గూగుల్ డేటా సెంటర్ స్పీడప్..! సుందర్ పిచాయ్ కు లోకేష్ తాజా వినతులు..!
ఏపీలోని విశాఖలో 15 బిలియన్ డాలర్ల ఖర్చుతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడంతో కూటమి సర్కార్ ఆ మేరకు గతంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. అదానీ సహకారంతో ఈ డేటా సెంటర్ త్వరలో ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గూగుల్ తో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ టచ్ లో ఉన్నారు. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో లోకేష్ భేటీ అయి చర్చలు జరిపారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్..శాన్ ఫ్రాన్సిస్కో లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో పాటు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే (గ్లోబల్ నెట్ వర్కింగ్ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను కలిశారు. విశాఖలో $15బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నతస్థాయి బృందానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విశాఖపట్నంలో AI డేటా సెంటర్ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించడం, అమలుపై చర్చించారు.

అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పోరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ ను ప్రోత్సహించాలని గూగుల్ ను కోరినట్లు తెలిపారు. ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, కేలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని కూడా వారికి విజ్ఞప్తి చేశారు. అనంతరం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. భారత్ లో క్లౌడ్ రీజియన్‌ల విస్తరణతోపాటు "గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్" ద్వారా స్టార్టప్‌లకు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు.

#GoogleChoosesAP
— Lokesh Nara (@naralokesh) December 10, 2025
It was a pleasure to meet Sundar Pichai, CEO @Google, along with Thomas Kurian & Bikash Koley in San Francisco. I thanked Google for their landmark B investment in the Visakhapatnam AI Data Center - set to be one of the largest FDI projects outside the US. We… pic.twitter.com/55wgy7mBDM
విశాఖపట్నంలో గూగుల్ ప్రకటించిన $15 బిలియన్ విలువైన AI డేటా సెంటర్ అమెరికా బయట అతిపెద్ద ఎఫ్డీఐగా తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో ఫాక్స్‌కాన్‌తో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ద్వారా గూగుల్ డ్రోన్లు "వింగ్స్" తయారవుతున్నాయని తెలిపారు. గూగుల్ ఉత్పత్తులను ప్రతి నెలా 500 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉపయోగిస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు. ఈ సమావేశంలో బికాష్ కోలే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ నెట్ వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, థామస్ కురియన్ సిఈఓ గూగుల్ క్లౌడ్ పాల్గొన్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications