‘బాబు కుట్ర, భయమేసేది! ఇష్టం లేకుండా మొదటి పెళ్లి, ఎన్టీఆర్ వల్లే మళ్లీ’: లక్ష్మీపార్వతి సంచలనం

Subscribe to Oneindia Telugu
బాబు కుట్ర భయమేసేది! ఇష్టం లేకుండా పెళ్లి : లక్ష్మీపార్వతి సంచలనం | Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన మొదటి పెళ్లి, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో జరిగిన రెండో పెళ్లికి దారితీసిన పరిణామాలపై వివరించారు.

విమర్శలు సహజమే..

విమర్శలు సహజమే..

‘నేను ఎన్టీఆర్ జీవితంలోకి రావడంపై చాలా విమర్శలు వచ్చాయి. అలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఏ మనిషినీ పూర్తిగా మంచి అని కానీ, లేదా చెడు అని గానీ అనం.. ఇది సహజమే' అని లక్ష్మీపార్వతి తెలిపారు.

రోజాపై క్లారిటీ ఇస్తా, ఆ దమ్ముంది: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌'పై రాకేష్ రెడ్డి సంచలనం

ఇష్టం లేకుండానే మొదటి పెళ్లి..

ఇష్టం లేకుండానే మొదటి పెళ్లి..

తన మొదటి భర్త గురించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే, నా మొదటి పెళ్లి ఇష్టం లేకుండా జరిగింది. అనుకోని పరిస్థితుల్లో అయిన పెళ్లి అది. మా అమ్మానాన్నలు కూడా ఆ పెళ్లిని తిరస్కరించారు. మాకు ఒక కొడుకు పుట్టిన తర్వాత.. నా భర్త, నేను దూరమయ్యాం. విభేదాల కారణంగా మేము విడిపోయాం. ఆ తర్వాత, నేను ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోయా' అని వివరించారు.

ఎన్టీఆర్ కోరుకోవడం వల్లే రెండో పెళ్లి..

ఎన్టీఆర్ కోరుకోవడం వల్లే రెండో పెళ్లి..

ఎన్టీఆర్, తాను పెళ్లి చేసుకోకుండా ఉండేందుకు నాడు కొందరు చాలా ప్రయత్నాలు చేశారని లక్ష్మీపార్వతి అన్నారు. ‘నాడు ఎన్టీఆర్ చాలా గట్టిగా ప్రయత్నించడం వల్లే మా పెళ్లి జరిగింది. మా పెళ్లి అయిపోయిన వెంటనే మాపై రాజకీయాలు మొదలయ్యాయి.

పుకార్లు ఎలా?

పుకార్లు ఎలా?

‘లక్ష్మీపార్వతి వచ్చిందిగా తెలుగుదేశం పార్టీ గెలవదు.., ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు గనుక ప్రజలు అంగీకరించడం లేదు.., ప్రజలందరూ చాలా కోపంగా ఉన్నారు.., ఆడవాళ్లయితే ఇంకా కోపంగా ఉన్నారు.. అనే అప్పటి పుకార్లపై ఆమె స్పందిస్తూ.. ఈ పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారనే విషయం తమకు అర్థమయ్యేది కాదని అన్నారు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్'పై తొలిసారి స్పందించిన బాబు, ఏమన్నారంటే..?

భయమేసేది..

భయమేసేది..

‘తెల్లవారిన తర్వాత పేపరు చూడాలంటే భయమేసేది. ఆయన (ఎన్టీఆర్) అయితే అసలు పేపర్ చూసే వారు కాదు! నాకేమో పేపర్ చదివే అలవాటు. పేపర్ చదివి నేను బాధపడేదాన్ని. నేను బాధపడుతుంటే..‘ఏమైంది పేపర్ చదివావా?'అని ఆయన అడిగేవారు. ‘అవును' అని నేను సమాధానం చెబితే.. ‘ఆ పేపర్ పక్కన పడెయ్. లేకపోతే, నీ బుర్ర పాడైపోతుంది' అనేవారు' అని లక్ష్మీపార్వతి తెలిపారు.

చంద్రబాబు కుట్రలు

చంద్రబాబు కుట్రలు

‘మేం(ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి) పెళ్లి చేసుకున్నాం కనుక టీడీపీ ఓడిపోతుందనే ప్రచారం మొదలైంది. నిజం చెప్పాలంటే.. ఈ ప్రచారానికి భయపడిన వాళ్లెవ్వరూ లేరు. అదంతా ఒక నటన, నాటకం. ఈ నాటకానికి కారణం మా చిన్నఅల్లుడు చంద్రబాబునాయుడు. చంద్రబాబునాయుడి కుట్ర ఎలా మొదలైందనే విషయం ఎన్టీఆర్ జీవిత చరిత్ర ‘తెలుగు తేజం'లో నేను రాశాను. ఎన్టీఆర్ జీవితంలోకి నేను ప్రవేశించక ముందు నుంచే ఆయన పదవిని తీసుకోవాలని చంద్రబాబు కుట్ర పన్నాడు. ఈ మాట నేను చెబుతున్నది కాదు. ఎన్టీఆర్ గారే చెప్పారు.' అని లక్ష్మీపార్వతి వివరించారు.

ఆ పాత్రికాధిపతికీ ఇష్టం లేదు..

ఆ పాత్రికాధిపతికీ ఇష్టం లేదు..

‘బాబు కుట్రపై నాతోనే కాదు, ప్రజల ముందే ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు. 1995 ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు కాకుండా చంద్రబాబునాయుడు పదవిలోకి రావాలని కుట్ర. ఎందుకంటే, అంతకుముందు నుంచే ఓ పత్రికాధిపతికి, ఈయన (ఎన్టీఆర్)కు పడటం లేదు. తన చెప్పుచేతల్లో ఉండే వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆ పత్రికాధిపతి ప్లాన్ వేశారు' అని ఆనాటి ఘటనలను వివరించారు లక్ష్మీపార్వతి. కాగా, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ లపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమా రూపొందిస్తున్న నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP leader Lakshmi Parvati responded on her marriage with Sr NTR and other issues.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి