Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రగడ; జగన్, చంద్రబాబుల రాజకీయం వెనుక రీజన్ ఇదే!!

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమలు కాకముందే అధికార, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న రాజకీయం ఏపీ ప్రజలను అయోమయానికి గురిచేస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వాడుకోవడంలో భాగంగా వైసిపి, టిడిపి, జనసేనలు చేస్తున్న రగడ జనాలను డైలమాలో పడేస్తుంది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రాజకీయం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఏపీ ప్రజలు రెండు భాగాలుగా విడిపోయారు అంటే పరిస్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అనుకూల వర్గం, వ్యతిరేకించే వర్గంగా ఏపీ ప్రజలు తాజా రాజకీయ పరిణామాలతో మారారు. అసలు ఎందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్నికల సమయంలో రాజకీయం అయింది అన్నది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Land Titling Act controversy in AP This is the reason behind the politics of ys jagan and chandrababu

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద ప్రహసనం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. 1986లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకురావాలని ప్రయత్నించిన ఈ యాక్ట్, 2008లో, మళ్లీ 2010, 2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నాలు చేసింది. దానికోసం కీలక నిర్ణయాలను కూడా తీసుకుంది. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్ యూపీఏ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం ఏర్పాటుచేసిన ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చెయ్యాలని భావించింది.

ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ .. ఏపీలో అమలు
నీతి ఆయోగ్ సిఫార్సులతో, దీనిని డ్రాఫ్ట్ రూపంలోకి తీసుకువచ్చింది. అన్ని రాష్ట్రాలు దీనిని అమలు చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుకు ఏపీలోని జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అసెంబ్లీ వేదికగా దీనిని బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభ్యుల ఆమోదంతో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రం దీనిని ఆమోదించి అమలు చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీలో అమలుకు టైటిలింగ్ అధారిటీ ఏర్పాటు జరగలేదు
2023అక్టోబర్ 31నుంచి సాంకేతికంగా ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ, వాస్తవంగా ఇంకా అమలు కావడం లేదు. ఈ చట్టాన్ని అమలు చేయడానికి కావలసినటువంటి క్షేత్రస్థాయి నిర్మాణం టైటిలింగ్ అధారిటీ ఇంకా ఏర్పాటు జరగలేదు. అయితే ఎన్నికల సమయంలో చాలా చాలెంజింగ్ గా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఏపీలో అమలు చేసి భూములకు శాశ్వతరక్షణ కల్పిస్తామని, జగన్ సర్కార్ ఇందుకోసం చాలా కృషి చేసిందని వైసిపి చెప్పే ప్రయత్నం చేసింది.

Land Titling Act controversy in AP This is the reason behind the politics of ys jagan and chandrababu

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వైసీపీ అలా.. టీడీపీ, జనసేన ఇలా
ఇప్పటికే సమగ్ర భూముల సర్వే నిర్వహించిన వైసిపి ప్రభుత్వం, ఎటువంటి వివాదాలు లేకుండా క్లీన్ టైటిల్ తో సింగిల్ డాక్యుమెంట్ గా టైటిల్ రిజిస్ట్రేషన్ చేస్తామని, మీ భూములకు మాది భరోసా అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల సమయంలో వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ ద్వారా జరిగే మంచిని ప్రచారం చేస్తుంటే, దానిలో ఉన్న లొసుగులను టిడిపి, జనసేన జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వాడేస్తున్న రాజకీయ పార్టీలు
ఈ యాక్ట్ ద్వారా మీ భూముల పైన మీకు హక్కు ఉండదని, ప్రభుత్వ అధీనంలోకి మీ భూములు వెళ్లిపోతాయని, మీరు నేరుగా లోన్లు తీసుకునే అవకాశం ఉండదని, మీ భూముల పైన ఉన్న వివాదాలకు మీరు కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదని ప్రజలకు చెబుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వైసిపి అనుకూల ప్రచారం కోసం వాడుకుంటే, టిడిపి, జనసేన వైసిపి ప్రతికూల ప్రచారం కోసం వాడుతున్నాయి.

ఓటు బ్యాంకు రాజకీయమే
ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయ పార్టీలకు ఆయుధమైంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన అప్పిలేట్ వ్యవస్థ ఏర్పాటు కాకముందే, జరుగుతున్న ఈ రగడ జనాలలో కన్ఫ్యూజన్ కు ప్రధాన కారణంగా మారింది. ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకు రాకుండా ఉంటే, దీనిపై ఇంత చర్చ జరిగేది కాదు అనేది నిర్వివాదాంశం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+