రాష్ట్రపతి పాలన పెడితేనే: మోడీ సమక్షంలో టిపై అద్వానీ
గాంధీనగర్: ఎపి విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ బుధవారం మండిపడ్డారు. తాము మూడు కొత్త రాష్ట్రాలను ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాఫీగా ఏర్పాటు చేయగలిగామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రపతి పాలన పెడితే తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేమని స్పష్టం చేశారు.
బుధవారం గాంధీనగర్‌లోగుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్న అద్వానీ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. ఒక ప్రాంత ప్రజలు (తెలంగాణ) ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని కానీ, ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందేనని, లేదంటే తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న వారి ప్రకటనను అమలు చేయడం సాధ్యం కాదన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఎందరో చనిపోయారని, ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారని, తమ హయాంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశామని, తన శవంపై నుంచే జార్ఖండ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అప్పట్లో బీహార్ ముఖ్యమంత్రి అన్నారని కానీ, ఎవరూ చనిపోలేదన్నారు. ఆయన కూడా రాష్ట్ర ఏర్పాటులో కలిసి వచ్చారని చెప్పారు. ఎలాంటి ఇబ్బందీ లేకుండా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయగలిగామన్నారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది కేవలం ప్రచారమేనని హైదరాబాదులో భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత యెండల లక్ష్మీ నారాయణ అన్నారు.












Click it and Unblock the Notifications