ఇంగ్లీష్ నేర్చుకో: జగన్, పేపరెత్తుకెళ్లిన నీదగ్గరా: కాల్వ

హైదరాబాద్: మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఇంగ్లీష్ నేర్చుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. దీనిపై కాల్వ శ్రీనివాసులు స్పందిస్తూ... పదో తరగతిలోనే పేపర్లు ఎత్తుకెళ్లిన జగన్ నుండి ఇంగ్లీష్ నేర్చుకోవాలా అని ప్రశ్నించారు.

బెంగళూరు నుండి జగన్ రాకుండా చూడాలని రోశయ్యను విజయమ్మ బతిమాలారని విమర్శించారు. అంతకుముందు మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ..... నాడు సరైన వాదనలు వినిపించక పోవడం వల్లే అల్మట్టి ఎత్తు పెరిగిందన్నారు.

జగన్ గోబెల్స్ ప్రచారానికి దిగుదున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వస్తే పాఠాలు చెబుతామన్నారు. దీంతో ఓ సమయంలో జగన్ మాట్లాడుతూ... దేవినేని ఉమా ఇంగ్లీష్ నేర్చుకోవాలని హితవు పలికారు. దానికి కాల్వ కౌంటర్ ఇచ్చారు. ఆయితే కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యల పైన శాసన సభలో దుమారం రేగింది.

Learn english, says YS Jagan to Devineni

జగన్‌ ఎప్పటికీ సీఎం కాలేరు: అచ్చెన్నాయుడు

జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తాము అధికారంలోకి వస్తామంటూ బుధవారం అసెంబ్లీలో జగన్‌ వ్యాఖ్యానించడంపై మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. జగన్‌ ఎప్పటికీ అధికారంలోకి రాలేరని, జగన్‌తో పాటు అసెంబ్లీలో కూర్చోడానికే బాధపడుతున్నామన్నారు.

సుప్రీం జడ్జిమెంట్‌ను కించపరిచారు: శివాజీ

జగన్ మాట్లాడుతూ.. అత్యున్నత సుప్రీం కోర్టు తీర్పును కించపరిచారని ఎమ్మెల్యే శివాజీ అన్నారు. వీడియో ఫుటేజీ చూసి స్పందిస్తామని సభాపతి కోడెల శివప్రసాద్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+