రాజ్యసభ నుంచి కేవీపీ సస్పెన్షన్, చిన్నపిల్లలా: ఎంపీలపై స్పీకర్ ఆగ్రహం, బాబుకు రాజ్ ఫోన్
Recommended Video

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు బుధవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యాయి. ఏపీకి న్యాయం చేయాలంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోకసభలో ఆందోళన కొనసాగించారు. స్పీకర్ పోడియం వద్ద సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు.
ఏపీకి న్యాయం చేయాలని పట్టుబట్టారు. వారు సభ్యుల ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు. అయితే కాసేపట్లే ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారని, దానికి అడ్డుపడవద్దని కేంద్రమంత్రులు కోరారు. దానికి టీడీపీ ఎంపీలు ససేమీరా అన్నారు.

చంద్రబాబుతో మాట్లాడిన రాజ్‌నాథ్
ఏపీ ఎంపీలు తమ ఆందోళనలు సభలో కొనసాగించారు. ఏదైనా ఉంటే తమ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు చెప్పాలని అన్నారు. దీంతో కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేశారు. హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని, నిరసనలు తాత్కాలికంగా ఆపేయాలని కోరారు.

కేవీపీ డ్రామాలు చెప్పాం
రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రజల ఇబ్బందులను తాము ఆయనకు వివరించామని చెప్పారు. టీడీపీ డ్రామాలు అతనికి చెప్పామన్నారు.

రాజ్యసభ నుంచి కేవీపీ సస్పెన్షన్
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు బుధవారం రాజ్యసభ నుంచి ఒక్కరోజు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కేవీపీ పదేపదే నిరసన తెలుపుతోన్న విషయం తెలిసిందే. సభకు అడ్డుపడుతున్నారని చెబుతూ కేవీపీని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేశారు

ఉభయ సభల్లో నిరసనలు
టీడీపీ, వైసీపీ ఎంపీలు ఉభయ సభల్లో నిరసన తెలుపుతున్నారు. వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైయస్ అవినాశ్ రెడ్డిలు అంతకుముందు గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. సోమ, మంగళ వారాలు అదే ప్రాంతంలో టీడీపీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు.

సుమిత్రా మహాజన్ ఆగ్రహం
లోకసభలో నిరసన తెలుపుతున్న టీడీపీ, వైసీపీ ఎంపీలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ చిన్న పిల్లల్లా ప్రవర్తించి ఇంటికి వెళ్లి పిల్లలకు కూడా క్రమశిక్షణ నేర్పలేరని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులకు అడ్డుగా ప్లకార్డులు పట్టుకోవడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications