జగన్ కంటే వైసీపీలో ఆ నేతే ఇప్పుడు గొప్ప, గౌరవం..!!
వైసీపీ తాజా ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయింది. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్ల సంఖ్య దక్కలేదు. దీంతో..మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రతిపక్ష నేత హోదా రాలేదు. సభలో మూడు పార్టీల కూటమి అధికారంలో ఉండటంతో..ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేసారు. ఇక..జగన్ అసెంబ్లీలో వైసీపీ పక్ష నేత గానే కొనసాగుతున్నారు. ఇదే సమయంలో అదే పార్టీకి చెందిన మరో నేతకు మాత్రం కొత్త గుర్తింపు దక్కింది.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత శాసన మండలిలో విపక్ష నేత ఖరారు పైన మండలి ఛైర్మన్ వైసీపీ అధినేత అభిప్రాయం కోరారు. జగన్ సూచన మేరకు పార్టీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసారు. గుంటూరుకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి జగన్ ప్రభుత్వం హయాంలో కేవలం ఒక ఎమ్మెల్సీ. వైసీపీ కార్యాలయ కార్యదర్శి కూడా. అప్పటి సీఎం జగన్‌తో పోల్చుకుంటే అప్పిరెడ్డి స్థాయి చిన్నది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

ఈ హోదాకు తగినట్టుగా అప్పిరెడ్డికి ప్రత్యేక చాంబర్, ప్రోటోకాల్, గౌరవమర్యాదలు లభిస్తాయి. కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రికి మాత్రం ఇవేవీ ఉండవు. 58 స్థానాలు కలిగిన శాసనమండలిలో వైసీపీకి 38 సభ్యుల బలం ఉంది. దీంతో అప్పిరెడ్డిని ఆ సభలో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం గుర్తించింది. ఆ హోదా లేని కారణంగా అప్పిరెడ్డికి లభించే గౌరవమర్యాదలు, ప్రోటోకాల్ జగన్‌కు లభించవు. జగన్ మాజీ సీఎంగా..వైసీపీ పక్ష నేతగా అసెంబ్లీకి హాజరు కానున్నారు. ప్రస్తుతం మండలిలో వైసీపీకే మెజార్టీ సభ్యుల బలం ఉంది.












Click it and Unblock the Notifications