కృష్ణా జిల్లాలో షాక్: జగన్ పాదయాత్ర నుంచి వైసీపీ నేతల వాకౌట్, ఇదీ కారణం
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అలకలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. పెడన వైసీపీ ఇంచార్జ్ రాంప్రసాద్, మున్సిపల్ చైర్మన్ ఆనంద ప్రసాద్ అనుచరులు అలిగి వెళ్లిపోయారని తెలుస్తోంది.
పెడన నియోజకవర్గంలో జోగి రమేష్ జోక్యం పెరిగిందని వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. దీంతో పాదయాత్ర మధ్యలోనే వెళ్లిపోయారు. వారు మధ్యలోనే వెళ్లిపోవడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు.

150వ రోజుకు జగన్ పాదయాత్ర
వైయస్ జగన్ పాదయాత్ర మంగళవారానికి 150వ రోజుకు చేరుకుంది. ఉదయం గూడురు మండలం పర్ణశాల నుంచి యాత్ర ప్రారంభమైంది. మేడే సందర్భంగా జగన్ జెండాను ఆవిష్కరించారు. గూడూరు, రామరాజుపాలెం క్రాస్‌ల మీదుగా మచిలీపట్నం నియోజకవర్గంలోని సుల్తా నగరంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. సాయంత్రం కోనేరు సెంటర్లో భారీ బహిరంగ సభలో మాట్లాడుతారు.

నిమ్మగడ్డలోకి జగన్ అడుగు పెట్టారు ఇలా!
సోమవారం జగన్ నిమ్మకూరులో పర్యటించిన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని కూడా ప్రకటించారు. విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై నిమ్మకూరు అడ్డరోడ్డు వద్దకు ఆయన యాత్ర చేరుకుంది. అక్కడ వైసీపీ కార్యకర్తల అభ్యర్థన మేరకు నిమ్మకూరులోకి ప్రవేశించారు.

లోకేష్ దత్తత తీసుకున్న గ్రామంలోనే ఇంత అవినీతి
గ్రామానికి చెందిన నందమూరి పెద వెంకటేశ్వర రావు, నందమూరి ప్రభు తదితరులు ఎన్టీఆర్ బంధువులమని చెప్పి, గ్రామంలోని ఊర చెరువులో అక్రమాలు చోటు చేసుకున్నాయని జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరును, కృష్ణా జిల్లాను అభివృద్ధి చేస్తానని చెప్పారు. చెరువు మూడు, నాలుగు అడుగుల లోతు తవ్వితే రైతులకు ఉఫయోగకరంగా ఉండేదని, నీరు - చెట్టు పథకాన్ని అడ్డం పెట్టుకొని పనిలో కూలీలు కనిపించకుండా పొక్లెయినర్‌తో ఏకంగా 45 నుంచి 50 అడుగులలోతు తవ్వకాలు జరిగాయని ఆరోపించారు. మట్టి తవ్వినందుకు ప్రభుత్వం నుంచి రూ.8.5 లక్షలు తీసుకున్నారన్నారు. ఎన్టీఆర్ స్వగ్రామాన్ని మంత్రి నారా లోకేష్ దత్తత తీసుకున్నారని, ఇక్కడ కూడా అక్రమాలు ఏవిధంగా జరుగుతున్నాయో చెప్పనక్కర లేదన్నారు.
ఎన్టీఆర్ జిల్లా పేరుపై జగన్ ట్వీట్
ఇదిలా ఉండగా, తాము అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించిన వైసీపీ అధినేత వైయస్ జగన్ ట్విట్టర్‌లోను ఈ అంశంపై స్పందించారు. తెలుగు ప్రజల కోసం ఎన్టీఆర్ కృషి చేశారని, ముఖ్యంగా అణగారిన వర్గాల వారికోసమన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని ఆయనకు అది నివాళి అన్నారు.
-
జాన్వీ కపూర్ ఇష్టపడే రాయలసీమ స్పెషల్ రెసిపీ.. ఇలా ఈజీగా చేసుకోండి.. -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications