పార్లమెంట్ ముందు ధర్నా: లక్ష్మీపార్వతి హెచ్చరిక

చిత్తూరు/న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీ పార్వతి మరోసారి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వకుంటే తాను పార్లమెంటు ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు. సుక్రవారం లక్ష్మీ పార్వతి శ్రీకాళహస్తిలో రాహు, కేతు పూజలు చేయించుకున్నారు.

Laxmi Parvathi demands Bharat Ratna to NTR

ఎన్టీఆర్‌‍కు భారతరత్న ఇవ్వాల్సిందేనని, ఆయనకు భారతరత్న వచ్చే వరకు కృషి చేస్తామని చంద్రబాబు రెండు రోజుల క్రితం మహానాడులో చెప్పిన విషయం తెలిసిందే. కేంద్రంలో తాము మద్దతిచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఉందని, కాబట్టి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతామన్నారు.

స్మృతి ఇరానితో చంద్రబాబు భేటీ

కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం నుంచి చంద్రబాబు ఢిల్లీలో వరుస భేటీలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+