ముందుకెళ్తే రాజీనామాలే: తెలంగాణపై లగడపాటి

ఇద్దరు పార్లమెంటు సభ్యులు, ఇద్దరు కేంద్ర మంత్రులు తప్ప మిగతావారంతా సమావేశానికి హాజరవుతారని ఆయన చెప్పారు. తాము రాజీనామాలు చేస్తామంటేనే కాంగ్రెసు అధిష్టానం ఆంటోనీ కమిటీ వేసిందని ఆయన అన్నారు. రాజీనామాల ఆమోదానికి ఒత్తిడి తేవద్దని, విభజనపై ముందుకు సాగబోమని అధిష్టానం తమతో చెప్పిందని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఆయన అన్నారు. ప్రతిపక్షాలవాళ్లు రాజీనామాలు చేయకపోతే విభజనకు అంగీకరించినట్లేనని ఆయన అన్నారు.
వచ్చే 48 గంటల్లో దీక్ష చేపట్టే విషయంపై, ఢిల్లీ వెళ్లే విషయంపై ఆలోచన చేస్తున్నామని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. రాజీనామాలు చేయడంపై భిన్నాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని స్పాన్సర్డ్ ఉద్యమమని అనడం అవివేకమని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు కఠిన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేసింది తాము మాత్రమేనని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఇతర పార్టీల రాజీనామాలు ఎలా ఉన్నాయో చూడండని ఆయన అన్నారు. తాము అన్నింటికీ సిద్ధమైన ఉన్నట్లు ఆయన తెలిపారు. మంత్రివర్గం ముందుకు విభజన నోట్ వచ్చినప్పుడు నిరసన వ్యక్తం చేయడానికి వీలుగానే కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications