లెక్చరర్ అయి ఉండి: కాల్ గర్ల్ అంటూ ఫోటో, ప్రేమించనందుకు కక్ష!

Subscribe to Oneindia Telugu

తిరుపతి: తిరుపతి అంబేడ్కర్‌ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ విద్యార్థినిపై అదే కళాశాలకు చెందిన లెక్చరర్ ముచ్చకాయల నారాయణ వేధింపులకు పాల్పడ్డాడు. తనను ప్రేమించాలని చెన్నైకి చెందిన ఆ విద్యార్థినిని వేధించాడు.

లెక్చరర్ తీరుతో విసిగిపోయిన విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో.. వారు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో యాజమాన్యం ఈ ఏడాది మార్చిలో అతన్ని విధుల నుంచి తొలగించింది. కాలేజీ యాజమాన్యం చర్యలతో విద్యార్థినిపై కక్ష పెంచుకున్న నారాయణ.. ఆమె ఫొటోను కాల్‌గర్ల్‌ పేరుతో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.

lecturer harassed student to love him

లెక్చరర్ నిర్వాకంతో షాక్ తిన్న విద్యార్థిని ఈస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు సామాజిక మాధ్యమాల్లో ఆమెకు పంపిన మెసేజ్‌లను సేకరించి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట నిందితుడిని హాజరుపరిచారు. దీంతో ఈనెల 24వతేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Narayana, A lecturer in private college in Tirupati was harassed student to love him. She complained to police

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి