రేపో మాపో జైలుకి పోయే గాలిగాడు; రోడ్లపై ఆంబోతుల్లా వారు : జగన్, వైసీపీ నాయకులపై ఘాటుగా లోకేష్
తెలుగుదేశం పార్టీ మహిళా నేత మాజీ జడ్పిటిసి బత్తిని శారద ఇంటిపై వైసిపి కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. బీభత్సం సృష్టించారు. రెండు గంటల పాటు వీరంగం వేశారు. రాళ్ళతో దాడి చెయ్యటమే కాకుండా ఇంట్లో ఉన్న సామాగ్రిని ధ్వంసం చేసి ఆరు ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టి, ఇంటికి నిప్పంటించారు. పోలీసుల ముందే ఈ సంఘటన జరిగినా పోలీసులు వైసీపీ మూకలను అడ్డుకోలేకపోయారు. ఏపీ హోం మంత్రి సొంత నియోజకవర్గంలో గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో జరిగిన దాడి ఘటనను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
జగన్ రెడ్డి ఫ్యాక్షన్ మూకల దాడులు .. పోలీసుల ప్రేక్షక పాత్ర : లోకేష్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల దాడులపై తెలుగుదేశం పార్టీ నిప్పులు చెరుగుతోంది. టిడిపి మహిళా నాయకురాలు, మాజీ జడ్పిటిసి బత్తిని శారద ఇంటిపై వైసీపీ కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో జగన్ రెడ్డి ఫ్యాక్షన్ మూకలు రెచ్చిపోతున్నారని, ఇక పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని తాజా ఘటన నేపథ్యంలో లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు లో టీడీపీ నాయకురాలు శారద ఇంటిపై వైసిపి గుండాల దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్న లోకేష్ విచక్షణ రహితంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వారు జీవితాంతం గుర్తుండే శిక్ష అనుభవించటం ఖాయమన్న లోకేష్
అంతేకాదు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు లోకేష్. రేపో మాపో జైలుకు పోయే గాలి గాడిని చూసుకుని రోడ్లపై ఆంబోతులా తిరుగుతున్న ప్రతి ఒక్కడు జీవితాంతం గుర్తుండేలా శిక్ష అనుభవించటం ఖాయమంటూ లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు వైసిపి నాయకులు చేసే తప్పుడు పనులకు ఆహా ఓహో అంటూ కితాబు ఇవ్వటం మానేసి పోలీసులు శారద కుటుంబ సభ్యుల మీద విచక్షణారహితంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు .
యధావిధిగా వైసీపీ మసాజ్ అంటారా పోలీసు సంఘం వారు ? లోకేష్ ప్రశ్న
ఇదే సమయంలో ఆ దాడిలో ఒక ఎస్సై కి కూడా గాయాలయ్యాయని, ఇక దీనిపై యధావిధిగా వైసీపీ మసాజ్ అంటారా పోలీసు సంఘం వారు ? అంటూ నారా లోకేష్ సెటైర్లు వేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని వైసీపీ దాడులు చేస్తోందని, ఫలితంగా పోలీసులు కూడా దెబ్బలు తినే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. వైసిపి అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయని టిడిపి సీనియర్ నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. మాజీ జెడ్పిటిసి ఇంటిపై దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం అడుగడుగున కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు వద్దని కోర్టు చెప్పినా పట్టించుకోలేదని అర్ధరాత్రి వరకు ఊరేగింపు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

బాధిత టీడీపీ నాయకులపై కేసులు పెడుతున్న పోలీసులు : ధూళిపాళ్ళ నరేంద్ర
పోలీసులను అడ్డుపెట్టుకొని వైసీపీ దాడులు చేస్తున్నా, రెండు గంటలపాటు అల్లరి మూకల అరాచకం చేసినా పోలీసులు బాధితులపై కేసులు పెట్టాలని చూడటం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. తగలబెట్టిన ద్విచక్ర వాహనాలను పోలీసులు ఎక్కడికి తీసుకు వెళ్ళారో చెప్పాలని ప్రశ్నించిన దూళిపాళ్ల నరేంద్ర, దాడి జరిగిన తర్వాత కేసుల పేరుతో టిడిపి నాయకులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, బాధిత కుటుంబాన్ని స్టేషన్ కు రమ్మని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. టిడిపి మహిళా నాయకురాలు శారద, వేణు దంపతులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ధూళిపాళ్ళ నరేంద్ర భరోసా ఇచ్చారు.
-
RDT: ఫలించిన మంత్రి లోకేష్ మంత్రాంగం-మళ్లీ మొదలైన ఆర్డీటీ సేవా ప్రస్థానం..!! -
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications