వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాకీ చెల్లించలేదు: సోనియాపై ఎఫ్ఐఆర్ నమోదు

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కేరళలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కేరళలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ భవనం నిర్మించిన కాంట్రాక్టర్‌ ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. తనకు చెల్లించాల్సిన డబ్బు ఇంకా చెల్లించలేదని సోనియాగాంధీ సహా మరికొందరు కాంగ్రెస్‌ నేతలపై ఆయన ఫిర్యాదు చేశారు.

ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన ఇతర నేతలు రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ ఛైర్మన్‌ రమేశ్‌ చెన్నితల, కేరళ మాజీ సీఎం ఉమెన్‌ చాందీ, కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(కేపీసీసీ) ప్రెసిడెంట్‌ వీఎం సుధీరన్‌. కాగా,
కేరళ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత వైరాల కారణంగా కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

sonia

హీతర్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ రాజీవ్‌ మాట్లాడుతూ.. తిరువనంతపురంలో ఇన్‌స్టిట్యూట్‌ నిర్మించడానికి తమకు కాంట్రాక్టు ఇచ్చారని బకాయిలు మాత్రం ఇంకా చెల్లించలేదని వెల్లడించారు. రమేశ్‌ చెన్నితల గతంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో ప్రాజెక్టు ప్రారంభించారని.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పేరుమీద ఎలాంటి డబ్బు లేదని కేపీసీసీ వెల్లడించింది.

కాగా, సోనియాగాంధీ 2005లో ఈ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభోత్సవం చేశారు. బకాయిలు చెల్లించాలని కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లీగల్‌ నోటీసులు పంపడంతో కేపీసీసీని బకాయిలు చెల్లించాల్సిందిగా ఆదేశించారు. కానీ, చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ ఫిర్యాదుతో బుధవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

English summary
In a major embarrassment to the Congress, an FIR was filed against the party President Sonia Gandhi by a Kerala-based construction company on Wednesday, June 8.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X