వైఎస్ జగన్ చీఫ్ మినిస్టర్ ముసుగు తీసేసి.. ఫ్యాక్షన్ రెడ్డి గ్యాంగుల నెత్తుటి దాహం : లోకేష్ ధ్వజం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిణామాలపై, కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న టిడిపి నేతల దారుణ హత్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన లోకేష్ వైయస్ జగన్ చీఫ్ మినిస్టర్ ముసుగు తీసేసి, ఫ్యాక్షనిస్టు నిజరూపాన్ని బయటపెడుతున్నారు అంటూ జగన్ ను టార్గెట్ చేసి తీవ్రంగా ఫైర్ అయ్యారు.

వేట కొడవళ్లు, కత్తులూ, గొడ్డళ్ళకు పదును పెట్టి పల్లెల్లో వైసీపీ ప్రతీకారాలు
ఫ్యాక్షన్ రెడ్డి గ్యాంగులు వేట కొడవళ్లు, కత్తులూ, గొడ్డళ్ళకు పదును పెట్టి పల్లెల్లో ప్రతీకారాలకు దిగుతున్నాయి అంటూ నిప్పులు చెరిగారు. అంతేకాదు టిడిపి శ్రేణులు లక్ష్యంగా వైసిపి ఫ్యాక్షన్ ముఠాలు చెలరేగి పోతున్నాయని ఆరోపించిన నారా లోకేష్ కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం పెసరవాయిలో టిడిపి నాయకులు వడ్డి నాగేశ్వరరెడ్డి , వడ్డి ప్రతాపరెడ్డిలనుకార్లతో ఢీ కొట్టిన వైసీపీ ఫ్యాక్షన్ లీడర్ లు వేట కొడవలితో నరికి చంపారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్.

జగన్ రెడ్డి ,ఆయన పార్టీ నేతల నెత్తుటి దాహానికి ఈ దారుణ మరణాలు సాక్ష్యం
ఈ ఘటన అత్యంత దారుణమని ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నారంటూ పేర్కొన్న నారా లోకేష్ మృతులు, వైసిపి బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి ,ఆయన పార్టీ నేతల నెత్తుటి దాహానికి ఈ దారుణ మరణాలు సాక్ష్యం అంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఫ్యాక్షన్ ముఠాలు ఆ ఫ్యాక్షన్ కే పోతాయని పేర్కొన్నారు.
Recommended Video

కర్నూలు టీడీపీ నేతల దారుణ హత్యలపై భగ్గుమన్న టీడీపీ
గ్రామాలలో శాంతి నెలకొల్పడానికి, స్నేహపూర్వక వాతావరణం కల్పించటానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధమే అంటూ లోకేష్ పేర్కొన్నారు. గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో జరిగిన దారుణ హత్యలపై టిడిపి నాయకులు స్పందిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన గౌరు చరితారెడ్డి, వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. టిడిపి నాయకులను అత్యంత దారుణంగా వేటకొడవళ్లతో హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications