తప్పుకు ఇంకో ఛాన్స్ ఇవ్వకండి; కళ్ళు మూసుకుని వెళ్ళకండి: న్యూ ఇయర్ రోజు లోకేష్ ఆసక్తికర పోస్ట్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పోస్ట్ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. నారా లోకేష్ గడచిన కాలంలో మనం తప్పు దారి పట్టి ఉండవచ్చని, బలహీనతల వల్ల మోసపోయి ఉండొచ్చని పేర్కొంటూనే కాలంతో పాటు కళ్లుమూసుకుని వెళ్ళకండి అంటూ ఆసక్తికర పోస్ట్ చేశారు.

బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు
నారా లోకేష్ చేసిన పోస్టులో గడచిన కాలంలో మన ఆలోచనలు, నమ్మకాలలో కొన్ని మనల్ని తప్పుదారి పట్టించి ఉండవచ్చు. మన బలహీనతల వల్ల మోసపోయి ఉండవచ్చు. అలాగని బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతూ ఉండాలి. చేసిన తప్పుకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వకుండా మార్పును ఆహ్వానించాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసిన లోకేష్
అంటే లోకేష్ చేసిన వ్యాఖ్యలలో గడిచిన కాలంలో వైసీపీకి అధికారం కట్టబెట్టడమే తప్పని, జగన్ చెప్పిన హామీలను నమ్మి, నవరత్నాల హామీలతో మోసపోయామన్న భావన వ్యక్తమవుతోంది. మోసపోయి ఇప్పుడు బాధపడుతున్నామని, అలా బాధ పడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని, గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా మార్పును ఆహ్వానించాలి అంటూ లోకేష్ ప్రజలకు చెప్తున్నారు అన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కాలంతోపాటు కళ్ళుమూసుకుని వెళ్ళకండి అంటూ హితవు
అంతేకాదు కాలంతోపాటు కళ్ళుమూసుకుని వెళ్ళకండి అంటూ హితవు పలికారు లోకేష్. రేపటి రోజు నాదే అన్న ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే,ముందున్న కాలం మనం చెప్పినట్టుగా నడుస్తుంది అంటూ భవిష్యత్తులో ప్రజలు సంకల్పిస్తే ప్రజలకు అనుకూలంగా ఉండే రోజులు వస్తాయని పేర్కొన్నారు. ఆ సంకల్పమే కొత్త ప్రగతిని ఇస్తుందని లోకేష్ స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం మీ జీవితానికి శుభాలను పంచాలని ఆశిస్తూ...మీ ఇంటిల్లిపాదికీ నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు అంటూ లోకేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త గా చెప్పారు.
భవిష్యత్తులో తప్పుకు మళ్లీ ఇంకో చాన్స్ ఇవ్వకుండా ముందుకు సాగాలి
లోకేష్ చేసిన ఈ పోస్ట్ ఏపీలో ప్రభుత్వ పాలనను, ప్రస్తుత పాలక పార్టీని ఉద్దేశించి ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని ఉద్దేశించే అన్న చర్చ ప్రస్తుతం ఏపీలో జోరుగా సాగుతోంది. ఏదేమైనా చాలా కాలంగా ప్రజలు వైసీపీకి పట్టం కట్టి తప్పు చేశారని, ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో తప్పుకు మళ్లీ ఇంకో చాన్స్ ఇవ్వకుండా ముందుకు సాగాలని లోకేష్ పేర్కొన్నారు. పండుగలైనా, పబ్బాలైనా, సందర్భం ఏదైనా సరే లోకేష్ టార్గెట్ మాత్రం వైసీపీ ప్రభుత్వమే అని స్పష్టంగా అర్ధం అవుతుంది. ఎక్కడా పేరు పేర్కొనకున్నా లోకేష్ చేసే నర్మ గర్భ వ్యాఖ్యలు వైసీపీని ఉద్దేశించే అన్న భావన కలిగిస్తున్నాయి.

తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన టీడీపీ
తెలుగుదేశం పార్టీ కూడా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రతి తెలుగు కుటుంబం ఆనందకాంతులతో వెలుగులీనాలని, కొత్త సంవత్సరంలో ప్రతిరోజూ కొత్త వేడుకలా సాగాలని కోరుకుంటూ.. ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తోంది తెలుగుదేశం పార్టీ అంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది. సరికొత్త ఉత్సాహంతో, కొత్త ఆలోచనలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వారందరికీ విషెస్ చెప్పింది.












Click it and Unblock the Notifications