మంగళగిరిలో టీడీపీ బలహీనంగా.. అందుకే ఓడిపోయానన్న లోకేష్; జగన్ పోటీపై సవాల్!!

మంగళగిరి ఓటమిపై మాట్లాడిన లోకేష్, వైఎస్‌ జగన్‌కు వచ్చే ఎన్నికల పోటీపై సవాల్‌ విసిరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతల వచ్చే ఎన్నికల వ్యూహాలతో ఏపీలో పొలిటికల్ హీట్ ఇప్పటికే పీక్స్ లో కనిపిస్తుంది. ప్రజల మద్దతు కోసం ఎవరికి వారు ప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీల నేతలు మాటల తూటాలను పేలుస్తూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు.

 మంగళగిరిలో ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన లోకేష్

మంగళగిరిలో ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన లోకేష్


ఇక తాజాగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డిని ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న లోకేష్ తనదైన శైలిలో అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపిస్తున్న లోకేష్ తాజాగా మంగళగిరిలో గత ఎన్నికలలో తన ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర సందర్భంగా పీలేరులో మీడియాతో మాట్లాడిన ఆయన పలు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

పార్టీ బలహీనంగా ఉన్న చోట గెలవాలని మంగళగిరిలో పోటీ

పార్టీ బలహీనంగా ఉన్న చోట గెలవాలని మంగళగిరిలో పోటీ

వైఎస్ఆర్ పార్టీ నేతలు మంత్రులు పదేపదే లోకేష్ ను మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయాడని విమర్శలు గుప్పిస్తుంటే దానికి సమాధానం గా మాట్లాడిన లోకేష్ గతంలో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ రెండుసార్లు మాత్రమే గెలిచిందని, మంగళగిరిలో పార్టీ బలహీనంగా ఉండడం వల్ల తను ఓటమిపాలయ్యానని పేర్కొన్నారు. పార్టీ బలహీనంగా ఉన్నచోట గెలవాలన్న ఉద్దేశంతో తాను అక్కడ నుంచి ఎన్నికల బరిలోకి దిగానని లోకేష్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేయాలని చెప్పినప్పటికీ, తెలుగుదేశం పార్టీకి బలం లేని చోట పోటీ చేసి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తాను చెప్పినట్టుగా లోకేష్ వెల్లడించారు.

జగన్ కు దమ్ముంటే ఆ పని చెయ్యాలన్న లోకేష్

జగన్ కు దమ్ముంటే ఆ పని చెయ్యాలన్న లోకేష్

తాను గెలవడం కోసమే పోటీ చేయాలి అని భావిస్తే తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఎలా ఉండే స్థానాలలో పోటీ చేసే వాడినని లోకేష్ తెలిపారు. వచ్చే ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గంలో విజయం సాధిస్తామని, మంగళగిరిని తెలుగుదేశం కంచుకోటగా మారుస్తానని లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరిన లోకేష్ జగన్ కు దమ్ముంటే వైసిపి బలహీనంగా ఉన్నచోట పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు.

పులివెందుల కాకుండా అక్కడ జగన్ పోటీ చేసి గెలుస్తారా?

పులివెందుల కాకుండా అక్కడ జగన్ పోటీ చేసి గెలుస్తారా?

పులివెందుల జగన్ కుటుంబానికి ఎప్పటినుంచో అనుకూలమైన ప్రాంతమని, జగన్ పులివెందుల గెలవడం పెద్ద కష్టమైన పనేమీ కాదని లోకేష్ పేర్కొన్నారు. పులివెందులలో గెలిస్తే గొప్ప కాదని పేర్కొన్న లోకేష్ దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలన్నారు. వైసీపీకి అంత బలముంటే విశాఖపట్నంలో పోటీ చేసిన వైయస్ విజయమ్మ ఎందుకు ఓడిపోయారో చెప్పాలని ప్రశ్నించారు లోకేష్.

జనసేన టీడీపీ పొత్తులపైనా లోకేష్ వ్యాఖ్యలు

జనసేన టీడీపీ పొత్తులపైనా లోకేష్ వ్యాఖ్యలు


ఇక ఇదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తుల గురించి జగన్ భయపడుతున్నారని, అందుకే సింగిల్ గా 175 స్థానాల్లో పోటీ చెయ్యాలని అంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. ఇక భయంతోనే తన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని సైతం టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇవన్నీ వాళ్ళు భయపడుతున్నారని చెప్పే సంకేతాలని లోకేష్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+