సీఎంలు జగన్, రేవంత్ రెడ్డితో సహా ఈడీ విచారణ ఎదుర్కొంటున్న రాజకీయ ప్రముఖులు వీరే!!

భూ కుంభకోణానికి సంబంధించిన అవినీతి ఆరోపణలతో మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఎపిసోడ్ కొనసాగుతున్న వేళ భారత రాజకీయాలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను ఎదుర్కొంటున్న పలువురు రాజకీయ ప్రముఖుల పేర్లు ప్రస్తుతం ప్రధానంగా చర్చకు వస్తోంది. దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ ప్రముఖులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ఈడి విచారణను ఎదుర్కొంటున్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎంతమంది ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు అంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆయనకు ఐదుసార్లు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఢిల్లీ కుంభకోణంలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ నేతలు సంజయ్ సింగ్ మరియు అమానతుల్లాఖాన్ ల పైన ఈడి విచారణ జరుపుతోంది.

List of politicians who are facing ED cases including CM Jagan and CM Revanth Reddy!!

ఇక దక్షిణాదిలో 15 ఏళ్ల నాటి మనీలాండరింగ్ ఆరోపణలపై కేరళ సీఎం పినరయి విజయన్ పై ఈడీ విచారణ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుతో మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తో పాటు పలు ఏజెన్సీల విచారణను ఎదుర్కొంటున్నారు.

జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు మాజీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, కుమారుడు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ లపై కూడా ఈడి ఫోకస్ పెట్టింది. అంతే కాదు భూ కుంభకోణం కేసులో మాజీ సీఎం భూపేందర్ హుడా పై ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల విచారణ కొనసాగుతుంది. మరో కేసులో మాజీ మంత్రి గోపాల్ కందా ఆస్తుల పైన కూడా ఈడీ దాడులు చేస్తోంది.

ఇక మహారాష్ట్రలో ఎన్సీపీ అధినేత శరత్ పవార్ అతని మేనల్లుడు అజిత్ పవార్ లు ఈడీ కేసులలో ఉన్నారు. అతని మనవడు రోహిత్ పవార్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్లు అంబులెన్స్ స్కామ్ కేసు పై ఈడీ విచారణను ఫేస్ చేస్తున్నారు. ఇదే కేసులో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం కూడా విచారణను ఎదుర్కొంటున్నారు.

ఇక చత్తీస్గడ్ మాజీ సీఎం భూపేష్ భగేల్ మనీలాండరింగ్ కి సంబంధించిన పలు కేసుల్లో విచారణ ని ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్లో గోమతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కేసులో అఖిలేష్ యాదవ్ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. పశ్చిమ బెంగాల్లో ఉద్యోగాల కోసం లంచం స్కాంపై అభిషేక్ బెనర్జీ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+