Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతి పేరు వింటేనే జగన్ రెడ్డి వణికిపోతున్నారు.. మహోద్యమంగా అమరావతి పోరు : లోకేష్ స్పష్టం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అమరావతిలో ఆందోళనకు కారణమైన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రాజధాని తరలింపు విరమించుకోవాలని అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఆందోళన నిన్న 600వ రోజుకు చేరుకోవడంతో ఉద్యమం ఒకసారి ఉద్రిక్తంగా మారింది. రాజధాని అమరావతి రగిలిపోయింది.అమరావతి నిరసన ప్రదర్శన 600 రోజులకు చేరుకున్న సందర్భంలో రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

 అడుగడుగునా అమరావతి పోరాటాన్ని అడ్డుకున్న పోలీసులు

అడుగడుగునా అమరావతి పోరాటాన్ని అడ్డుకున్న పోలీసులు

అమరావతి ఐక్యకార్యాచరణ సమితి చేపట్టిన బైక్ ర్యాలీతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దేవస్థానం నుంచి న్యాయస్థానం వరకు అనే పేరుతో సాగిన బైక్ ర్యాలీలో మంగళగిరి పానకాల లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం నుండి వెలగపూడి లోని హైకోర్టు భవనసముదాయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు అమరావతి ఉద్యమ నాయకులు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుని అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.రాజధాని అమరావతి కోసం ఇటు టిడిపి నాయకులు సైతం అమరావతి ఐక్యకార్యాచరణ సమితి కి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. టిడిపి ప్రధాన కార్యాలయం వద్ద నుండి ఆ పార్టీ అధ్యక్షుడు జంగాల సమస్యల ఆధ్వర్యంలో చేపట్టిన రాలిని రైల్వే గేట్ సమీపంలో అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు.

 అమరావతి ఆందోళనలో 61 మందిపై కేసులు నమోదు

అమరావతి ఆందోళనలో 61 మందిపై కేసులు నమోదు

మరోపక్క కృష్ణాజిల్లా నందిగామ నుంచి, ఇంకొక గుండిమెడ నుండి రాజధాని అమరావతి కి మద్దతుగా ర్యాలీలు నిర్వహించగా పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకున్నారు రాజధాని అమరావతి రైతులకు సంఘీభావం తెలియజేయడానికి బస్సులో వచ్చిన మహిళలు సైతం సీతానగరం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పెనుమాక లో చేపట్టిన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు టిడిపి నేతలను అరెస్టు చేశారు. ఇక ఈ ఆందోళనలో పాల్గొన్న అమరావతి ఐక్యకార్యాచరణ నాయకులపై సెక్షన్ 151 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళగిరి అర్బన్, గ్రామీణ పోలీస్ స్టేషన్లలో 23 మందిపై, తాడేపల్లి లో 38 మందిపై పోలీసులు కేసు పెట్టారు. తుళ్లూరులో సైతం ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అమరావతి కోసం ఉద్యమించిన ఉద్యమ నాయకులను, టీడీపీ నేతలను అరెస్టు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

జగన్ ప్రభుత్వ అణచివేతకు ఎదురొడ్డి నిలిచి మహోద్యమంగా మారిందన్న లోకేష్

జగన్ ప్రభుత్వ అణచివేతకు ఎదురొడ్డి నిలిచి మహోద్యమంగా మారిందన్న లోకేష్

ప్రస్తుతం సైతం రాష్ట్ర రాజధాని అమరావతిలో నివురుగప్పిన నిప్పులా ఉద్యమం కొనసాగుతోంది. ఇక తాజా పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి పేరు వింటేనే జగన్ రెడ్డి వణికిపోతున్నారని, ప్రజా రాజధాని పరిరక్షణ ఉద్యమం జగన్ ప్రభుత్వ అణచివేతకు ఎదురొడ్డి నిలిచి మహోద్యమంగా మారిందని నారా లోకేష్ పేర్కొన్నారు. శాంతియుతంగా చేపట్టిన బైక్ ర్యాలీ పై పోలీసులు ఉక్కుపాదం మోపారని మండిపడిన లోకేష్ రైతుల పట్ల, మహిళల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెఎసి పిలుపు మేరకు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఉద్యమ కారులను బలవంతంగా అరెస్టు చేశారని, వ్యాన్లలో కుక్కారని, రైతుల కాళ్లు విరగ్గొట్టారని, మహిళల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

అమరావతి శాశ్వతం .. అంతమ విజయం పోరాటానిదే : లోకేష్

అమరావతి శాశ్వతం .. అంతమ విజయం పోరాటానిదే : లోకేష్

ఉద్యమంపై ప్రభుత్వ అణచివేత బయటపడకుండా మీడియా ప్రతినిధులను నిర్బంధించారని నిప్పులు చెరిగారు. ఖాకీల వలయాన్ని ఛేదించడానికి మంగళగిరి దేవస్థానం చేరుకొని జై అమరావతి అని నినదించడమే నేరంగా జైల్లో బందీలైన రైతులు, మహిళలు, టిడిపి నేతలు, ఉద్యమకారుల పోరాటానికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను. న్యాయమైన మీ పోరాటానిదే అంతిమ విజయం.. అమరావతి శాశ్వతం అంటూ లోకేష్ అమరావతి కోసం పోరాటం చేస్తున్న ఉద్యమకారులను ఉద్దేశించి పేర్కొన్నారు. రాజధాని అమరావతిని తరలించడానికి ఎవరెన్ని కుట్రలు చేసినా రాజధానిగా అమరావతిని సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

 భూములు ఇవ్వటమే రైతులు చేసిన పాపమా : యనమల ధ్వజం

భూములు ఇవ్వటమే రైతులు చేసిన పాపమా : యనమల ధ్వజం

రాజధాని అమరావతిలో కొనసాగిన నిర్బంధకాండపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సంఘవిద్రోహ శక్తులా.. ఎందుకు పోలీసులు ఈ విధంగా రైతులను అరెస్ట్ చేస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కన్నతల్లి లాంటి భూములను ఇవ్వడమే రైతులు చేసిన పాపమా, ప్రభుత్వం అందుకే వారిని వేధింపులకు గురిచేస్తున్నారా అంటూ యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. పౌరహక్కులు రాష్ట్రంలో కాగితాలకే పరిమితమయ్యాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులు, మహిళల పట్ల పోలీసుల ప్రవర్తన చాలా అతిగా ఉందని ఆయన తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.

అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్తున్న అమరావతి జేఏసీ

అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్తున్న అమరావతి జేఏసీ


ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్న దగ్గర నుండి రాజధాని ప్రాంత రైతులు నిత్యం రగిలిపోతూనే ఉన్నారు. రాజధాని ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని విశాఖకు రాజధాని తరలింపును నిరసిస్తూ సాగుతున్న ఆందోళనలు ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కొనసాగుతుందని అమరావతి ప్రాంత రైతులు తేల్చి చెబుతున్నారు. అరెస్టు చేసినా, అణగదొక్కేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, జైలుకు పంపినా ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తున్నారు. జగన్ తన మొండి వైఖరిని విడనాడాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. రాజధాని అమరావతి కోసం 600 రోజులుగా ఉద్యమం సాగుతున్నా ఏపీ సీఎం జగన్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+