మోడీ అంకుల్.. ఎంప్లాయిస్ ట్రైన్ కు ఏమైంది?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విభజిత ఏపీ తనకు రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకుంది. అప్పటివరకు హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగులు అమరావతికి రావడానికి వీలుగా ఉంటుందని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చొరవ తీసుకొని కేంద్రంతో మాట్లాడారు. ఉద్యోగస్తులు, ఇతర ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదగా కేంద్ర ప్రభుత్వం ఒక రైలును ఏర్పాటు చేైసింది.
రైలును ప్రారంభించినప్పుడు సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు నడిపారు. ప్రస్తుతం లింగంపల్లి నుంచి నడుపుతున్నారు. లింగంపల్లిలో తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి 10.15 గంటలకు సికింద్రాబాద్ కు, 11.20 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.

నల్గొండ, గుంటూరు, మంగళగిరి స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఎంప్లాయిస్ ట్రైన్ గా ఇది పేరు పొందింది. ప్రభుత్వ ఉద్యోగులు అమరావతి చేరుకోవడానికి వీలుగా దీన్ని నడుపుతున్నారు. మొదట్లో మంచి పేరు తెచ్చుకున్న ఈ రైలు నిర్వహణ రోజురోజుకు దిగజారిపోతోంది. బోగీల్లోకి నీరు రావడం, సీట్ల దగ్గర చెత్తాచెదారం చేరుకోవడంతోపాటు ఈ రైలులో కూర్చొని ప్రయాణం చేస్తే నడుం నొప్పి రావడం ఖాయం. ఎందుకంటే సీట్లు ఇరుగ్గా ఉండి నాలుగు గంటల ప్రయాణానికే ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.
సమస్యలు ఏమైనా చెప్పుకుందామంటే టీసీ కూడా కనపడరు. టికెట్ల చెకింగ్ కు ఎవరూ రారు. రెండు నెలలకో, మూడు నెలలకో అధికారులకు గుర్తొచ్చినప్పుడు చెకింగ్ కు ఒక ఎగ్జామినర్ వస్తుంటారు. సీట్లకు ఫుట్ రెస్ట్ ఉండదు. ప్రయాణం చేసినంతసేపు విగ్రహంలా అలాగే కూర్చొని ప్రయాణించాల్సి వస్తోంది. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సికింద్రాబాద్ చేరుకుంటామనే పేరును ఇది చేరిపేసుకుంటోంది. విజయవాడ నుంచి బయలుదేరిన సమయంలో ఆలస్యంగా సికింద్రాబాద్, లింగంపల్లి చేరుకుంటోంది. ఇప్పటికైనా అధికారులు సమస్యలను పరిష్కరించాలని రైల్వే యూజర్స్ అసోసియేషన్ కోరుతోంది.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications