Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోకేష్ కు ప్రశాంత్ కిశోర్ బిగ్ అలర్ట్ - గ్రౌండ్ రిపోర్ట్..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, జనసేన కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవటం పైన కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. తాము బలోపేతం అయ్యేందుకు ప్రస్తుత సమయమే సరైనదిగా బీజేపీ, జనసేన భావిస్తున్నాయి. ఈ సమయంలోనే మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటనలో ప్రశాంత్ కిశోర్ తో భేటీ అయ్యారు. ఎన్నికల ముందు టీడీపీకి వ్యూహాలు.. సూచనలు అందించిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఏపీలో పరిస్థితుల పైన ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.

కీలక భేటీ
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ముఖ్య మంత్రి నివాసం 1-జన్‌పథ్‌కు పీకే వచ్చారు. అక్కడ దాదాపు గంటకు పైగా లోకేశ్‌తో చర్చలు జరిపారు. ఏపీలో 2019 ఎన్నికల్లో పీకేకు చెందిన ఐప్యాక్‌ వైసీపీ తరఫున పనిచేసింది. ఆతర్వాత ఐప్యాక్‌ నుంచి ఆయన బయటకు వచ్చేశారు. బిహార్‌లో 'జన్‌ సురాజ్‌' పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు. కాగా, 2024 ఎన్నికల సమయంలో పలు సందర్భాల్లో పీకే టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీలో జగన్ ఓటమి ఖాయమని ముందుగానే పీకే చెప్పుకొచ్చారు. టీడీపీకి పని చేస్తున్న రాబిన్ శర్మ టీంతో కలిసి కొన్ని కీలక వ్యూహాలు.. సూచనలు ఆ సమయం లోనే ప్రశాంత్ కిశోర్ టీడీపీకి అందించారు.

Lokesh meets Prashant Kishore in his Delhi Visit discussion over AP political situation as reports

గ్రౌండ్ రియాల్టీ
ఇక, ఇప్పుడు ఏపీతో పాటుగా తెలంగాణ రాజకీయాల పైన లోకేష్ తో ప్రశాంత కిశోర్ చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని భావిస్తొంది. ఈ మేరకు ప్రతిపాదన చర్చకు వచ్చింది. దీంతో, ఈ అంశం పైన ప్రశాంత్ కిశోర్ తో లోకేష్ ప్రధానం గా చర్చ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యే అవకాశం.. గ్రేటర్ తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్ ప్రభుత్వం బలం - బలహీనతల పైన ఈ చర్చ లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీలో ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్న అభిప్రాయం.. కూటమి పార్టీల మధ్య సమన్వయం కొరవడిన అంశాల ను ప్రశాంత్ కిశోర్ నివేదిక రూపంలో లోకేష్ కు అందించినట్లు తెలుస్తోంది.

పీకే నివేదిక
ఏపీలో కూటమి ప్రభుత్వ ఎనిమిది నెలల పాలన పైన టీడీపీ నాయకత్వం ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుంచి సమాచారం సేకరిస్తోంది. పథకాల అమలు విషయంలో వస్తున్న ఫీడ్ బ్యాక్ తో వాటి అమలు చేయాలనే ఆలోచన చేస్తోంది. ఇక, పవన్ - బీజేపీ రాజకీయ వ్యూహాల పైన టీడీపీ అలర్ట్ అవుతోంది. వారితో సఖ్యతగా ఉంటూనే...రాజకీయ పరిణామాలకు అనుగుణంగా భవిష్యత్ నిర్ణయా లను తీసుకుంటోంది. దీంతో.. ప్రధానంగా ఏపీలో కూటమి పాలన పైన ప్రజల్లో ఉన్న అంచనాలు, రాజకీయంగా మారుతున్న లెక్కల గురించి ప్రశాంత్ కిశోర్ కీలక సూచనలు.. అలర్ట్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు పీకే సూచనల మేరకు రాజకీయంగా ఎలాంటి కొత్త నిర్ణయాలు అమలు అవుతాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+