• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎవరు కాదన్నా అవునన్నా ఏపీకి హోదా వచ్చి తీరుతుంది: రాహుల్ గాంధీ

|

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ నింపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుపతిలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఏపీ కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీ పర్యటనతో కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ నింపనున్నారు రాహుల్ గాంధీ. ఢిల్లీ నుంచి ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ బయలు దేరి 11:50 గంటలకు తిరుపతి విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడి నుంచి 12:40 గంటలకు తిరుమలకు బయలుదేరి శ్రీవారి దర్శనం చేసుకుంటారు.

మధ్యాహ్నం 1:30 గంటలకు శ్రీకృష్ణ గెస్ట్ హౌజ్‌కు చేరుకుని భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. 2:20 గంటలకు శ్రీకృష్ణ గెస్ట్ హౌజ్ నుంచి బయలు దేరి రోడ్డు మార్గం ద్వారా జ్యోతిరావు పూలే సర్కిల్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి తారకరామ స్టేడియం వరకు బస్ యాత్ర చేస్తారు. అనంతరం తారకరామ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటల తర్వాత తిరుపతి విమానాశ్రయంకు చేరుకుని 4:35 గంటలకు తిరిగి ఢిల్లీ బయలు దేరి వెళతారు.

Live updates:Rahul Gandhi in AP... What promises will he give to the people of AP?

ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యేక హోదా ఇస్తామని నాడు బీజేపీ టీడీపీలు వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి మాట తప్పాయో అదే వేదిక నుంచి రాహుల్ ప్రసంగించనున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంతేకాదు రాహుల్ తన ప్రసంగంలో ఏపీకి సంబంధించి ఎలాంటి హామీలు ఇస్తారనేదానిపై కూడా ఆసక్తి నెలకొంది. ఇక కేంద్రంలో టీడీపీతో పొత్తు... రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయడంతో కాంగ్రెస్‌కు కాస్త ఇబ్బందికర పరిణామాలే ఎదురు అవుతున్నాయి.

Newest First Oldest First
6:35 PM, 22 Feb
ప్రధానిని ఏ అంశంలోనైనా ఒక వ్యక్తిగా కాకుండా ప్రతినిధిగా చూడాలని రాహుల్ అన్నారు.
6:30 PM, 22 Feb
నల్ల డబ్బును తెస్తామని చెప్పారని, కానీ తేలేదని మోడీపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు.
6:30 PM, 22 Feb
ఏపీకి హోదా ఇస్తామని చెప్పి, మాట తప్పినందుకు నరేంద్ర మోడీ సిగ్గుపడాలని రాహుల్ గాంధీ అన్నారు. హోదా వచ్చే వరకు కాంగ్రెస్ నిద్రపోదని చెప్పారు.
6:17 PM, 22 Feb
పుల్వామా దాడిలో నలభై మంది సైనికులు చనిపోయినప్పుడు మోడీ షూటింగ్‌లో ఉన్నారని, ఇంత ఘోరం జరిగినా సినిమా ఆపేద్దామనే స్పృహ లేకుండా పోయిందన్నారు.
6:16 PM, 22 Feb
మోడీ కాపలాదారు కాదని, దొంగ అని జనం అనుకుంటున్నారని, అనిల్ అంబానీ కోసం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు అన్యాయం చేశారని చెప్పారు.
6:15 PM, 22 Feb
ప్రధాని మాట్లాడారంటే ప్రతి భారతీయుడు మాట్లాడినట్లేనని, ప్రత్యేక హోదాపై నాటి ప్రధాని హామీ ఇచ్చారని చెప్పారు.
6:15 PM, 22 Feb
ప్రధాని మాట్లాడారంటే ప్రతి భారతీయుడు మాట్లాడినట్లేనని, ప్రత్యేక హోదాపై నాటి ప్రధాని హామీ ఇచ్చారని చెప్పారు.
6:15 PM, 22 Feb
ఇటీవల తాము అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో తాము అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రులు రైతుల రుణమాఫీపై సంతకం చేశారని చెప్పారు.
6:14 PM, 22 Feb
రైతుల భూములు తీసుకోవాలంటే నాలుగింతలు పరిహారం చెల్లించేలా తాము చట్టం చేశామని రాహుల్ ాగంధీ చెప్పారు.
6:14 PM, 22 Feb
ఎవరు అవునన్నా, కాదన్నా ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. మోడీ ప్రధాని అయ్యాక ఒక్క హామీ అమలు కాలేదని చెప్పారు.
6:12 PM, 22 Feb
మోడీ కాపలాదారుడు కాదు..దొంగ అని జనం అనుకుంటున్నారు
6:11 PM, 22 Feb
అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే కాంగ్రెస్ సీఎంలు రుణమాఫీ చేశారు
6:10 PM, 22 Feb
మోడీ ప్రధాని అయ్యాక ఒక్క హామీ కూడా అమలు చేయలేదు
6:10 PM, 22 Feb
మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, రాజస్థాన్‌లలో రుణమాఫీలు 10 రోజుల్లో చేశాం
6:09 PM, 22 Feb
ఒక రోజులో రైతు రుణమాఫీలు రూ.90 కోట్లు చేశాం
6:08 PM, 22 Feb
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి అనిల్ అంబానీకి రాఫెల్ కాంట్రాక్టు అప్పజెప్పారు
6:04 PM, 22 Feb
ఎవరు కాదన్న అవునన్నా ఏపీకి హోదా వచ్చి తీరుతుంది
6:04 PM, 22 Feb
రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తానని మోడీ చెప్పారు
6:03 PM, 22 Feb
ఇదే వేదిక నుంచి రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏటా ఇస్తానని మోడీ చెప్పారు
6:03 PM, 22 Feb
ప్రధాని హామి ఇచ్చారంటే దేశం వాగ్దానం చేసినట్లే
6:02 PM, 22 Feb
ప్రధానిని ఒక వ్యక్తిగా కాకుండా ఒక ప్రతినిధిగా చూడాలి
6:01 PM, 22 Feb
హోదా ఇస్తానని ఏపీ ప్రజలను మోసం చేశారు మోడీ
6:01 PM, 22 Feb
ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తామని చెప్పిన వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు ఒక దేశ ప్రధాని
5:25 PM, 22 Feb
తిరుమలలో స్వామి వారి దర్శనం ముగించుకుని కాసేపట్లో సభాస్థలి దగ్గరకు చేరుకోనున్న రాహుల్ గాంధీ
4:09 PM, 22 Feb
తిరుమల శ్రీవారి సేవలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
3:07 PM, 22 Feb
మరి కాసేపట్లో తిరుమలేశుడిని దర్శించుకోనున్న రాహుల్ గాంధీ
3:06 PM, 22 Feb
మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న రాహుల్ గాంధీ. తిరుమల కొండపై శ్రీ కృష్ణ అతిథి గృహంలో బసచేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు
2:05 PM, 22 Feb
ఎక్కడా బ్రేక్ లేకుండా సాగిన రాహుల్ తిరుమల యాత్ర
2:04 PM, 22 Feb
కాసేపట్లో శ్రీవారిని దర్శించుకోనున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
2:03 PM, 22 Feb
రికార్డు సృష్టించిన రాహుల్ గాంధీ..అలిపిరి మార్గం ద్వారా రెండు గంటల్లోనే తిరుమలకు చేరుకున్న రాహుల్ గాంధీ
READ MORE

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress President Rahul Gandhi will be on a one day tour to Andhra Pradesh. Rahul Gandhi who will land at Tirupati will visit the hill shrine Tirumala.From there Rahul will participate in Padayatra from jyotirao phule circle to Taraka rama stadium where he will address the rally. Congress believes that it can make a come back in the state with Rahul's tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more