వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్రాంతి కోడిపందేలకు .. ఏపీలో బీఆర్ఎస్ రాజకీయాలకు లింక్.. ఇంట్రెస్టింగ్!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల భేటీ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ పార్టీ బిఆర్ఎస్ వేస్తున్న అడుగులు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఏపీలో కాలు పెట్టటం కోసం గులాబీ బాస్ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది.

సరిహద్దు రాష్ట్రాలపై సీఎం కేసీఆర్ ఫోకస్

సరిహద్దు రాష్ట్రాలపై సీఎం కేసీఆర్ ఫోకస్


సరిహద్దు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ సరిహద్దు రాష్ట్రాలలో పార్టీ పట్టు పెంచుకునేందుకు రంగంలోకి దిగారు. సంక్రాంతి పండుగ తర్వాత కెసిఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలను బరిలోకి దింపి పొరుగు రాష్ట్రాలలోని కీలక నేతలను, ముఖ్యంగా సరిహద్దు జిల్లాలలోని నేతలను బీఆర్ఎస్ వైపు ఆకర్షించే ప్రయత్నం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తమకు పట్టున్న ఆయా ప్రాంతాలలో పర్యటనలు చేస్తూ స్థానిక ఎమ్మెల్యేలకు దడ పుట్టిస్తున్నారని సమాచారం.

ఏపీలో సంక్రాంతి వేదికగా బీఆర్ఎస్ రాజకీయాలు

ఏపీలో సంక్రాంతి వేదికగా బీఆర్ఎస్ రాజకీయాలు

గతంలో రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పలువురు కీలక నాయకులతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు మంచి పరిచయాలు, సత్సంబంధాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించారని భావిస్తున్న గులాబీ అధినేత కేసీఆర్ ఆ పాత పరిచయాలను వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి వేదికగా రాజకీయాలు చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంక్రాంతి పండుగ వేదిక కానుందని చర్చ జరుగుతుంది.

 సంక్రాంతి కోడిపందేలకు ఏపీ నుండి బీఆర్ఎస్ నేతలు

సంక్రాంతి కోడిపందేలకు ఏపీ నుండి బీఆర్ఎస్ నేతలు


ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగకు జరిగే కోడిపందాలు చాలా ప్రసిద్ధిగాంచాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కోడిపందాలు ఆడడానికి, చూడడానికి ఎంతో మంది రాజకీయ ప్రముఖులు వెళుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం సంక్రాంతి కోడి పందాలలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో తెలంగాణ మంత్రులు, నేతలు వెళ్లనున్నారని తెలుస్తుంది. ఇక కోడిపందాల సమయంలో అక్కడ పార్టీ నేతలతో మాటలు కలిపితే బీఆర్ఎస్ పార్టీ వైపు చాలా మంది నేతలు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని గులాబీ నేతలు భావిస్తున్నారని సమాచారం.

ఇప్పటికే రంగంలో తెలంగాణా ఇంటిలిజెన్స్

ఇప్పటికే రంగంలో తెలంగాణా ఇంటిలిజెన్స్


ఇప్పటికే గులాబీ బాస్ కెసిఆర్ పొరుగు రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధ్యయనం చేయడంతో పాటు, ఆయా రాష్ట్రాలలో పరిస్థితి ఏమిటి, అక్కడి ప్రజల ప్రధాన సమస్య ఏమిటి? బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల పట్ల వారి అభిప్రాయం ఏమిటి అన్న విషయాలను తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులను రంగంలోకి దించి మరీ తెలుసుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో సంక్రాంతి కోడి పందాలను కూడా వదలకుండా గులాబీ నేతలు జాతీయ రాజకీయాల కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

కీలక నాయకులను ఆకర్షించటానికి గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహం

కీలక నాయకులను ఆకర్షించటానికి గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహం

వివిధ పార్టీలలో గతంలో కీలకంగా పని చేసి, ప్రస్తుతం ఫాంలో లేని లీడర్లను ప్రధానంగా టార్గెట్ చేయనున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తోట చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటన చేసి ఏపీపైన గురిపెట్టిన గులాబీ బాస్, అక్కడ నుండి ఇన్పుట్ లను తెప్పించుకుంటూ తదనుగుణంగా రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. మరి సంక్రాంతి కోడిపందేల కేంద్రంగా ఏపీలో ఎలాంటి రాజకీయాలు సాగుతాయి? సంక్రాంతి తర్వాత గులాబీ బాస్ ఏపీలో ఏం చెయ్యనున్నారు? అన్నది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది.

English summary
A link to BRS politics is seen in AP for Sankranti hen fights. This time a large number of BRS leaders from Telangana will go to the Sankranthi cockfights. It is reported that they will try to attract the leaders there as a center of cockfighting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X