వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళిత జాతికి అన్యాయం; దళిత డిప్యూటీ సీఎం స్పందించరేం? వైసీపీ న‌యా ఫ్యాక్ష‌నిజమంటూ లోకేష్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు రక్షణ కరువైందని ఆయన విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా పెదకంటిపల్లిలో అప్పు చెల్లించలేదని దళితుడు చంద్రన్ పై ఈశ్వర్ రెడ్డి విచక్షణారహితంగా దాడి చేశారని నారా లోకేష్ ఆరోపించారు. ఇదే సమయంలో పిడుగురాళ్ళలో ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధిపై దాడిని లోకేష్ తీవ్రంగా ఖండించారు.

వివేకా హత్యకేసు: జగన్ వెకిలినవ్వు; సందర్భం చెప్తే గొడ్డలి బహుమతి: క్లూ ఇచ్చిన లోకేష్వివేకా హత్యకేసు: జగన్ వెకిలినవ్వు; సందర్భం చెప్తే గొడ్డలి బహుమతి: క్లూ ఇచ్చిన లోకేష్

వైఎస్ జగన్, ఆయన అనుయాయులు దళితులపై దమనకాండ

వైఎస్ జగన్, ఆయన అనుయాయులు దళితులపై దమనకాండ

ముఖ్య‌మంత్రి వైయస్ జగన్, ఆయ‌న పార్టీ, ఆయ‌న సామాజిక‌వ‌ర్గ నేత‌లు ద‌ళితుల‌పై సాగిస్తున్న ద‌మ‌న‌కాండ‌కి హ‌ద్దే లేకుండా పోతోందని లోకేష్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని నందనూరు పంచాయతీ పెద్దకంటిపల్లి గ్రామానికి చెందిన చంద్రన్ అనే దళితుడిని డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి రైట్‌హ్యాండ్ ఈశ్వర్ రెడ్డి కాళ్లూ చేతులూ విరిచేయ‌డం రాష్ట్రంలో ద‌ళితుల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ‌లేద‌ని మ‌రోసారి స్ప‌ష్ట‌మైందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మీడియాను సైతం పోస్ట్ చేసి ఏపీలో అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

దళిత జాతికి అన్యాయం జరుగుతుంటే దళిత డిప్యూటీ సీఎం స్పందించరేం

ప‌దివేలు బాకీ చెల్లించ‌లేద‌ని చంద్ర‌న్ ని త‌న మామిడితోట‌కి ఎత్తుకెళ్లిన ఈశ్వ‌ర్‌రెడ్డి కాళ్లూ చేతులూ విర‌గ్గొట్టించేయ‌డం పైశాచికానికి ప‌రాకాష్ట‌ అని నారా లోకేష్ మండిపడ్డారు. బాధితులైన ద‌ళితులు స్టేష‌న్‌లో ఫిర్యాదుచేస్తే పోలీసులు క‌నీసం ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌క‌పోవ‌డం మ‌న రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్...వైసీపీ ఆర్డ‌ర్‌లో ఉంద‌ని తేట‌తెల్లం చేస్తోందని నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో ఏపి డిప్యూటీ సీఎం ను టార్గెట్ చేసిన లోకేష్ జ‌గ‌న్ భ‌జ‌నలో నిత్య‌మూ మునిగి తేలే ద‌ళిత ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామి ..మీ ద‌ళిత‌జాతికి ఇంత అన్యాయం జ‌రుగుతుంటే,స్పందించ‌రేం? అంటూ ప్రశ్నించారు.

 ఈశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలని లోకేష్ డిమాండ్

ఈశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలని లోకేష్ డిమాండ్

ద‌ళితుడైన చంద్ర‌న్ ని దండించిన ఈశ్వ‌ర్‌రెడ్డిపై కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేసి పోలీసులు చిత్త‌శుద్ధిని నిరూపించుకోవాలి అని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ వైసిపి అండర్ లో ఉన్నాయని, పోలీసులు ఇకనైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకడం మానుకోవాలని లోకేష్ పేర్కొన్నారు. వెంటనే ఈశ్వర్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

మీడియాపైనా దాడుల‌కు తెగ‌బ‌డ‌టం వైసీపీ న‌యా ఫ్యాక్ష‌నిజం

ఇదే సమయంలో మీడియాపైనా దాడుల‌కు తెగ‌బ‌డ‌టం వైసీపీ న‌యా ఫ్యాక్ష‌నిజం అంటూ లోకేష్ మండిపడ్డారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఈ సారి నరసరావుపేట నుండి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని ఓ న్యూస్ ఛానల్ లో స్టోరీ వేశార‌నే అక్క‌సుతో పిడుగురాళ్ల న్యూస్ ఛానల్ ప్ర‌తినిధి మల్లేశ్వరి వాహ‌నం గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల‌తో వైసీపీ ఎమ్మెల్యే త‌గల‌బెట్టించ‌డం, ఫోన్లు చేసి చంపుతామ‌ని బెదిరించ‌డం దారుణం అంటూ లోకేష్ మండిపడ్డారు.

Recommended Video

The TDP ranks anointed Nara Lokesh as a great leader | Oneindia Telugu
 న్యూస్ చానల్ ప్రతినిధిపై దాడిని ఖండించిన లోకేష్

న్యూస్ చానల్ ప్రతినిధిపై దాడిని ఖండించిన లోకేష్


న్యూస్ ఛానల్ ప్ర‌తినిధి మల్లేశ్వరిపై దాడుల్ని ఖండిస్తున్నాను అంటూ పేర్కొన్న లోకేష్, ఆమెకి ఏమైనా జ‌రిగితే పూర్తి బాధ్య‌త గుర‌జాల ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డి, ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. బెదిరిస్తున్న వారిని పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసి మల్లీశ్వరికి రక్షణ కల్పించాలని లోకేష్ డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విలేకరులపై కూడా దాడులు పెరిగిపోయాయని నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Will the Dalit Deputy CM respond if injustice is done to the Dalit community? Lokesh questioned the attack on the Dalit. Lokesh also lashed out at the YSRCP new factionism for attacking the media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X