ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం.. టెన్షన్‌లో స్టూడెంట్స్ !!

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తోందనే సమాచారం కలకలం రేపుతోంది. యూనివర్సిటీ క్యాంపస్‌లోని యూనియన్ బ్యాంక్ ప్రాంతంలో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్ధులు భయాందోళన చెందుతున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశంగా మారింది.

సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు..

కాగా సంక్రాంతి పండుగ రోజున రాత్రి 12.50 గంటల నుంచి 1.05 గంటల మధ్య చిరుత యూనివర్సిటీ ప్రాంగణంలో సంచరించినట్లు సీసీ కెమెరా ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమయంలో అక్కడున్న ఒక కుక్కను నోట కరుచుకుని చిరుత తీసుకెళ్లిన దృశ్యాలు కూడా నమోదయ్యాయి. అలానే పాపులేషన్ స్టడీస్ భవనం సమీపంలో ఒక జింకను చిరుత వేటాడిన ఆనవాళ్లు కూడా లభించాయి. జింకను చంపి కొంత భాగం తిని, మిగిలిన కళేబరాన్ని అక్కడే వదిలేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన కూడా క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డైంది.

leopard-at-sri-venkateswara-university-in-tiurpati

అటవీశాఖ అప్రమత్తం..

ఈ వరుస ఘటనలతో యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది ఈ సమాచారాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. చిరుత కదలికలను గమనించేందుకు క్యాంపస్ పరిసరాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత సంచారం ఉన్న ప్రాంతాల్లో సిబ్బందిని బీట్ డ్యూటీకి కేటాయించారు. రాత్రి వేళల్లో అనవసరంగా బయట తిరగవద్దని విద్యార్థులు, సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.

ఈ మేరకు యూనివర్సిటీ సెక్యూరిటీ అధికారి మోహన్ నాయుడు మాట్లాడుతూ.. విద్యార్థులు గుంపులుగా మాత్రమే కదలాలని, రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు రావద్దని సూచించారు. ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సెక్యూరిటీ లేదా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అయితే ప్రస్తుతం చిరుత క్యాంపస్ పరిసరాల్లోనే ఉందా? లేక అడవుల్లోకి వెళ్లిందా? అనే విషయంపై అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు అప్రమత్తత అవసరమని అధికారులు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+