అనుమానంతో భార్యను హత్య చేసిన జీవిత ఖేదీ

 death
హైదరాబాద్: పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన ఓ వ్యక్తి తన భార్యను పొట్టన పెట్టుకున్నాడు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన అతను పెరోల్‌పై బయటకు వచ్చి తన భార్యను కత్తులతో పొడిచి చంపాడు. హైదరాబాదులోని రామంతపూర్‌లో ఈ ఘటన సోమవారంనాడు చోటు చేసుకుంది. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో అతను ఈ హత్యకు పాల్పడ్డాడు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం- రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామానికి చెందిన ఎస్ వీరు (36) హైదరాబాదులోని చార్మినార్‌లో టైలరింగ్ పనిచేసేవాడు. 12 ఏళ్ల క్రితం అఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉండే సంగీతను ప్రేమించాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్ిచన వీరు తనపై కేసులు ఎత్తేశారని నమ్మబలికి రామంతపూర్‌లోని గాంధీనగర్‌కు చెందిన బసంతి కూతురు నందిని(30)ని పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ధనుష్ (10) అనే కుమారుడు ఉన్నాడు.

ఆ తర్వాత వీరుకు సంగీత హత్య కేసులో జీవిత ఖైదు పడింది. భర్త జైలుకు వెళ్లినప్పటి నుంచి నందిని అమ్మగారి ఇంటి పక్కనే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటూ దుస్తుల దుకాణంలో పనిచేస్తూ వస్తోంది. ఏడేళ్ల తర్వాత ఈ నెల 3వ తేదీన పెరోల్‌పై వీరు బయటకు వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి అనుమానంతో భార్యతో గొడవలు పడుతున్నాడు.

సోమవారంనాడు నందిని భోజనం చేస్తుండగా వీరు ఇంటికి వచ్చాడు. ఆమెతో గొడవకు దిగాడు. పథకం ప్రకారమే వ్చిచన అతను తన వద్ద ఉన్న కత్తితో ఆమెను పొడిచాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన కుమారుడు అడ్డుకోబోయాడు. అతనిపై కూడా వీరు దాడి చేశాడు. ఆస్పత్రికి తరలించేలోగానే నందిని మృతి చెందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+