
ఫ్యాన్ కు ఓటేసిన నిరుద్యోగులు ఫ్యాన్ కు ఉరేసుకునేలా.. జాబ్ క్యాలెండర్ పేరిట జగన్ జాదూ క్యాలెండర్ : లోకేష్ ఫైర్
నిరుద్యోగ
యువతకు
ఉద్యోగ
అవకాశాలు
కల్పించాలని
గత
కొద్ది
రోజులుగా
జగన్
సర్కార్
పై
పోరాటం
చేస్తున్న
టీడీపీ
జాతీయ
ప్రధాన
కార్యదర్శి
నారా
లోకేష్
మరోమారు
జగన్
సర్కార్
పై
విరుచుకుపడ్డారు.
రాష్ట్రం
లో
నిరుద్యోగ
సమస్య
తీవ్రంగా
ఉందని,
నిరుద్యోగులకు
జాబ్
క్యాలెండర్
ప్రకటించామని
చెప్పి
జాబ్
లెస్
క్యాలెండర్
ప్రకటించారని
మండిపడిన
లోకేష్
జగన్
సర్కార్
తీరుపై
తీవ్ర
అసహనం
వ్యక్తం
చేశారు.
ఈరోజు
టిడిపి
కేంద్ర
కార్యాలయంలో
నిరుద్యోగ
యువతకు
సమావేశమైన
లోకేష్
నిరుద్యోగ
యువతకు
జరిగిన
అన్యాయం,
భవిష్యత్
ఉద్యమ
కార్యాచరణపై
ప్రధానంగా
చర్చించారు.
నెల్లూరులో
స్టీల్
ప్లాంట్
..
జిందాల్
సంస్థకు
భూమిని
కేటాయిస్తూ
జగన్
సర్కార్
ఉత్తర్వులు

పదివేల ఉద్యోగాలు ఇచ్చి పండగ చేసుకోమంటున్నారని ఆగ్రహం
ఫ్యాన్
కు
ఓటేస్తే
నిరుద్యోగ
సమస్య
పరిష్కరిస్తానని
చెప్పిన
జగన్
రెడ్డి
అదే
ఫ్యాన్
కు
ఉరేసుకుని
నిరుద్యోగులు
ఆత్మహత్య
చేసుకునే
దుస్థితి
కల్పించారని
తీవ్రస్థాయిలో
ధ్వజమెత్తారు.
జాబ్
క్యాలెండర్
పేరుతో
జాదూ
క్యాలెండర్
విడుదల
చేశారని
మండిపడిన
ఆయన,
రెండు
లక్షల
30
వేల
ఉద్యోగాలకు
బదులు
పదివేల
ఉద్యోగాలు
ఇచ్చి
పండగ
చేసుకోమంటున్నారని
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
వైయస్సార్
కాంగ్రెస్
పార్టీ
అధికారంలోకి
వచ్చిన
తర్వాత
ఇప్పటి
వరకూ
కేవలం
15
వేల
ఉద్యోగాలను
మాత్రమే
ఇచ్చిందని
పేర్కొన్న
లోకేష్
ఓ
సినిమాలో
డైలాగ్
ను
గుర్తు
చేశారు.

జగన్ మెడలు వంచైనా 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా పోరాడతామన్న లోకేష్
అదేదో సినిమాలో బ్రహ్మానందం ఒక రూపాయికి పండగ చేసుకో అని చెప్పినట్టు ఏపీలో కూడా పరిస్థితి అలాగే ఉందని ఎద్దేవా చేశారు లోకేష్. జగన్ సర్కార్ మెడలు వంచిన రెండు లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసేలా పోరాటం సాగిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. జగన్ మెడలు వంచైనా 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా పోరాడతామని లోకేష్ స్పష్టంచేశారు. గ్రూప్ వన్, గ్రూప్ టూ కి సంబంధించి 2018 లో చంద్రబాబు ఇచ్చిన నోటిఫికేషన్ ను ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ భర్తీ చేయలేక పోయిందని నారా లోకేష్ విమర్శించారు.

రెండేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించామని మభ్యపెట్టే యత్నం
ఏపీపీఎస్సీ లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పేర్కొన్న లోకేష్, ఏపీపీఎస్సీ రాజకీయ వేదికగా మారిందని ఆరోపణలు గుప్పించారు. నిజంగా అర్హులైన అభ్యర్థులు బయట ఉంటే, డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు అంతా లోపల ఉద్యోగాలు చేస్తున్నారంటూ లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వం యువతను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని లోకేష్ విమర్శించారు. ఉద్యోగం రాకపోవడంతో చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .

కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యకుంటే ఉధృతంగా ఉద్యమం
నిరుద్యోగులను
ఉద్దేశించి
మాట్లాడుతూ
లోకేష్
ఆత్మహత్యలు
సమస్యకు
పరిష్కారం
కానే
కాదని,
నిరుద్యోగులు
నిరుత్సాహ
పడవద్దని,
అందరం
కలిసి
పోరాడుదాం
అని
పేర్కొన్నారు.
నెలరోజుల్లోగా
కొత్త
జాబ్
క్యాలెండర్
ను
విడుదల
చేయకపోతే
ఉద్యమాన్ని
ఉదృతం
చేస్తామని
లోకేష్
హెచ్చరించారు
.
అంతేకాదు
ఆత్మహత్య
చేసుకున్న
నిరుద్యోగ
యువత
కుటుంబాలకు
25
లక్షల
చొప్పున
ఎక్స్
గ్రేషియా
ప్రకటించాలని
లోకేష్
డిమాండ్
చేశారు.

జగన్ ట్యాక్స్ దెబ్బకు రాష్ట్రంలో పరిశ్రమలన్నీ బై బై
జగన్ టాక్స్ దెబ్బకి రెండేళ్లలో ఒక ప్రైవేట్ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న చాలా పరిశ్రమలు జగన్ దెబ్బకు బై బై ఉంటున్నాయని విమర్శించారు. రిలయన్స్, ట్రై టాన్ , అదానీ , ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి తరలిపోయాయి అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు . గత ఎన్నికలకు ముందు బై బై బాబు అని ప్రచారం చేయించిన వైసిపి హయాంలో రాష్ట్రంలో ప్రస్తుతం పరిశ్రమలన్నీ బై బై అంటున్నాయని లోకేష్ ఎద్దేవా చేశారు.