• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కుక్క మూతి పిందె.... మనవడు లోకేష్ కు కొత్త పేరు పెట్టిన లక్ష్మీ పార్వతి

|

దివంగత సీఎం నందమూరి తారకరామారావు సతీమణి, ప్రస్తుతం ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టిడిపి లోకేష్ కుక్కమూతి పిందె లాంటివాడిని సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మిపార్వతి. ఎన్టీఆర్ వంటి మహానుభావుడు స్థాపించిన పార్టీని నేడు దౌర్భాగ్య స్థితికి తీసుకు వెళ్లారని ఆరోపించిన లక్ష్మీపార్వతి మనవడు లోకేష్ ను ఉద్దేశించి అయోగ్యుడు అంటూ విరుచుకుపడ్డారు.

ఆయనేమీ తక్కువోడు కాదు... దగ్గుపాటి వెంకటేశ్వరరావుపై లక్ష్మీ పార్వతి సంచలనం

చంద్రబాబుపై , లోకేష్ పై విరుచుకుపడిన లక్ష్మీ పార్వతి

చంద్రబాబుపై , లోకేష్ పై విరుచుకుపడిన లక్ష్మీ పార్వతి

వైసీపీ ఆవిర్భావం నుంచే లక్ష్మీపార్వతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీలో ఆమె సేవలను గుర్తించిన పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే ఆమెకు తెలుగు అకాడెమీ డైరెక్టర్ గా అవకాశం కల్పించారు . ఆమెను తెలుగు అకాడమీ డైరెక్టర్ గా నియమించడంపై పలు విమర్శలు ఎదురైనప్పటికీ ఆమె పార్టీ కోసం పని చేస్తున్న తీరును గుర్తించి ఆమెకు అవకాశం కల్పించారు జగన్. ఇటీవల వల్లభనేని వంశీ టిడిపి అధినేత చంద్రబాబుపై, లోకేష్ బాబు పై విరుచుకు పడుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ పరిణామాలు హాట్ హాట్ గా మారాయి.

టీడీపీలో కొత్తగా కుక్క మూతి పిందెలు చేరాయన్న లక్ష్మీ పార్వతి

టీడీపీలో కొత్తగా కుక్క మూతి పిందెలు చేరాయన్న లక్ష్మీ పార్వతి

ఇక ఇదే సమయంలో లక్ష్మీపార్వతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రధానంగా లోకేశ్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.ఎన్టీఆర్ భార్యగా తనను గుర్తించాల్సిన చోట ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తనని ఎంతో బాధ పెట్టారని, మోసం చేశారని, తనకు ఒక్క పదవి కూడా రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కుటుంబంలో ఎవరూ తక్కువ వాళ్ళు కాదని పేర్కొన్న లక్ష్మీపార్వతి ఇప్పుడు టిడిపి దయనీయమైన పరిస్థితుల్లో ఉందని, అందుకు కారణం పార్టీ లో కొత్తగా వచ్చిన కుక్కమూతి పిందెలు అని వ్యాఖ్యానించారు.

 లోకేష్ ను లీడర్ చెయ్యాలన్న కోరికే టీడీపీ నాశనానికి కారణం

లోకేష్ ను లీడర్ చెయ్యాలన్న కోరికే టీడీపీ నాశనానికి కారణం

నారా లోకేష్ ను ఉద్దేశించి ఆ కుక్క మూతి పిందెకు ఏం తెలుసని పార్టీ లీడర్ గా చేశారని ప్రశ్నించారు లక్ష్మీపార్వతి. లోకేష్ వల్లే పార్టీ నాశనమైందని అభిప్రాయపడ్డారు. లోకేష్ లాంటి అసమర్ధుని చంద్రబాబు నాయుడు పార్టీ మీద బలవంతంగా రుద్దారని పేర్కొన్న లక్ష్మీపార్వతి లోకేష్ నాయకత్వంపై పార్టీలో చాలామంది లోలోపల బాధ పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ వంటి గొప్ప వ్యక్తి స్థాపించిన పార్టీకి లోకేష్ నాయకుడా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన ఈ తప్పిదమే పార్టీని సర్వనాశనం చేస్తుందన్నారు.

మనవడే నిందలు వేశాడని ఫైర్ .. వాళ్ళు బంధువులా .. వద్దు అని ఆగ్రహం

మనవడే నిందలు వేశాడని ఫైర్ .. వాళ్ళు బంధువులా .. వద్దు అని ఆగ్రహం

ఎన్నికల ముందు నా మనవడే నాపై దారుణమైన నిందలు వేయాలని చూశాడని ఆవేదన చెందిన ఆమె 60 ఏళ్లు దాటిన దాన్ని నా వయసును కూడా చూడకుండా భయంకరమైన నింద వేసి అప్రతిష్టపాలు చేయాలని చూస్తారా అంటూ నిప్పులు చెరిగారు. 30 ఏళ్ల వయసులోనే లేనిది 60 ఏళ్ల వయసులో నాపై దారుణమైన అభాండాలు వేశారని అలాంటి వాళ్లు బంధువులెలా అవుతారని వ్యక్తం చేశారు లక్ష్మీపార్వతి. ఇంత నీచానికి పాల్పడిన వాళ్లతో బంధుత్వం తనకు వద్దని, మనవడు లేడు అల్లుడు లేడు అంటూ తనదైన శైలిలో చంద్రబాబుపై, నారా లోకేష్ పై విరుచుకు పడ్డారు లక్ష్మిపార్వతి.

లోకేష్ అయోగ్యుడు అంటూ వ్యాఖ్యానించిన లక్ష్మీ పార్వతి

లోకేష్ అయోగ్యుడు అంటూ వ్యాఖ్యానించిన లక్ష్మీ పార్వతి

ఇప్పటికే ఒకపక్క వల్లభనేని వంశీ, మరోపక్క కొడాలి నాని వంటి నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు, తిడుతున్న తిట్లకు సమాధానం చెప్పలేక, ఎదుర్కోలేక టిడిపి నాయకులు నానా తంటాలు పడుతున్నారు. ఇక తాజాగా లక్ష్మీపార్వతి సైతం నారా లోకేష్ కుక్కమూతి పిందె అని వ్యాఖ్యానించటం, అయోగ్యుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు టిడిపి నేతలకు తలనొప్పిగా మారింది.

లోకేష్ ను ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి .. డిఫెన్స్ లో లోకేష్

లోకేష్ ను ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి .. డిఫెన్స్ లో లోకేష్

ఏ మాత్రం అవకాశం వచ్చినా అటు అల్లుడు చంద్రబాబును, ఇటు మనవడు నారా లోకేష్ ను ఏకిపారేస్తున్నారు లక్ష్మి పార్వతి. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మొన్నటికి మొన్న వల్లభనేని వంశీ లోకేష్ ను పప్పు... పప్పు అని పదే పదే వ్యాఖ్యానిస్తే ఇక తాజాగా లక్ష్మి పార్వతి కుక్కమూతి పిందె అని కొత్త పేరు పెట్టి మనవడు లోకేష్ ను డిఫెన్స్ లో పడేశారు.

English summary
YSR Congress leader, telugu academy chair person Lakshmi Parvathi Asked what he did to Nara Lokesh as party leader. Because of the Lokesh party has been destroyed. Laxmiparvati, who claimed that Chandrababu Naidu was forcing the party to accept the leadership of Lokesh. This mistake made by Chandrababu is destroying the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X