వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ బడ్జెట్: కేటాయింపులు ఇలా.., హైద్రాబాద్‌లో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశ పెట్టారు. ఇది రూ.లక్షా 637 కోట్ల బడ్జెట్. అంతకుముందు బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. జాతీయ గీతంతో తెలంగాణ శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి బడ్జెట్ సమావేశ పడుతున్నందుకు తాను గర్వపడుతున్నానని ఈటెల రాజేందర్ చెప్పారు. ప్రారంభంలోనే విపక్షాలు నిరసన తెలిపాయి. నిరసనల మధ్యే ఈటెల కాసేపు బడ్జెట్ ప్రసంగం చదివారు. ఈటెల ప్రసంగం గంటసేపు సాగింది. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది.

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం. రూ.లక్షా 637 కోట్లు

ప్రణాళికేతర వ్యయం రూ.51,989 కోట్లు
ప్రణాళికా వ్యయం రూ.48,648 కోట్లు
లోటు రూ.17,398 కోట్లు

హైదరాబాద్‌లో..

Live: Telangana state Budget sessions 2014 15

హైదరాబాదులో మౌలిక వసతులు పెంచేందుకు, అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు, సురక్షిత నగరంగా తీర్చిదిద్దుతాం.
350 కోట్లతో పోలీసులకు అత్యాధునిక వాహనాలు ఇచ్చాం.
సీసీ కెమెరాల కోసం రూ.44.59 కోట్లు
జీహెచ్ఎంసీ స్లమ్ లెస్ సిటీ కోసం రూ.250 కోట్లు
స్టేషన్ల ఆధునికీకరణకు రూ.20 కోట్లు
మెట్రో రైల్వేకు రూ.416.67 కోట్లు.
గ్రీన్ హౌస్ పైలట్ ప్రాజెక్టుకు 75 శాతం సబ్సిడీ,
సుల్తాన్ బజారు, పెట్ల బురుజు ఆసుపత్రులకు రూ.50 కోట్లు
జీహెచ్ఎంసీ వాటర్ అండ్ సీవరేజ్ కోసం రూ.581 కోట్లు.
కింగ్ కోఠి ఆసుపత్రికి రూ.25 కోట్లు.
గాంధీ ఆసుపత్రికి రూ.100 కోట్లు

నిధుల కేటాయింపు ఇలా...

వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1000 కోట్లు
డ్రిప్ ఇరిగేషన్‌కు రూ.250 కోట్లు

ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ భవన్.

ఐసీడీఎస్ పథకానికి రూ.1,100 కోట్లు
టీఎస్ఐఐసీకి రూ.100 కోట్లు
ఐటీఐఆర్ ప్రాజెక్టుకు రూ.90 కోట్లు
వరంగల్లో టెక్స్‌టైల్ పార్క్
ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.97.51 కోట్లు

పాల ఉత్పత్తుల ప్రోత్సాహానికి రూ.16.30 కోట్లు
రహదారుల అభివృద్ధికి రూ.10వేల కోట్లు
ఆర్టీసికి రూ.400 కోట్లు.
విద్యుత్ రంగానికి రూ.3,241 కోట్లు.
సోలార్‌కు రూ.40 కోట్లు
టిఎస్ జెన్కోలో పెట్టుబడికి రూ.1000 కోట్లు
ఉస్మానియా ఆసుపత్రికి రూ.100 కోట్లు.
మెడికల్ కళాశాలల నిర్మాణానికి రూ.152 కోట్లు.
పరిశ్రమల విద్యుత్ సబ్సిడీకి రూ.10 కోట్లు.
కళాకారుల సంక్షేమానికి రూ.11 కోట్లు
గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు
పర్యాటక రంగ అభివృద్ధికి రూ.60 కోట్లు
క్రీడారంగానికి రూ.90 కోట్లు

రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీకి రూ.480.43 కోట్లు
ఫారెస్ట్ కాలేజీలకు రూ.10 కోట్లు
ఇరిగేషన్ కోసం రూ.ఆరువేల కోట్లు
ప్రతి నియోజకవర్గంకు రూ.1.50 కోట్లు
సాంకేతిక విద్యకు రూ.212.86 కోట్లు.
నీలోఫర్ ఆసుపత్రికి రూ.30 కోట్లు
వైద్య ఆరోగ్యానికి రూ.2282 కోట్లు
పవర్ లూమ్ కార్మికులకు రూ.1 వరకు రుణమాఫీ.
ఎస్సీ సబ్ ప్లాన్‌కు రూ.7,579, ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.4,559 కోట్లు.

ఉచిత నిర్బంధ విద్యకు రూ.25 కోట్లు.
మోడల్ స్కూళ్లకు రూ.940 కోట్లు.
సాంస్కృతికు, క్రీడలకు రూ.1000 కోట్లు.
యాదగిరి గుట్ట అభివృద్ధికి రూ.100 కోట్లు.
బాసర ట్రిపుల్ ఐటికి రూ.119.63 కోట్లు
దళితులకు భూమిలు ఇచ్చేందుకు రూ.1000 కోట్లు, ఎస్సీలకు రూ.500 కోట్లు.

మైనార్టీల సంక్షేమానికి రూ.1030 కోట్లు.
కళ్యాణ లక్ష్మీ.. ఎస్సీలకు రూ.150, ఎస్టీలకు రూ.80 కోట్లు, షాదీ ముబారక్‌కు రూ.100 కోట్లు.
మహిళల భద్రతకు రూ.10 కోట్లు
గృహ నిర్మాణానికి రూ.1000 కోట్లు
దీపం పథకానికి రూ.100 కోట్లు
దీపం పథకం కింద ఎల్పీజీ సిలిండర్లు
బీసీ సంక్షేమంకు రూ.2020 కోట్లు
విజయ డైరీకి పాలుపోసే రైతులకు రూ.4 ప్రోత్సాహకం.
విద్యారంగం అభివృద్ధికి రూ.10956 కోట్లు.

అమరవీరుల కుటుంబాలకు రూ.100 కోట్లు
మహబూబ్ నగర్ జిల్లాలో 4 ఎత్తిపోతల పథకాలు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం
ఈ ఏడాది 9వేల చెరువుల పునరుద్ధరణకు రూ.2వేల కోట్లు.
నీటి పారుదల రంగానికి రూ.6,500 కోట్లు.
మార్కెట్లో ధరల స్థిరీకరణ కోసం రూ.400 కోట్లు
జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.10 కోట్లు
విత్తనాభివృద్ధి కోసం రూ.50 కోట్లు
ఫామ్ మెకలైజేష్ కోసం రూ.10 కోట్లు
క్రాప్ కాలనీల కోసం రూ.20 కోట్లు
హైదరాబాద్ చుట్టుపక్కల వెయ్యి ఎకరాల్లో గ్రీన్ హౌస్ కల్టివేషన్
గ్రీన్ హౌస్ పైలట్ ప్రాజెక్టు కోసం రూ.250 కోట్లు
పౌల్ట్రీ రంగంలో విద్యుత్ సబ్సిడీకి రూ.20 కోట్లు
సూక్ష్మ సేద్యం కోసం రూ.250 కోట్లు
పాల ఉత్పత్తుల కోసం రూ.16.30 కోట్లు
మైనార్టీల కోసం షాదీ ముబారక్, ఎస్సీ, ఎస్టీలకు కల్యాణ లక్ష్మీ.
జోడేఘాట్ అభివృద్ధికి రూ.25 కోట్లు
మహిళల భద్రతకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్
మహిళా, శిశు సంక్షేమానికి రూ.221 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్‌కు రూ.7579 కోట్లు
వైద్య, ఆరోగ్యానికి రూ.2822 కోట్లు

ఈటెల ప్రసంగం ఇలా ...

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశ్యం.

ఆసరా పేరుతో వృద్ధులకు, వితంతు, వికలాంగుల పింఛన్లు. పింఛన్లు పెంచుతున్నాం.

విద్య పైన పెట్టే డబ్బును ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూస్తున్నాం.

మత్స్యకారులను ఆదుకునేందుకు అవసరమైన ప్రణాళికలు.

సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మైనార్టీలకు పది జిల్లాలకు రూ.500 కోట్లుమాత్రమే ఇచ్చారు. తాము అంతకు రెట్టింపు ఇస్తున్నాం.

కోళ్ల పరిశ్రమల వారిని కూడా రైతుగా గుర్తించి.. రూ.20 కోట్లు మొదటిసారి ఇస్తున్నాం.

ఎర్రజొన్న రైతులకు రూ.11.50 కోట్లు బకాయిలు మాఫీ చేశాం. రైతు రుణమాఫీ కోసం ఒకే జీవోలో రూ.4250 కోట్లు బ్యాంకులో జమ చేశాం.

రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయం రంగం వాటా 14 శాతం, సేవారంగం వాటా 58 శాతం, పారిశ్రామిక రంగం వాటా 20 శాతంగా ఉంది.

అభివృద్ధి ప్రభుత్వ లెక్కల్లో మాత్రమే కనిపించవద్దు. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు. మేం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతాం.

1990 తర్వాత వ్యవసాయ రంగం కుదేలైంది. రైతులకు 17వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశామన్నారు. దేశంలో ఎక్కడ కూడా రైతు రుణాలు ఇంత పెద్ద ఎత్తున మాఫీ చేయలేదు.

డ్రింకింగ్ వాటర్ గ్రిడ్‌కు రూ.25వేల కోట్ల అంచనా. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ షాపంగా మారింది. ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని తాగునీటికి కేటాయిస్తాం.

ప్రజాధనం పక్కదారి పట్టకూడదనే సమగ్ర సర్వే. సర్వేద్వారా పథకాలలో అవకతవకలను అరికడతామన్నారు. తెలంగాణలో తలసరి ఆదాయం దేశీయ సగటు కంటే ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణలో తలసరి ఆదాయం రూ.93,150గా ఉందన్నారు. గొలుసు కట్టు చెరువులు పునరుద్ధరిస్తామన్నారు.

హైదరాబాదులోకి పెట్టుబడులను ఆహ్వానించాల్సిన అవసరముందన్నారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని నెరవేరుస్తామన్నారు.

సమైక్య రాష్ట్రంలో మన చెరువులు పనికి రాకుండా పోయాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చిన్న నీటి పారుదల అస్తవ్యస్తమైందన్నారు.

ప్రజా ధనాన్ని న్యాయబద్ధంగా ఖర్చు పెడతామని ఈటెల అన్నారు. ఇదొక చారిత్రక ఘట్టం అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఆరు దశాబ్దాలుగా పోరాడుతున్నామన్నారు.

ఎన్నో అవమానాలకు గురైన చోటనే బడ్జెట్ ప్రవేశ పెట్టడం సంతోషించదగ్గవిషయమన్నారు. తెలంగాణ పరిపాలకు దుష్టశక్తులు ఎన్నో అవాంతరాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఇది కేవలం పది నెలల బడ్జెట్ మాత్రమే అన్నారు.

అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి వంద కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యామన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని పురోగమనం దిశగా మార్చాల్సి ఉందన్నారు.

459 మంది అమరవీరుల కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి పైసా బలహీన వర్గాలకు ఉపయోగపడాలన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడటమే తమ లక్ష్యమన్నారు.

ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీగా ప్రజల ఆమోదం పొందే మేనిఫెస్టో రూపొందించామన్నారు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన రంగాలను ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. అమరుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. ప్రజాధనం పక్కదారి పట్టకూడదన్నారు.

English summary
Live: Telangana state Budget sessions 2014 15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X