ఏపీలో లోకల్ వార్ : నిఘా యాప్ తో అధికార వైసీపీ..కంట్రోల్ రూమ్ తో టీడీపీ

స్థానిక సంస్థల ఎన్నికలకు అటు అధికార వైసీపీ , ఇటు ప్రతిపక్ష టీడీపీ నేతలు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధం అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌తో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ , టీడీపీకి చెక్ పెట్టటానికి వైసీపీ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. నిఘా యాప్ తో ఏపీ సర్కార్ , కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టీడీపీ ఒకరి మీద ఒకరు యుద్ధానికి సిద్ధం అంటున్నారు.

 ఎన్నికల్లో ప్రలోభాలపై ఫిర్యాదులకు నిఘా యాప్ ప్రారంభించిన సీఎం జగన్

ఎన్నికల్లో ప్రలోభాలపై ఫిర్యాదులకు నిఘా యాప్ ప్రారంభించిన సీఎం జగన్

వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఎన్నికలు నిర్వహించటానికి అన్ని రకాల సన్నాహాలు చేస్తుంది. నేడు నిఘా యాప్ ను ప్రారంభించిన సీఎం జగన్ ఎన్నికలకు సంబంధించి ఎవరు, ఎలాంటి అవినీతికి పాల్పడినా, మద్యం , డబ్బు ఇవ్వజూపినా, ప్రలోభాలకు గురి చేస్తున్నా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చెయ్యాలని తక్షణం చర్యలు తీసుకుంటామని చెప్పిన పరిస్థితి ఉంది.

 ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ వైసీపీల టామ్ అండ్ జెర్రీ షో

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ వైసీపీల టామ్ అండ్ జెర్రీ షో

ఇక ఇప్పటికే ఓ వైపు రిజర్వేషన్ల అంశంపై సుప్రీంలో టీడీపీ పిటిషన్ వేసింది. ఈ రిజర్వేషన్ల విషయం తేలేవరకు ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే . ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచినట్టు తేలితే సదరు అభ్యర్ధిపై కఠిన శిక్షలు అమలయ్యేలా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్నే టీడీపీ తమ ఆయుధంగా మలచుకోవాలని నిర్ణయం తీసుకుంది.. దీంతో ఒకవేళ అభ్యర్ధి మద్యం, డబ్బులు పంచితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని చేస్తున్న హెచ్చరికల నేపధ్యంలో ఏపీలో అధికా వైసీపీ ,ప్రతిపక్ష టీడీపీల మధ్య టామ్ అండ్ జెర్రీ షో నడిచేలా ఉంది.

టీడీపీ దొరికితే బుక్ చెయ్యాలని వైసీపీ .. వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ

టీడీపీ దొరికితే బుక్ చెయ్యాలని వైసీపీ .. వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ

టీడీపీ దొరికితే బుక్ చెయ్యాలని వైసీపీ .. వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ వ్యూహాలతో సిద్ధంగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికలలో అవినీతి జరగకుండా చెక్ పెట్టటం కోసం నిర్ణయం తీసుకుంది. కానీ అధికార వైసీపీ అభ్యర్ధులు స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచితే చర్యలు తీసుకుంటుందా ? అన్న అనుమానాలు ఉన్న టీడీపీ చాలా తెలివిగా , పకడ్బందీగా ఇరికించే ప్లాన్ సిద్ధం చేసింది.

ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచితే వీడియోలు తియ్యాలన్న చంద్రబాబు

ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచితే వీడియోలు తియ్యాలన్న చంద్రబాబు

ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచితే ఏం చేయాలన్న దానిపై టీడీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. అధికార పార్టీకి సంబంధించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారో లేదో అన్న అనుమానాలు ఉన్న క్రమంలో వైసీపీ నేతలు డబ్బు, మద్యం పంచితే ఫోటోలు , వీడియోలు తియ్యాలని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. దీనికోసం ఎన్టీఆర్ భవన్‌లో కమాండ్ కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

వైసీపీ నేతలను బుక్ చేసేందుకు టీడీపీ కంట్రోల్ రూమ్

వైసీపీ నేతలను బుక్ చేసేందుకు టీడీపీ కంట్రోల్ రూమ్

వైసీపీ కార్యకర్తలు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తే.. వారికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపాలని చెప్పిన చంద్రబాబు మీడియాను ఉపయోగించుకోవాలని తెలిపారు. అంతేకాదు వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తామన్నారు.టీడీపీ సిద్ధంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రలోభాలకు చెక్ పెట్టాలని వైసీపీ సర్కార్ సిద్ధం చేసిన ప్లాన్ నే వాడుకుని చంద్రబాబు వైసీపీ నేతలు దొరికితే అడ్డంగా బుక్ చెయ్యాలని చూస్తున్నారు. దీంతో స్థానిక ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+