మళ్లీ తప్పులో కాలేసిన లోకేష్: లాజిక్ లేని ప్రశ్నతో జగన్‌పై ఇలా!..

ఏదేమైనా నారా లోకేష్ తన ప్రసంగాల్లో ఇంకా తడబాటును, తప్పులను కొనసాగించినంత కాలం ఆయన ప్రత్యర్థి వర్గం వాటికి మరింత ప్రాచుర్యం కల్పిస్తూనే ఉంటుంది.

నెల్లూరు: ఏపీ మంత్రి నారా లోకేష్ తప్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా నెల్లూరులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మరోసారి తప్పులో కాలేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు పూర్తయిపోతే.. ఆయన మాత్రం తన ప్రసంగంలో పొరపాటుగా 66ఏళ్లని ప్రస్తావించారు.

సరే, ఈ సంగతి పక్కనబెడితే.. గతంలో సీఎంగా పనిచేసిన వ్యక్తికి తనయుడిగా ఉండి రాష్ట్రానికి ఏం కంపెనీలు తీసుకొచ్చారో చెప్పాలని వైసీపీ అధినేత జగన్‌ను లోకేష్ డిమాండ్ చేశారు. సీఎం తనయుడికి రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావడానికి సంబంధమేంటనేది అర్థం కాని లాజిక్. తండ్రి సీఎం అయినంత మాత్రాన తనయుడు పరిశ్రమలు తీసుకురావాలని లోకేష్ ప్రశ్నించడంలో ఆంతరార్థమేంటో ఎవరికీ అర్థం కాలేదు.

lokesh agains commits mistake in his speech

ఏదేమైనా నారా లోకేష్ తన ప్రసంగాల్లో ఇంకా తడబాటును, తప్పులను కొనసాగించినంత కాలం ఆయన ప్రత్యర్థి వర్గం వాటికి మరింత ప్రాచుర్యం కల్పిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో సెటైర్లు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి వేదికల పైన లోకేషే కాస్త ఆచీ తూచీ మాట్లాడితే ఈ తలనొప్పంతా ఉండదు కదా! అనేది మరికొందరి వాదన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+