక.. ఓటింగ్ సరళిపై లగడపాటి ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. ఓటింగ్ శాతం పెరిగినందున ఫలితంలో మార్పు వస్తుందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనడం సరికాదన్నారు. పోలింగ్ శాతం పెరిగినా టిడిపి 10% ఓట్ల మెజారిటీని సాధిస్తుందన్నారు. గురువారం నాటికి మెజారిటీపై స్పష్టత వస్తుందన్నారు. నంద్యాలలో 1,73,335 మంది ఓటు వేసినందున.. 17,333 ఓట్ల మెజారిటీ టీడీపీకి రావచ్చన్నారు.

పురుషుల కంటే మహిళలే
నంద్యాల ఉప ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఓట్లు వేయడానికి తరలివచ్చారు. 1983 ఎన్నికల నుంచి 2014 వరకు జరిగిన పదిహేను పర్యాయాల ఎన్నికల్లో ఎన్నడూ 73.84 శాతం మించి ఓట్లు పోలవ్వలేదు. టిడిపి, వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికలో మాత్రం ఏకంగా 79.20 శాతం పోలింగ్ నమోదైంది. నంద్యాల చరిత్రలో ఇదే ప్రథమం.

భారీ పోలింగ్ జరిగినా..
మధ్యాహ్నం ఒంటి గంట వరకే 53 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయింది. దీంతో సాయంత్రానికి 80 శాతం దాటుతుందని భావించారు. మధ్యాహ్నం నుంచి నంద్యాలలో కొంచెం మందకొడిగా నడిచింది. దీంతో 74 శాతం పట్టణంలో నమోదు కాగా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం వరకు అదే జోరు కొనసాగింది.

కీలకమైన గోస్పాడులో ఇలా
నంద్యాలలో 2,18,858 ఓటర్లు ఉన్నారు. బుధవారం జరిగిన పోలింగ్‌లో 1,73,335 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. 79.20 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో నంద్యాల అర్బన్‌లో 1,42,628 ఓటర్లుండగా 1,05,629 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో పోలింగ్ శాతం 74.06 నమోదైంది. ఇక నంద్యాల రూరల్‌లోని 20 గ్రామపంచాయతీల్లో 57 పోలింగ్ కేంద్రాల పరిధిలో 47,386 మంది ఓటర్లకుగానూ 41,514 మంది ఓటర్లు (87.61 శాతం) పోలింగ్‌లో పాల్గొన్నారు. గోస్పాడు మండలంలోని 15 గ్రామాల పరిధిలో 39 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో 28,844 మంది ఓటర్లుండగా, 90.81 శాతం మంది (26,192 మంది) ఓట్లు వేశారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications