గందరగోళం, 2ని.లకే: డీలాపడ్డారని గాదెతో వీరశివా

 Legislative Assembly adjourned one hour
హైదరాబాద్: శాసన సభ ప్రారంభమైన రెండు నిమిషాలకే గంటసేపు వాయిదా పడింది. తెలంగాణ బిల్లు పైన చర్చకు మంగళవారం బిఏసిలో నిర్ణయించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు శాసన సభ ప్రారంభం కాగానే ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీలో సమైక్యంపై తీర్మానం చేయాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీంతో గందరగోళం ఏర్పడగా, స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు.

అంతకుముందు ఆయా పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వాటన్నింటిని స్పీకర్ తిరస్కరించారు. సమైక్య, తెలంగాణ ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చను కోరుతూ తెలుగుదేశం, సమైక్య తీర్మానం కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తీర్మానం ఇచ్చాయి.

సభ జరగనివ్వం: దేవినేని

రాష్ట్రానికి వీరప్ప మొయిలీ, చిదంబరం, సుశీల్ కుమార్ షిండేలు మోసం చేశారని సభ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద టిడిపి సీమాంధ్ర ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియచెప్పాల్సి ఉందన్నారు. సీమాంధ్ర సమస్యలు పరిష్కరించే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో తాము సభను అడ్డుకుంటామన్నారు. నిబంధనలు పాటించకుండా విభజన జరుగుతోందన్నారు. ఢిల్లీలోని పెద్దలు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీశారన్నారు.

బిల్లుపై చర్చించాలి: జూలకంటి

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చించేందుకు అందరూ సహకరించాలని సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. ప్రజాసమస్యల పైన చర్చించకుండా సభను అడ్డుకోవడం సరికాదన్నారు. అవసరమైతే సమావేశాలు పొడిగించి ప్రజా సమస్యలు చర్చించాలన్నారు. తెలంగాణపై అన్ని పార్టీల సభ్యులు అభిప్రాయాలు చెప్పాలన్నారు.

వీరశివా, గాదెల మధ్య ఆసక్తికర చర్చ

అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రి వీరశివా రెడ్డి, ఎమ్మెల్యే గాదె వెంకట రెడ్డిల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆర్టికల్ 371డి సవరణ జరిగితేనే విభజన సాధ్యమని, విభజన ఎట్టి పరిస్థితుల్లోను అసాధ్యమని, అప్పుడే ఏమైంది ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయని గాదె అన్నారు. దానికి వీరశివా రెడ్డి మాట్లాడుతూ... విభజన ఆగుతుందన్న నమ్మకం లేదని, కాంగ్రెసు ఇవ్వకపోయినా బిజెపి ఇస్తుందని, మనవాళ్లు డీలా పడిపోయారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+