రియల్టర్ అవతారమెత్తిన జగన్: రాజధానిలో ప్లాట్ల అమ్మకంతో భూంఫట్: విరుచుకుపడిన లంకా దినకర్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై బిజెపి నేత లంకా దినకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం రియల్టర్ అవతారమెత్తి రాజధాని భూములకు ఎసరు పెట్టిందని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపణలు గుప్పించారు. రాజధాని అమరావతి పరిధిలోని నవులూరులో భూములకు నూకలు చెల్లాయి అని జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల పేరుతో ప్లాట్ల అమ్మకానికి జగన్ సర్కార్ సిద్ధమైందని లంకా దినకర్ మండిపడ్డారు.

కిల్ అమరావతి అంటున్న జగనన్న .. ప్లాట్ల అమ్మకంతో భూంఫట్
సోషల్ మీడియా వేదికగా జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లపై స్పందించిన లంకా దినకర్ తనదైన శైలిలో జగన్ సర్కార్ పై మండిపడ్డారు. భలే మంచి చౌక బేరము ఇది సమయము మించినన్ దొరకదు అంటూ కిల్ అమరావతిఅంటున్న జగనన్న అంటూ సెటైర్లు వేశారు. ఏకంగా రియల్టర్ అవతారమెత్తి రాజధాని భూముల కు జగన్ ప్రభుత్వం ఎసరు పెట్టిందని ఆయన మండిపడ్డారు. 29 గ్రామాలలో ఉన్న రాజధాని ప్రాంతమైన నవులూరు భూములకు నూకలు చెల్లాయి అని, ప్లాట్లు అమ్మకం తో భూంఫట్ మొదలైందని లంకా దినకర్ అసహనం వ్యక్తం చేశారు.

బ్రోచర్లో సెక్రటేరియట్, హైకోర్టు దూరం ఎందుకు పేర్కొన్నారో?
అంతేకాదు ప్లాట్లు అమ్ముకునేందుకు బ్రోచర్లో సెక్రటేరియట్, హైకోర్టు దూరం తెలిపారు అంటే అమరావతి ఏకైక రాజధాని అని ఒప్పుకున్నట్టే కదా అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో మూడు రాజధానులు అని బొత్స సత్యనారాయణతో మరలా చెప్పించడం ప్లాట్లు కొనేవారిని మోసం చేయటం కాదా అంటూ లంకా దినకర్ ప్రశ్నించారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ బ్రోచర్ లో సెక్రటేరియట్ దూరం తెలపటం అంటే విశాఖ, కర్నూలు ప్రజలను మోసం చేయడం కాదా అంటూ లంకా దినకర్ నిలదీశారు.
మూడు రాజధానుల మూడు ముక్కలాట ఆడి, ఇప్పుడు రాజధాని 29 గ్రామాల మధ్యే జగన్ ఆట
జగనన్న ఇంతవరకు మూడు రాజధానులు పేరుతో మూడు ముక్కలాట ఆడి, ఇప్పుడు రాజధాని 29 గ్రామాల మధ్య ఆట మొదలు పెట్టాడని లంకా దినకర్ మండిపడ్డారు. సి ఆర్ డి ఏ రద్దు బిల్లు ఉపసంహరించి, సి ఆర్ డి ఎ ను బతికించింది రాజధాని భూములు అమ్ముకోవడం, అప్పు తెచ్చుకోవడం కోసమా అంటూ లంకా దినకర్ ప్రశ్నించారు. ప్రజల నుండి డబ్బులు లాగడానికి జగన్ తనను తాను మోసం చేసుకుంటూ హోల్ సేల్ గా అన్ని ప్రాంతాల ప్రజలను మోసం చేస్తున్నాడని లంకా దినకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

నాడు నీతి సూత్రాలు వల్లించి నేడు రియల్ ఎస్టేట్ వ్యాపారమా?
ఇదే సమయంలో నాడు నేడు అంటూ నాడు చంద్రబాబు హయాంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదని నీతిసూత్రాలు వల్లించిన విషయాన్ని, నాడు జగన్ చేసిన వ్యాఖ్యలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేసిన విషయాలను స్క్రీన్ షాట్ చేసి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పిన లంకా దినకర్, నేడు వైసీపీ ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల పేరుతో ప్లాట్లు అమ్మకానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఏ విధంగా శ్రీకారం చుట్టిందో తెలియజేస్తూ జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ బ్రోచర్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.
Recommended Video

జగన్ తీరుపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు
నాడు రైతుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదని అసెంబ్లీలో నిలదీస్తామని జగన్ అన్నారని, ప్రభుత్వం పాలన చేయాలే కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని జగన్ చెప్పారని, రైతులు ఇచ్చిన భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని టిడిపి పై జగన్ మండిపడ్డారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్టులను రీ పోస్ట్ చేసి జగన్ తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. నాడు చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడిన వైయస్ జగన్ నేడు చేస్తుంది ఏంటి అంటూ ప్రశ్నించారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లు దేనికోసం అంటూ లంకా దినకర్ జగన్ సర్కార్ కు సూటి ప్రశ్న వేశారు.












Click it and Unblock the Notifications