తిరుపతి ఎయిర్ పోర్టులో లిక్విడ్ ఆర్డీఎక్స్ కలకలం !
తిరుపతి: చిత్తూరు జిల్లాలోని రేణిగుంట (తిరుపతి) విమానాశ్రయంలో ఆర్డీఎక్స్ తో ప్రయాణించడానికి సిద్దం అయిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి భారీగా లిక్విడ్ ఆర్డీఎక్స్ స్వాధీనం చేసుకున్నారు.
నలుగురు తిరుపతి నుంచి ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అనుమానం రావడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి దగ్గర ఉన్న పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

వ్యాపారం నిమిత్తం ఆ నలుగురు వైఎస్ఆర్ కడప జిల్లాలోని రైల్వే కోడూరుకు వచ్చారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. అయితే వారి దగ్గర లిక్విడ్ ఆర్డీఎక్స్ ఎలా వచ్చిందని అని అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications