తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ భజన కాదు, చంద్రబాబుని ఇబ్బంది పెడతా: పంచ్ డైలాగులతో పవన్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: విల్లు నుంచి వచ్చిన బాణం, నోటి నుంచి వచ్చిన మాట వెనక్కి తీసుకోలేమని జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ తిరుపతిలో నిర్వహించిన సభలో తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. తన ప్రసంగంలో ఏపీకి ప్రత్యేకహోదా ఎలా సాధించాలో అందుకు సంబంధించి మూడు దశల్లో చేయాల్సిన ఉద్యమాలను సభా ముఖంగా వివరించారు.

ఏపీని విభజించాలని ఎక్కడైతే బీజేపీ నేతలు తీర్మానం చేశారో, అదే కాకినాడలో సెప్టెంబర్ 9న ప్రత్యేకహోదా కోసం భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు. దీంతో పాటు అభిమానులను ఆనందంగా ఉంచడానికి సినిమాలు కూడా చేస్తానని అన్నారు. తిరుపతి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే:

Live: Pawan Kalyan Meeting in Tirupati Today Starts at 4 p.m

నా బరువు 72 కేజీలు, నా ఒక్కడి వల్ల ఏమవుతుంది

ముగింపు పోరాడతా. సాధించే వరకు పోరాడతా. గెలిచే వరకూ పోరాడదాం. మన హోదా వచ్చే వరకు, మన హక్కులు సాధించే వరకూ పోరాడదాం. మొన్న మాజీ సీఎం కుమార స్వామి వచ్చినప్పుడు మీడియా హోదా గురించి అడిగింది. పవన్ కళ్యాణ్ దిగొచ్చాడు. పవన్ గొప్పదనం ఏముంది. నా ఒక్కడి వల్ల ఏముంది. 72 కేజీలు. ఒళ్లు నొప్పులు ఉన్నాయి. మీరు నా బలం. మన జాతి ఆడపడులు నా బలం. నా ఒక్కడి బలం. ఇంట్లో కూర్చోని వ్యవసాయం కూడా చేసుకోలేను. కేంద్రానికి నేను చెప్పదలచుకున్నది. మీరు హోదా ఇవ్వలేని పక్షంలో మా సీమాంధ్ర ఎంపీలను చూసి వాళ్లని హోదా అవసరం లేదని అనుకోకండి. అంతేగానీ కేశినేని నాని, అవంతి శ్రీనివాస్, మురళీ మోహన్ లేదా మంత్రి నారాయణ చూసే హోదా అవసరం లేదని అనుకోండి, ప్రజలను చూసి హోదా ఇవ్వండి.

హోదా కోసం పోరాడుతూ

హోదా కోసం పోరాడుతా. హోదా వచ్చే వరకు విశ్రమించను. ఒకేసారి ఎందుకంటే చాలా ఒత్తిళ్లు ఉన్నాయి. హోదా ఎలా సాధించాలనే దానిపై జిల్లాలకు తీసుకెళ్తాను. నేను కోరుకునేది ఒక్కడే. ఢిల్లీలో ఎంపీలు హిందీలో మాట్లాడతారు. మన ఎంపీలకు హిందీ రాదు. మన ఎంపీలు హిందీ క్లాస్ తీసుకుని 'మోడీ జీ హమ్ కో స్పెషల్ స్టేటస్ ఛాహియే' అని అడగండి.

సర్దార్ సరిగ్గా చూడలేదు, డబ్బులు ఆగిపోయాయి

మీ కోసం సినిమాలు చేస్తాను. సినిమాలతో పాటు రాజకీయం కూడా చేస్తాను. రాజకీయం అంటే భూతు పదం కాదు. నిస్వార్ధంగా రాజకీయాలు చేస్తాను. నాకు అధికారం అవసరం లేదు. నాకు సామాజిక మార్పు జరిగితే చాలు. కానీ దానికి అది అధికార పార్టీ కావొచ్చు, ప్రతిపక్షం కావొచ్చన్నారు. మొదటి సభ సెప్టెంబర్ 9న ఎక్కడైతే బీజేపీ ఏపీకి విడగొట్టాలని నిర్ణయించిందో అదే కాకినాడలో పెడతా.

మోడీ సభా ముఖంగా

ప్రధాని మోడీ అంటే గౌరవం ఉంది. కానీ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేంత గౌరవం లేదు. భావి తరాల ఆశయం కోసం ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధం.

జైరాం రమేశ్‌ అంటే ఎంతో ఇష్టం

జైరాం రమేశ్‌ అంటే ఎంతో ఇష్టం. ఏపీని విడగొట్టిన నేత. మన రాష్ట్రం నుంచి ఎన్నికైన ఆయన రాష్ట్రాన్ని విడగొట్టడంలో కీలక పాత్ర పోషించారు. జై జైరాం రమేశ్. హైదరాబాద్ లో ఒకసారి కలిసినప్పుడు తెలంగాణ కావాలని తెలంగాణ ఎంపీలు ఎంతగా పోరాడారో, ఏపీ ఎంపీలు అంతగా పోరాడలేదని చెప్పారు. సోనియా వద్దకు వెళ్లి ప్లీజ్ ప్లీజ్ అని ఏపీ ఎంపీలు బ్రతిమలాడలేదని అన్నారు. అప్పుడున్న కాంగ్రెస్ ఎంపీలకు సిగ్గు, లజ్జ లేదా? మీరు చదువుకున్న వాళ్లు కాదా? అని నిలదీశారు. ప్రస్తుత టీడీపీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు జాతీయ నాయకులను గౌరవించండి గాన బానిసత్వంలో నడుం వంచిపోయేలా మోకాళ్లకు నమస్కారం చేయకండి. సీమాంధ్రులు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టకండి. అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ ఏపీకి హోదా ఇవ్వడానికి మూడు రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయని చెబుతున్నారని, తుమ్మితే ఊడిపోయే పదవిని పట్టుకొని ఎందుకు వేలాడతారు.

Live: Pawan Kalyan Meeting in Tirupati Today Starts at 4 p.m

మెడ తెగిపడాలో కానీ కాలైతే వెనక్కి పడదు

మెడ తెగిపడాలో కానీ కాలైతే వెనక్కి పడదు. ఇదేమీ పంచ్ డైలాగ్ కాదు. అనడంతో సభా ప్రాంగణంలో అభిమానులు కేకలు, ఈలలు వేసి పెద్ద ఎత్తున గోల చేశారు. అధికారంలో ఉంటే ఒకాలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా మాట్లడకండి. రాజకీయ పార్టీ పెట్టింది ప్రజల హక్కుల కోసం పోరాడటమే. టీడీపీ కానీ, వైసీపీ కానీ మీ రాజకీయ లభ్ది కోసం నేను అడ్డురాను. మీరు ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు నేను పోరాడాల్సి వస్తుంది. ఆ పోరాటంలో నేను గెలవోచ్చు. ఓడిపోవచ్చు.

వెంకయ్య మాట్లాడుతుంటే విసుగు, అసహనం వస్తోంది

సభలో వెంకయ్య మాట్లాడతుంటే విసుగు, అసహనం వస్తోంది. ఏపీకి హోదా కోసం వెంకయ్య పార్టీలో ప్రశ్నించాలి. మీరు తప్పు చేస్తున్నారు వెంకయ్య నాయుడు అని అన్నారు. మాటను వెనక్కి తీసుకోకుండా పోరాడాలని సూచించారు. మీరు ముందు తెలుగువారు. పార్టీ ప్రయోజనాల కంటే ప్రజల, దేశ ప్రయోజనాలు గురించి ఆలోచించండి. అలాగే కేంద్ర మంత్రలకు మేం అడుక్కునే వాళ్లం కాదు. మా హక్కుతో అడుగుతున్నాం. హోదా ఇవ్వాలి. దాంట్లో ఇచ్చాం, దీంట్లో ఇచ్చాం కాకుండా చెప్పకండి. మీరు గో సంరక్షణ గురించి మాట్లాడుతున్నారు. నా దగ్గర 15 ఆవులున్నాయి.

ఎన్నో సమస్యలున్నాయి. తెలంగాణకు హైకోర్టు, ఏపీకి హోదా లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. మీరు గో సంరక్షణ చేయాలనుకుంటే ప్రతి హిందువు, బీజేపీ కార్యకర్తను గోవును పెంచుకోవాలని సూచించండి. గోవులను రక్షించండి అంతే తప్పు దాని కోసం హోదాను పక్కన పెట్టొద్దు.

పదో తరగతి చదివిన విద్యార్ధి, డిగ్రీ, ఇంజనీరింగ్ అయిపోతుంది. నిరుద్యోగంలో ఉండిపోతారు. ఒక సమస్య వ్యక్తిగతంగా పరిష్కరించేది కాదు. అది కేవలం ప్రజల పోరాటంతోనే సాధ్యమవుతుంది తప్ప, వ్యక్తిగతంగా సంబంధం ఉండటం వల్ల ప్రయోజనం లేదు. ఇక టీడీపీ విషయానికి వస్తే మీరు బాధపడి గింజుకోవద్దు. దీనిని సహృదయంతో తీసుకోండి. టీడీపీ హోదాను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదంటే కేంద్రంతో పెట్టుకుంటే నిధులు రావని అంటున్నారు. మన ఎంపీలు యాచకుల్లా వెళ్లి సార్ సార్ అంటూ అడుక్కోవడం మంచిదేనా మీరు ఆలోచించాలి.

రెండో దశ

రెండో దశలో ఎక్కడైనా బీజేపీ రాష్ట్రాన్ని విడగొట్టాలని తీర్మానించిందే అక్కడే పార్టీ పెడతా. అక్కడ అధికారల ఎంపీల మీద, అధికార నేతల మీద, బీజేపీ నేతల మీద ఒత్తిడి తీసుకొచ్చేలా మాట్లాడతా. అప్పటికి ఎంపీలు పోరాటాలు చేయలేని పక్షంలో మీ అందరి సహకారాలతో, మీ అందరి అనుమతి తీసుకుని ఎలా ఉద్యమాలో చేయాలో నిర్ణయిస్తాం. ఇదేదో మూడు సంవత్సరాలకు వచ్చి, జనసేన-బీజేపీ కలిసి పనిచస్తాయని అంటే నాకు అలాంటి ఆసక్తి లేదు.

Live: Pawan Kalyan Meeting in Tirupati Today Starts at 4 p.m

మీకు లేదని ఆనందం నాకేంటి. మోడీ గారు యువతకు ఎన్నో అవకాశాలను కల్పించాలని మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టాటప్ ఇండియా అంటారు. ఏపీకి హోదా కల్పించకుంటే మన రాష్ట్రంలో వాటికి మద్దతుగా నిలబడకపోతే రాష్ట్రం పరిస్థితి ఏంటని మోడీని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల తెలంగాణకు డబ్బులు ఎక్కువ ఉంటే, ఏపీకి ఏదీ లేదు.

మొదటి దశ

బీజేపీ నేతలు అడిగేది చూస్తుంటే గతంలో కాంగ్రెస్ నేతలు చేసిందే గుర్తుకు వస్తోంది. గతంలో కాంగ్రెస్ ఎంపీలు మేడమ్ ప్లీజ్ మేడమ్ అన్నారు. ఇప్పుడు ఎంపీలు సార్ ప్లీజ్ సార్ అంటున్నారు. కానీ వారు హోదా ఇవ్వడం లేదు. ఏనుగు మీద వర్షం పడినట్లు కేంద్రం వ్యవహరిస్తోంది. పార్లమెంట్ లో ఎంపీలో స్పందించిన సమయంలో రోడ్లు మీదకొచ్చి ఉద్యమాలు తీసుకొస్తే పరిస్థితి తేవద్దొని చెప్పారు.

కేంద్రం హోదా ఇచ్చే వరకు జనసేన పార్టీ సభ్యులో పోరాడాలి. మూడు దశల్లో పోరాటం చేస్తాం. మొదటి దశలో అన్ని జిల్లాలు తిరుగుతాను. జిల్లాలో కాంగ్రెస్ చేసిన ద్రోహం, బీజేపీ ఎందుకు నిలబడలేకపోయింది. ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అంటున్నారు, ఇప్పుడు ప్రశ్నిస్తా అని అన్నారు.

ఇంగ్లీషులో పాయింట్ ఆఫ్ నోట్ అంటారు

ఇంగ్లీషులో పాయింట్ ఆఫ్ నోట్ అంటారు. ఏదైనా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. మాటను ఆచితూచి మాట్లాడమే రాజకీయాలకు, వర్ధమాన రాజకీయాలకు అవసరం. అంతే తప్పచేత కాకకాదు, పౌరుషం లేక కాదు. సీమాంధ్రులు అంటే చావ లేని వాళ్లా అని కేంద్రం భావిస్తోంది. సీమాంధ్రుల పట్ల కేంద్రం ఎందుకు ఆడుకుంటోంది. సీమాంధ్రులకు దేశం పట్ల నిబద్ధత ఉంది. సీమాంధ్రుల సహనం చూశారు, ఇచ్చిన మాట తప్పితే సీమాంధ్రుల ప్రతాపం చూస్తారు. దేశం మొత్తానికి తమ పోరాటం తెలిసేలా చేస్తారు. పార్టీ యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు పద్దతి పాడు లేకుండా విడగొడ్డారు.

Live: Pawan Kalyan Meeting in Tirupati Today Starts at 4 p.m

విడగొట్టేటప్పుడు ఇంత మంది యువత ఉన్నారు. ప్రతి ఒక్కరూ దేశానికి యువత ఉంది. అలాంటి యువతకు ఏం చేయాలనేది ఆలోచించలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం విడగొట్టినప్పుడు ప్రత్యేకహోదా గురించి ప్రస్తావించలేదు. మీ చావు మీరు చావండి అంటూ అనేసింది. పోనీ కాంగ్రెస్ తప్పు చేసిందనుకంటే, బీజేపీ కూడా అంతే తప్పు చేసింది. మరి మీరు ఎందుకు బీజేపీకి మద్దతు పలికారని మీరు ప్రశ్నించొచ్చు. బీజేపీ 1997లో ఒక్కఓటుతో రెండు రాష్ట్రాలని చెప్పింది. కాకినాడలో రిజల్యూషన్ పాస్ చేసారు. కానీ సీమాంధ్రకు ఏం చేస్తారనేది చెప్పేలేదు.

సీఎం చంద్రబాబుని రాబోయే రోజుల్లో ఇబ్బంది పెడతా

టీడీపీ ప్రభుత్వం తీసుకున్న విధి విధానాలపై రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇబ్బందులు పెడతా. జనసేన పార్టీ పెట్టింది ప్రజల జెండా మోయడానికి అన్నారు. ఏ ఒక్క పార్టీ లేదా ఏ ఒక్క వ్యక్తి జెండా మోయడానికి కాదని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. మోడీ తిరిగి విదేశాలతో తిరిగి సంబంధాలు బలోపేతం చేస్తున్నారు. హోదా కోసం సంమయనం పాటించాలి. టీడీపీకి పూర్తి సహాయ సహకారాలు అందించాను. ముందు చూద్దాం. అసలు ఏం చేస్తారో అని ఆగాను.

బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు

బీజేపీ అంటే గౌరవం ఉందని, మా సమస్యల కోసం పుట్టిన పార్టీ అని, జాతీయ దృక్పథం కలిగిన పార్టీ అని జాతీ శ్రేయస్సు కోరే పార్టీ అని చెప్పానని అన్నారు. కేవలం మా రాష్ట్ర ప్రయోజనాల కోసమే, దేశ ప్రయోజనాల కోసం పార్టీ పెట్టానని అన్నారు. బీజేపీ సిద్దాంతాలను ఏకీభవిస్తాను. దేశం కోసం మీ పార్టీ భుజం కాశాని అన్నారు.

కులం మతం అంటగట్టొద్దు

కులం మతం అంటగట్టొద్దని అన్నారు. ఆ సంపాదకీయం రాసిన వ్యక్తిని ప్రశ్నించాను. టీడీపీ భుజం కాసినప్పుడు నాకు కులం గుర్తుకు రాలేదు కానీ, టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు నా కులం మీకు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించా. ఏదైనా పని చేయలేనప్పుడు చేయలేనని క్షమించాలని కోరుతానని అన్నారు.

టీడీపీకి భుజం కాశాను

నా సహకారంతో టీడీపీ అధికారంలోకి వచ్చిందో లేదో తెలియదు గానీ మీరంతా సాయంతో ఉడతా మాదికి సాయం చేశాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు అనుభవమైన తొలి అనుభవం మీతో పంచుకుంటున్నాను. నాకు ఆశ్చర్యం ఎక్కడ కలుగుతుందంటే ఎన్నో రిస్క్ లను ఎదుర్కొని రాజకీయాల్లోకి వచ్చాను.

ప్రధాని మోడీ గారిని కలిసినప్పుడు, టీడీపీకి సహాయ సహకారం అందించినప్పుడు పవన్ అభిమానులను ఎంతగానో మెచ్చుకున్నారు. పవన్ అభిమానులు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారని కొనియాడారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కొన్ని తప్పులు ఎత్తి చూపాను.

ఆ తర్వాత కొన్ని పత్రికల సంపాదకీయాల్లో రాశారు. మీరంతా ఎక్కడ నుంచి వచ్చారో వారికి తెలియదు. టీడీపీ విధి విధానాలను ప్రశ్నించాను. పవన్ కళ్యాణ్ చుట్టూ అతని కులం ఉందని రాశాయి. నా కూతురు క్రిస్టియన్. తన మతాచారం ప్రకారం రష్యన్ ఆర్దోడాక్స్ చర్చిలో బాప్తనిజం చేయించుకుంటానంటే అంగీకరించాను.

జనసేన మోడీ భజన కాదు

జనసేన మోడీ భజన కాదన్నారు. మడమ తిప్పే వ్కక్తిని కానని చెప్పిన పవన్ నాది ప్రజా సమస్యల భజన అని పేర్కొన్నారు. రాజకీయాలు నాకు అవసరం లేదు. నేను టీడీపీ తొత్తునో, టీడీపీ పక్షపాతిని కాదు, రైతు పక్ష పాతిని ఆడబిడ్డల పక్షపాతిని, అక్కచెల్లెల పక్షపాతిని. అంతేకానీ ఓ ఒక్క పార్టీకో, ఏ ఒక్క వ్యక్తితో జీవితాన్ని ఇవ్వను. సినిమా మీకు ఆనందాన్ని కలిగిస్తాని చేస్తున్నాను. నాకు ఎల్లప్పుడూ ప్రజల పైనే ఉంటుంది. స్పీచ్ లోకి వెళ్లబోయే ముందు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులందరికి ప్రతి ఒక్కరికీ పేరుపేరునా చెబుతున్నాను.

వేరే హీరోలతో ఎప్పుడు నాకు గొడవలుండవు. సినిమా కేవలం వినోదం కోసమే. నిజ జీవితాన్ని అబిమానులు సీరియస్ గా తీసుకోవాలి. నాతో ఏ హీరో చేసినా అది నిజం కాదు. సున్నితమైన వాటితో మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అభిమాని, జనసేన సేనాని హత్య బాధించింది. వినోద్ రాయల్ హత్య ఎంతగానో బాధించింది.

మీరంతా క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్లాలని కోరుకునే వాడిని. వినోద్ రాయల్ తల్లి ఎంతో గౌరవం ఇచ్చింది. అవయవదానికి సంతకం చేయడానికి వెళ్లిన బిడ్డ, ఆసుపత్రికి వెళ్లి చూస్తే తల్లి పడ్డ వేదన ఎంతో గొప్పది. తిరుపతిలో పుట్టిన ఆ ఆడపచుకు నా పాదాభివందనం. అలాంటి తల్లుల బిడ్డ భవిష్యత్తు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను.

ఆవేశంగా మొదలైన పవన్ ప్రసంగం

పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆవేశంగా మొదలైంది. నోటి నుంచి వచ్చిన మాట వెనక్కి తీసుకోలేమని అన్నారు. అందుకే ఏది మాట్లాడినా పదే పదే ఆలోచించి మాట్లాడతానని చెప్పారు. ఒక దేశపు సంపద నదులు కాదు, ఖనిజాలు కాదు, అడవులు కాదు యువత మాత్రమేనని అన్నారు.

జనసేన పార్టీ పెట్టి రెండు సంవత్సరాలు కావస్తుంది. పదువులు ముఖ్యం కాదు, కోట్లు సంపాదిస్తాను. ఇంట్లో కూర్చోని ఆనందంగా ఉండొచ్చు. సినిమాల వ్యామోహం లేదు, కానీ దేశం మీద వ్యామోహం ఉంది, సమాజం మీద బాధ ఉందని అన్నారు. సినిమాల్లో రౌడీలు విలన్లను కొట్టేయచ్చు, హీరోయిన్లతో పాట్లు పాడొచ్చు, అన్యాయాలను ఎదుర్కోవచ్చని అన్నారు.

ఇదంతా రెండున్నర గంటల్లో చేయొచ్చు. కానీ నిజ జీవింతలో ఇది సాద్యం కాదు. రెండు విషయాలు మాట్లాడటానికి వచ్చాను. ఒకటి జనసేన పార్టీ గురించి, రెండోది టీడీపీ పనితీరుపై నా అభిప్రాయం. అన్నింటి కంటే ముఖ్యమైంది రాష్టాన్ని విడగొట్టి హోదా ఇస్తానని చెప్పి తాత్సారం చేసిన కేంద్రం ప్రభుత్వంపైన మాట్లాడతానని అన్నారు.

అభిమానులు తోసుకు రావడంతో కింద పడబోయిన పవన్ కళ్యాణ్

తిరుమల కొండపై పవన్ కళ్యాణ్ అభిమానుల కోలాహలం చేస్తున్నారు. పవన్ బస్ చేసిన గెస్ట్ హౌస్ వద్ద స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో గెస్ట్ హౌస్ నుంచి పవన్ బయటకు రావడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అభిమానులు తోసుకు రావడంతో పవన్ కిందపడబోయారు. దీంతో పోలీసులు కలగజేసుకుని పవన్‌ను కారులో ఎక్కించారు.

తిరుమల నుంచి సభా ప్రాంగణానికి బయల్దేరిన పవన్

మృతి చెందిన అభిమాని కుటుంబాన్ని పరామ‌ర్శించ‌డానికి హైద‌రాబాద్ నుంచి తిరుప‌తికి వెళ్లిన ప‌వ‌న్ రెండు రోజులుగా తిరుమలలోనే బసచేస్తోన్న సంగతి తెలిసిందే. తిరుమల నుంచి తిరుపతిలోని తుడా మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ బయల్దేరారు.

మరికాసేపట్లో జనసేన మొదటి బహిరంగ సభ వేదికపైకి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. ప‌వ‌న్ రాక కోసం త‌న అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. జనసేన కార్యకర్తలకు, అభిమానులకు దిశానిర్దేశం చేయనున్నారు. స‌భా ప్రాంగ‌ణానికి ఇప్పటికే వేలాది మంది అభిమానులు చేరుకున్నారు.

ప‌వ‌న్ నోటి నుంచి వ‌చ్చే మొద‌టి మాట ఏది? ఆయ‌న రాజ‌కీయ యాత్ర ఎలా మొద‌లు కాబోతోంది? అన్న అంశంపై అభిమానులు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు. పవన్ తిరుపతి సభకు భారీగా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చిన నేపథ్యంలో మైదానం వెలుపల కూడా ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ సభ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసలు జాగ్రత్తలు తీసుకున్నారు.

అభిమానుల తాకిడి

అయితే, అభిమానుల తాకిడి ఎక్కువ‌గా ఉండ‌డంతో సభను నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తలు కొంద‌రు అభిమానులను తిరిగి వెళ్లిపోవాల‌ని సూచిస్తున్నారు. సభా ప్రాంగణంలో ఎనిమిది వేల మందిక‌న్నా ఎక్కువ ప‌ట్టే అవ‌కాశం లేదు. అంతేకాదు పవన్ తిరుపతి సభకు కేవలం చిత్తూరు జిల్లా అభిమానులకు మాత్రమే అనుమతి ఉంది.

తిరుపతి తర్వాత విజయవాడలో భారీ బహిరంగ సభ

ఇతర జిల్లాల నుంచి వస్తున్న అభిమానులను జనసేన పార్టీ నేతలు వెనక్కి పంపుతున్నారు. తిరుపతి సభ తర్వాత త్వరలోనే విజయవాడలో భారీ బహిరంగ సభను జనసేన నిర్వహించనుంది. ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నెలల పాటు అన్ని జిల్లాల్లో జనసేన విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించేలా జనసేన కార్యకర్తలు ప్రణాళికలు రచిస్తున్నారు.

English summary
The meeting, scheduled for 4 p.m., will be similar to the one held at the launch of the Jana Sena in Hyderabad two years ago. He is expected to be the lone speaker at the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X