కరోనా: ఏపీ-తెలంగాణ సరిహద్దులో టెన్షన్.. పోటాపోటీగా కూలీల అడ్డగింత..
కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడంతో లాక్‌డౌన్‌ను మే 17 వరకూ పొడిగించిన కేంద్రం.. అదే సమయంలో కీలక సడలింపులు కూడా ప్రకటించింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లొచ్చని చెప్పింది. ఆ మేరకు అంతటా ఏర్పాట్లు జరిగినా, ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో మాత్రం ఒకింత విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాల పోలీసులు పోటాపోటీగా కూలీలను అడ్డుకోవడంతో ఒకింత ఉద్రిక్తత ఏర్పడింది.
Recommended Video
ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లోని అన్ని చెక్ పోస్టుల వద్ద ఇదేరకమైన వాతావరణం కనిపించింది. కోదాడ, అశ్వారావుపేట, నాగార్జున సాగర్, కర్నూలు సమీపంలోని చెక్ పోస్టుల వద్ద.. తెలంగాణ నుంచి ఏపీకి వెళుతున్న వారిని ఏపీ పోలీసులు అడ్డగించగా, ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చేందుకు యత్నించిన వారిని ఇటువైపు పోలీసులు అడ్డుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు పాసులున్నాయని జనం మొత్తుకున్నా.. అధికారులు వినిపించుకోకపోవడంతో ఆయా చెక్ పోస్టుల వద్ద భారీగా జనం, వాహనాలు నిలిచిపోయాయి.

ఒక దశలో తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికులు పోలీసుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదుకోవాల్సిందిగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు, ఉన్నతాధికారులకు మొరపెట్టుకుననారు. వాడపల్లి చెక్ పోస్ట్, నాగార్జున సాగర్ చెక్ పోస్ట్, కోదాడ రామాపురం క్రాస్ రోడ్ చెక్ పోస్టుల వద్ద రాత్రి నుంచి పిల్లాపాపలతో నిలిచిపోయామంటూ వలస కూలీలు మీడియాకు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
వలస కూలీల రాక పెరగడంతో వారికోసం పోలీసులు భోజనాలు సిద్ధం చేశారు. కూలీలను అనుమతించే విషయమై రెండు రాష్ట్రాల అధికారులు చర్చలు జరుపుతున్నారు. శనివారం ఏపీ నుంచి వచ్చిన బస్సులు కొంతమంది కూలీలను తీసుకెళ్లాయి.












Click it and Unblock the Notifications