హత్యా రాజకీయాలు, వేల కోట్ల అవినీతి: బాబు, లోకేష్‌పై లక్ష్మీపార్వతి నిప్పులు
తూర్పుగోదావరి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆమె పెద్దాపురంలో మాట్లాడుతూ.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు, లోకేష్‌లేనని అన్నారు.

బాబు సర్కారు హయాంలో వేల కోట్ల అవినీతి
ఏపీలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనుల్లో రూ.37వేల కోట్లు దారి మళ్లాయని కాగ్ నివేదిక ఇచ్చిందని అన్నారు. రాజధాని నిర్మాణంలో రూ.700కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరిగిందని లక్ష్మీపార్వతి చెప్పారు. చంద్రబాబు ఇస్తానన్న కాపు రిజర్వేషన్లు కంటి తుడుపు చర్యేనని విమర్శించారు.

బాబువి హత్యా రాజకీయాలు
చంద్రబాబు సర్కారు హయాంలోనే హత్యా రాజకీయాలు జరిగాయని లక్ష్మీపార్వతి ఆరోపించారు. 19మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్య చేయించడం, అక్రమ కేసులు బనాయించిన ఘనత చంద్రబాబుదేనని మండిపడ్డారు.

అడ్డంగా దొరికి పారిపోయి వచ్చాడు
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు నాయుడు.. అమరావతికి పారిపోయి వచ్చారని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొని వ్యవసాయం గురించి మాట్లాడతాననటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

పోలవరం అవినీతి 12వేల కోట్లు
చంద్రబాబు.. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో రూ.12,350కోట్ల అవినీతికి పాల్పడ్డారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. అరకు మావోయిస్టుల కాల్పుల ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆమె అన్నారు. ఆంధ్రాలో ఉన్న ఇంటెలిజెన్స్‌ను హైదరాబాద్‌లో వాడుకోవడం వల్లే ఇక్కడ మావోయిస్టుల సమాచారం తెలుసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని లక్ష్మీపార్వతి విమర్శించారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications