పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన భారత మహిళ, మెగా కోడలు అదిరిపోయే కౌంటర్
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన పిరికిపందల ఉగ్రదాడి యావత్ భారతావనిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ దారుణ ఘటనకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.
హైదరాబాద్ నగరంలో విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శక్తులపై నినాదాలు చేస్తూ, తమ నిరసనను వ్యక్తం చేశారు. "ఉగ్రవాదం నశించాలి", "భారతమాతకు జై" అంటూ వీధులన్నీ మార్మోగాయి. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇదే తరహా నిరసనలు కొనసాగుతున్నాయి.సోషల్ మీడియా వేదికగానూ ప్రజల ఆగ్రహం వెల్లువెత్తుతోంది. #PahalgamAttack, #IndiaAgainstTerrorism వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో తమ బాధను, కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
While our soldiers protect the nation with their lives, it’s disheartening to see some supporting those who harm it.
— Lavanyaa konidela tripathhi (@Itslavanya) April 29, 2025
It’s time to cleanse the country from within. https://t.co/Tl98IkwgRB
ఈ నిరసనల్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం. మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా భారతీయులందరూ ఒక్కతాటిపై నిలబడి ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నారు. ఈ సంఘీభావం దేశ ఐక్యతను చాటి చెబుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి యావత్ భారతావనిని కలిచివేసింది. అయితే కొందరు ఇక్కడున్న వారు పాకిస్థాన్‌కు మద్దతు తెలపడం సంచలనంగా మారింది.
ప్రజలు పాకిస్తాన్ జాతీయ జెండాలని రోడ్లపై అంటించి కాళ్లతో తొక్కుతూ నిరసన తెలిపారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో ఒక యువతి రూడ్లపై అంటించిన పాకిస్థాన్ జెండాలను తొలగించి,
కాళ్లతో తొక్కనివ్వకుండా అడ్డుకుంది.దీంతో స్థానికులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సదరు మహిళతో వాగ్వాదానికి దిగారు. పాకిస్తాన్ జెండాని తిరిగి రోడ్డుపై అంటించాలని కోరారు. కానీ దానికి ఆమె నిరాకరించింది.
పాక్ జెండాని రోడ్డుపై నుంచి ఎందుకు తీశావు.. ? మీరు పాకిస్తాన్ మద్దతిస్తున్నావా అంటూ ఆమెను స్థానికులు ప్రశ్నించారు. తిరిగి పాక్ జెండాని రోడ్డుపై వేయాలని లేకుంటే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని తెలిపారు. అయినా ఆ యువతి నిరాకరించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ వీడియోపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి రియాక్ట్ అయ్యారు."మన సైనికులు తమ ప్రాణాలతో దేశాన్ని రక్షిస్తుండగా, కొందరు దేశానికి హాని కలిగించే వారికి మద్దతు ఇవ్వడం చూడటం బాధాకరం.దేశం లోపలి నుండి శుద్ధి చేయాల్సిన సమయం ఇది" అంటూ ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
-
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications