సహలాలపుట్టుగ గ్రామాన్ని దత్తత తీసుకున్న లక్ష్మీనారాయణ
శ్రీకాకుళం: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మూడు రోజుల జిల్యా పర్యటన శనివారంతో ముగియనుంది. తన పర్యటనలో భాగంగా ఆయన శనివారం సహలాలపుట్టుగ గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు.
సహలాలపుట్టుగ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక వర్గం కాదు సమాజమే ముఖ్యమని అన్నారు. విమర్శలు చేస్తున్నవారు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడాలని హితవు పలికారు.

కాగా, ప్రజా సమస్యలపై అధ్యయనం నిమిత్తం మే 3న లక్ష్మీనారాయణ తన జిల్లా పర్యటనను ప్రారంభించిన విషయం తెలిసిందే. కిడ్నీ బాధితులు, రైతులు, చేనేత కార్మికుల స్థితిగతులపై అధ్యయనం చేస్తానని లక్ష్మీనారాయణ తెలిపారు.
మహారాష్ట్రలో విధుల నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, తాను త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని లక్ష్మీనారాయణ ఇటీవల ప్రకటించారు.












Click it and Unblock the Notifications