చంద్రబాబుకు బంపర్ ఆఫర్లు-ఇదే లాస్ట్ ఛాన్స్-ఊ అంటారా ? ఊహూ అంటారా ?
ఏపీలో 2019 ఎన్నికల తర్వాత రాజకీయంగా పూర్తిగా బలహీనపడ్డ చంద్రబాబుకు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం తాజాగా ఊపిరిలూదుతోంది. ఓవైపు చంద్రబాబు పని ఆయిపోయిందంటూనే మరోవైపు ఆయన్ను తక్కువ అంచనా వేస్తూ అస్త్రాలు అందిస్తోంది. దీంతో తాబేలు-కుందేలు కథలోలా ఏదైనా జరగొచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఇదంతా జరగాలంటే ముందు చంద్రబాబు అందివచ్చిన ఆఫర్లను ఎంతమేర వినియోగించుకుంటారన్న దానిపై ఆధారపడి ఉంటుంది.

అష్టదిగ్బంధనంలో జగన్
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్ని చూస్తుంటే సీఎం జగన్ గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తున్నారు. చేతిలో అధికారం ఉండటాన్ని మినహాయిస్తే మిగతా విషయాల్లో జగన్ పట్టు తప్పుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా చేపట్టిన కేబినెట్ ప్రక్షాళనే ఇందుకు నిదర్శనం. కేబినెట్ లో చోటు దక్కని వారు ఎన్నడూ లేనంత దారుణంగా రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. గతంలో చంద్రబాబు హయాంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కూడా ఇలా జరిగిన ఘటనలు అరుదుగానే కనిపిస్తాయి. దీంతోపాటు రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి సహకరించకపోవడం జగన్ చేతుల్ని కట్టిపారేస్తోంది. దీంతో రాజకీయంగా, ఆర్ధికంగా జగన్ పట్టు తప్పుతోంది.

పన్నుల మోతకు తెరదీసి
రాష్ట్రంలో గాడి తప్పిన ఆర్ధిక పరిస్ధితిని చక్కదిద్దాల్సింది పోయి ఇంకా అప్పులతోనే కాలక్షేపం చేసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ సర్కార్ తాజాగా అప్పులు కూడా పుట్టవనే నిర్ధారణకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. అందుకే తప్పనిసరి పరిస్ధితుల్లో జనంపై పన్నుల మోతకు సిద్ధమైపోతోంది. ఇప్పటికే చెత్త పన్ను విధించడమే కాకుండా ఆస్తిపన్ను, రిజిస్ట్రేషన్, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను పెంచేసింది. దీంతో వేసవిలో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదంతా అంతిమంగా విపక్షాలకు కలిసివస్తోంది.

చంద్రబాబుకు బంపర్ ఆఫర్లు
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన దగ్గరి నుంచి నానాటికీ బలహీనపడుతూ వస్తున్న విపక్ష నేత చంద్రబాబుకు రాజకీయంగా నిలదొక్కుకునేందుకు అవకాశాలు కూడా లభించడం లేదు. దీంతో ఆయన పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు. ఇలాంటి సమయంలో ఆయనకు జగన్ బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. పన్నులు, ఛార్జీల పెంపుతో ప్రజావ్యతిరేకత పెంచుకుంటున్నారు. ఆయా అంశాల్ని సమర్ధంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే విపక్ష టీడీపీ తిరిగి పుంజుకోవడం ఖాయం. అంతే కాదు 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమరశంఘం పూరించే అవకాశం కూడా దక్కుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కాలం చంద్రబాబుకు ఆఫర్ల సీజన్ గా మారనుందనే అంచనాలున్నాయి.

చంద్రబాబు ఊ అంటారా ఊహూ అంటారా ?
రాష్ట్రంలో ప్రస్తుతం పన్నులు, ఛార్జీల పెంపుతో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంటున్న వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి విపక్షాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే అది ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దెదించే స్ధాయిలో ఉంటుందా లేదా అన్నదే ప్రశ్న. ముఖ్యంగా ప్రధాన విపక్షమైన టీడీపీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితేనే రాష్ట్ర రాజకీయాల్లో ఉనికి కాపాడుకుంటుంది. ఇప్పటికే వరుస ఎన్నికల్లో ఓటములతో దిగాలుపడ్డ టీడీపీకి ఇప్పుడు ప్రజావ్యతిరేకతను సొమ్ము చేసుకోవడం తక్షణావసరంగా మారింది. ఇందులో విఫలమైతే మాత్రం 2024 ఎన్నికలకు ముందే వైసీపీ ముందు మోకరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే టీడీపీ స్ధానంలో ఇతర పార్టీలు చేరినా ఆశ్చర్యం లేదనే అంచనాలు వినిపిస్తున్నాయి.
-
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications