అమిత్ షాతో చంద్రబాబు భేటీ వెనుక ఆయనే కీ రోల్ - లక్ష్మీ పార్వతి ..!!
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ పైన లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేసారు. పొత్తుల కోసం బీజేపీ పెద్దలను ఆశ్రయించినా..అక్కడ చంద్రబాబు ఆలోచనలకు బ్రేకులు పడ్డాయని వ్యాఖ్యానించారు. పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో గురించి ఏమంటారని ప్రశ్నించారు. చంద్రబాబు హామీల అమలుకు ఆర్బీఐ సొమ్ము కూడా చాలదని లక్ష్మీపార్వతి అన్నారు. లోకేష్‌ది పాదయాత్ర కాదు..ఈవినింగ్ వాక్ అని ఎద్దేవా చేశారు.
ఆ ఇద్దరి సమావేశం వెనుక ఆయన: టీడీపీ అధినేత చంద్రబాబుపై అల్లుడు సుద్దులు అనే పుస్తకం రాశానని, త్వరలోనే ఈ పుస్తకాన్ని విడుదల చేస్తానని లక్ష్మీపార్వతి ప్రకటించారు. చంద్రబాబు కేసుల మాఫీ కోసం ఢిల్లీకి వెళ్లి.. పొత్తుల కోసం చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయని చెప్పుకొచ్చారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు ను చంద్రబాబు ముంచేసారని ఆరోపించారు. పొత్తుల కోసం చంద్రబాబు ఎటువంటి ప్రయత్నాలైనా చేస్తారని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు. చంద్రబాబును బీజేపీ నమ్మదని పేర్కొన్నారు. గతంలో రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న వ్యక్తి చెప్పారనే కారణంతోనే చంద్రబాబు తో మీటింగ్ కు అమిత్ షా ఒప్పుకున్నారని లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేసారు.

టీడీపీ -జనసేన పొత్తుతో: మార్గదర్శి నిధుల మళ్లింపును సీఐడీ నిర్ధారించిందని చెప్పారు. డిపాజిటర్ల కు చెల్లింపులు ఏ విధంగా జరుగుతుందో అర్ధం కావడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి ఖాయమని చెప్పుకొచ్చారు. ఓటమి తర్వాత చంద్రబాబు, ఆయన కుమారుడు ప్రవాసీలుగా మిగిలిపోతారన్నారు. చంద్రబాబు సిగ్నల్ ఇచ్చిన తర్వాతే వారాహి రోడ్డెక్కుతోందని విమర్శించారు. టీడీపీతో కలయిక రాజకీయ నాయడుగా పవన్ కళ్యాణ్ కు తీవ్ర నష్టం కలిగిందని విశ్లేషించారు. ఓట్లు చీల్చడం అంత ఈజీ కాదన్న లక్ష్మీ పార్వతి..నాయకుడి విధానాలు అర్ధం కాక జనసేన కార్యకర్తలు అయోమయంలో ఉన్నారన్నారు. పాదయాత్రలో ముఖ్యమంత్రిపై చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని విమర్శించారు.

పొత్తు ఉన్నట్లా..లేనట్లా: హోం మంత్రి అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం పొత్తులపైనే జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. రెండు పార్టీల నుంచి ఇప్పటి వరకు అధికారికంగా స్పష్టత లేదు. ఏపీ బీజేపీ చీఫ్ ఈ భేటీ పైన స్పందిస్తూ ఈ అంశం పైన చంద్రబాబునే అడగాలని సూచించారు. తెలంగాణ బీజేపీ నేతలు తమకు టీడీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన సమయంలో పొత్తుల గురించి ఎన్నికల సమయంలో చర్చిద్దామని..తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే ఢిల్లీలో అమిత్ షాతో కలిసానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అసలు టీడీపీ, బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అనేది రెండు పార్టీల్లోని కేడర్ లో చర్చ కొనసాగుతోంది.
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications