లగడపాటి నుంచి రాజమౌళి దాకా.. వైయస్ జగన్‍ను ఇరుకునపడేశారా?
నంద్యాల, కాకినాడ ఎన్నికల ఓటమి ఉప ఎన్నికలు వైసిపికి షాకిచ్చాయి. ఎన్నికల ఫలితాలతో పాటు పలువురు నేతలు, ప్రముఖులు కూడా వైసిపికి షాకిస్తున్నారు.
అమరావతి: నంద్యాల, కాకినాడ ఎన్నికల ఓటమి ఉప ఎన్నికలు వైసిపికి షాకిచ్చాయి. ఎన్నికల ఫలితాలతో పాటు పలువురు నేతలు, ప్రముఖులు కూడా వైసిపికి షాకిస్తున్నారు.

చంద్రబాబును అలా టార్గెట్ చేసిన వైసిపి
చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకునేందుకు ప్రతిపక్షం రాజధాని అమరావతిని కూడా పలుమార్లు లేవెనెత్తుతోంది. రాజధాని నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని చెబుతూ, అందుకు తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను ఉదాహరణగా చెబుతోంది.

జగన్ చాంబర్లోకి నీరు
ఇటీవల వర్షాలకు అసెంబ్లీ భవనంలోని తమ అధినేత జగన్ చాంబర్లోకి నీరు రావడంపై వైసిపి తీవ్ర విమర్శలు చేసింది. రాజధానిలో అవినీతికి ఇదే నిదర్శనమని చెప్పింది. కానీ గత కొద్ది రోజులుగా సచివాలయాన్ని సందర్శిస్తున్న పలువురు నేతలు మాత్రం ప్రశంసించడం గమనార్హం.

రాజమౌళి మెచ్చుకోలు
మాజీ పార్లమెంటు లగడపాటి రాజగోపాల్ మొదలు నిన్న ప్రముఖ దర్శకులు రాజమౌళి వరకు సచివాలయ నిర్మాణంపై ప్రశంసలు కురిపించారు. ఇది ఓ విధంగా వైసిపి జీర్ణించుకోలేని అంశమేనని అంటున్నారు.

జగన్‌ను ఇరికించారా?
వైసిపి నేతలు ఏ సచివాలయం పైన అయితే విమర్సలు చేస్తున్నారో, అదే భవనాన్ని లగడపాటి రాజగోపాల్, కాంగ్రెస్ నేత జెడి శీలం, దర్శకులు రాజమౌళి మెచ్చుకున్నారు. ఇది ప్రతిపక్షాన్ని ఇరుకున పడేసే విషయమే అంటున్నారు. అయితే, లగడపాటి నుంచి రాజమౌళి దాకా మాట్లాడింది భవనం పైపై మెరుగుల గురించి మాత్రమేనని, వైసిపి నేతలు మాత్రం నిర్మాణంలో నాణ్యత గురించి మాట్లాడుతున్నారనే వారు లేకపోలేదు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications