వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగనే కరెక్ట్- ఎన్టీఆర్ పేరు మార్పు సబబే-వెన్నుపోటుదారులకు హక్కులేదు-లక్ష్మీపార్వతి కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై జరుగుతున్న రాజకీయంపై దివంగత ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నేత లక్ష్మీపార్వతి తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్ పేరు మార్పును ఆమె సమర్ధించారు. ఈ విషయంలో జగన్ వాదన సమర్ధనీయంగా ఉందన్నారు. అలాగే తనపై ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారంపైనా లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు. గతంలో చోటుచేసుకున్న పరిణామాల్ని ఆమె మరోసారి గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో జగన్, జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్

లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్

ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్పు నేపథ్యంలో ఏపీలో జరుగుతున్న రాజకీయ మాటలయుద్ధంలోకి ఆయన భార్య లక్ష్మీపార్వతి చేరారు. ఎన్టీఆర్ పేరును వైసీపీ సర్కార్ మార్చేస్తుంటే లక్ష్మీపార్వతి మౌనంగా ఉన్నారంటూ వస్తున్న విమర్శలపై ఆమె ఇవాళ స్పందించారు.

తాడేపల్లిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ పేరుమార్పుతో పాటు దీనిపై వస్తున్న విమర్శలు, అవి చేస్తున్న నేతలపై లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్టీఆర్ కు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారు, దానిపై ఎల్లోమీడియా స్పందన అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉందన్న దానిపైనా లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 చరిత్రను చెరిపేయలేరన్న లక్ష్మీపార్వతి

చరిత్రను చెరిపేయలేరన్న లక్ష్మీపార్వతి

తన వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తిరుపతిలో సాక్షుల సమక్షంలోనే ఎన్టీఆర్ తో తన పెళ్లయిందని, ఎన్టీఆర్ తో తన పెళ్లి చంద్రబాబుకు ముందునుంచీ ఇష్టం లేదని లక్ష్మీపార్వతి తెలిపారు. తమ పెళ్లిపై మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదన్నారు. ఎన్టీఆర్ తో తన పెళ్లిపై మాట్లాడితే కేసులు పెడతానన్నారు. తనను రాజకీయాల్లోకి తెస్తానని ఎన్టీఆర్ ఎప్పుడూ చెప్పలేదన్నారు.

తాను రాజకీయాల్లోకి వస్తానని ఆయనకు ఎప్పుడూ చెప్పలేదన్నారు. టెక్కలి నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ఇవే పేపర్లు దుష్ప్రచారం చేశాయని,టెక్కలి సీటు ఆఫర్ చేసినా తాను తీసుకోలేదన్నారు. గోరంట్ల సీటునుంచి పోటీకి సత్యసాయి బాబా సోదరుడు అడిగినా తాను ఒప్పుకోలేదన్నారు. ఆస్తులన్నీ పిల్లలకు పంచేశాక తాను ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చానన్నారు. తాను రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించానన్న విమర్శల్ని ఆనాడే ఎన్టీఆర్ ఖండించారని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు.భార్యను రాజకీయ వారసురాలిగా ప్రకటిస్తానని భావిస్తే అది చిన్నతనంగా భావిస్తానని ఎన్టీఆర్ చెప్పిన మాటల్ని గుర్తుచేసుకున్నారు.

 ఎన్టీఆర్ కు ద్రోహం చేయనని మాటిచ్చి...

ఎన్టీఆర్ కు ద్రోహం చేయనని మాటిచ్చి...

ఎన్టీఆర్ మంత్రి పదవి ఇస్తానన్నా తాను వద్దన్న విషయం మోహన్ బాబును అడిగితే చెప్తారని లక్ష్మీపార్వతి తెలిపారు.ఎన్టీఆర్ స్వయంగా ఈ విషయాన్ని మోహన్ బాబుకు చెప్పారన్నారు. టీడీపీ విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. చంద్రబాబు-దగ్గుబాటి విభేధాల వల్లే టీడీపీ 1989లో ఓడిపోయిందని ఎన్టీఆర్ చెప్పారన్నారు.

హెరిటేజ్ పాలు తాగిన కుక్కలు మొరుగుతున్నాయని లక్ష్మీపార్వతి విమర్శించారు. వీరంతా కలిసి ఎన్టీఆర్ ను హత్య చేశారన్నారు. భారీ మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్ పై 8 నెలల్లోనే ఊరికే అసమ్మతి వస్తుందా అని ఆమె ప్రశ్నిచారు.నేను రాజ్యాంగేతర శక్తి అన్న భ్రమను ఆనాడు మీడియా ప్రజల్లో కల్పించిందన్నారు. అదే ద్రోహులు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు. లక్ష్మీపార్వతికి అధికార కాంక్ష ఉంటే చంద్రబాబుకు రెండు కీలక శాఖలు ఎలా వచ్చేవని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ బతికున్నంత వరకూద్రోహం చేయనని చంద్రబాబు తన చేతిలో చెయ్యిపెట్టి ప్రమాణం చేశారని ఆమె గుర్తుచేశారు.

ఎన్టీఆర్ కుటుంబంలో రెండు ఆడ దుష్టశక్తులున్నాయని, ఎన్టీఆర్ కుటుంబంలో మగపిల్లలంతా అమాయకులేనన్నారు.ఎన్టీఆర్ గురించి ఇప్పుడు మాట్లాడటానికి పిల్లలు సిగ్గుపడాలన్నారు. ఎన్టీఆర్ కు నిజమైన వారసులు అభిమానులే తప్ప పిల్లలు కాదన్నారు. ఎన్టీఆర్ స్ధాపించిన పార్టీపై పిల్లలకు ఏం అధికారం ఉందన్నారు. ఎమ్మెల్యేలను వైశ్రాయ్ హోటల్లో బంధించి ఎన్టీఆర్ కు సెక్యూరిటీ కూడా లేకుండా చేశారని, అప్పటి స్పీకర్ యనమల ఈ వెన్నుపోటులో భాగస్వామయ్యారని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు.

 ఎన్టీఆర్ పేరుమార్పు కరెక్టే

ఎన్టీఆర్ పేరుమార్పు కరెక్టే

ఎన్టీఆర్ వర్శిటీ పేరుమార్పుపై నిజమైన అభిమానులు బాధపడితే అభినందించాలని, ఎన్టీఆర్ హంతకులు దీనిపై మాట్లాడుతున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై చంద్రబాబు-రాధాకృష్ణ మాట్లాడుకున్నారుగా, పేరుమార్పు నిర్ణయానికి వచ్చేశాక ఇప్పుడు విమర్శలెందుకని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ పేరు జిల్లాకు కావాలా, హెల్త్ యూనివర్శిటీకి కావాలా అంటే జిల్లాకే కావాలని చెప్తానన్నారు. యూనివర్శిటీ అనేది జిల్లా కంటే చిన్నదన్నారు. ఎన్టీఆర్ పేరు మార్పుపై సీఎం జగన్ అసెంబ్లీలోనే వివరణ ఇచ్చారని, జగన్ వాదన సమర్ధనీయంగా ఉందని లక్ష్మీపార్వతి తెలిపారు.త్వరలో సీఎం జగన్ ను కలుస్తానని, మరో పెద్ద ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టేలా ఒప్పిస్తానన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మనమెందుకు తప్పుబట్టాలని ఆమె ప్రశ్నించారు.

 జూనియర్ చుట్టూ కుట్రలు

జూనియర్ చుట్టూ కుట్రలు

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ హుందాగా స్పందించారని లక్ష్మీపార్వతి కితాబిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రకటనను అంతా స్వాగతిస్తున్నారని, జూనియర్ ఎన్టీఆర్ కు చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఆయన వ్యాఖ్యల్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. ఎన్టీఆర్ సినిమాల్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని, గతంలో టీడీపీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకోలేదాఅని చంద్రబాబును లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.

English summary
ysrcp leader lakshmi parvathy on today slams yellow media writings against her relation with late ntr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X