అబద్దానికి ప్యాంటూ,షర్ట్ వేస్తే జగన్ రెడ్డి లానే ఉంటుంది: వీడియో షేర్ చేసి లోకేష్ చురకలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అబద్ధానికి ప్యాంటు, షర్టు వేస్తే అచ్చం జగన్ రెడ్డి లానే ఉంటుందని లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని ఓ వీడియోను షేర్ చేశారు. జనాలను మోసం చేయడమే జగన్ రెడ్డి నైజమని నారా లోకేష్ పేర్కొన్నారు. క్రూరమైన అబద్ధాలు చెప్పే వాడిని ఏమంటారు అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాలపై జగన్ వ్యాఖ్యలకు లోకేష్ పంచ్
సోషల్ మీడియా వేదికగా జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డ లోకేష్ చంద్రబాబు 2018లోనే అంగన్‌వాడి టీచర్లు, ఆయాల జీతాలు పెంచారని పేర్కొన్నారు. అంగన్‌వాడి టీచర్ల జీతాన్ని రూ.7,500 నుంచి రూ. 10,500కు పెంచారన్నారు. అలాగే ఆయాల జీతాన్ని రూ.4500 నుంచి రూ.6వేలకు పెంచారన్నారు. టీడీపీ ఘనతను జగన్‌రెడ్డి తన ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని అసహనం వ్యక్తం చేశారు. ఇక ఆ ప్రయత్నాలు మానుకుని ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని నారా లోకేష్ సూచించారు. నమ్మి ఓటేసిన వారికి ఇచ్చిన హామీలు అమలు చేసే పని మొదలు పెట్టండి సీఎం గారు అంటూ చురకలంటించారు.
జగన్ అన్న.. అన్నందుకు గన్ లు పట్టుకున్న పోలీసుల్ని అక్కాచెల్లెమ్మలపైకి పంపారా సీఎం ysjagan గారూ! విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ కి వేలాది ఎకరాలు ఇచ్చిన తమను కాదని, ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పిండమేంటని మైథాన్ కర్మాగారం వద్ద శాంతియుతంగా..(1/4) https://t.co/Cvam7fJI6W
— Lokesh Nara (naralokesh) February 8, 2022
జగనన్న అన్నందుకు అక్కాచెల్లెళ్ల మీదికి పోలీసుల్ని పంపారా ?
మరో పోస్టులో జగన్ అన్న.. అన్నందుకు గన్ లు పట్టుకున్న పోలీసుల్ని అక్కాచెల్లెమ్మలపైకి పంపారా సీఎం వైయస్ జగన్ అంటూ ప్రశ్నించిన లోకేష్ విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ కి వేలాది ఎకరాలు ఇచ్చిన తమను కాదని, ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పిండమేంటని మైథాన్ కర్మాగారం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలను దారుణంగా కొట్టి అరెస్టు చేశారని విమర్శించారు.

ఉపాధి కోసం బొబ్బిలి గ్రోత్ సెంటర్ ఇంపెక్స్ కంపెనీ వద్ద మహిళా కూలీల ఆందోళన
జగన్ పాలనలో ఉపాధి కోసం జనం ఎంతగా అల్లాడిపోతున్నారో చూడండి అంటూ ఓ వీడియోని షేర్ చేసిన లోకేష్ విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ ఇంపెక్స్ (మైతాన్) కంపెనీ వద్ద కర్మాగారాన్ని తెరిచి తమకు ఉపాధి ఇవ్వాలని మహిళా కూలీలు ఆందోళనకు దిగారు. పోలీసులు యధావిధిగా మహిళలని కూడా చూడకుండా తమ ధోరణిని కొనసాగించారు. వారిపై లాఠీఛార్జ్ చేసి అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. మీ పాలనలో మహిళలకు భద్రతలేదు, చివరికి ఉపాధి కోసం రోడ్డెక్కితే చావగొట్టించారు. ఇది ఒక ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వం అని మీరెప్పుడో మరిచిపోయారు అంటూ లోకేష్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.
Recommended Video

మహిళల పట్ల ఎన్నాళ్ళీ దౌర్జన్యాలు, దాడులు
ఇక ఇదే సమయంలో రాజ్యాంగబద్ధంగా పనిచేయాలనే సంగతి మీ పోలీసులకూ గుర్తు రాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేద మహిళల పట్ల ఎన్నాళ్లీ దౌర్జన్యాలు, దాడులు? అని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ ఇంపెక్స్ కంపెనీ వద్ద మహిళా కూలీలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ లోకేష్ పేర్కొన్నారు. బాధిత మహిళలకు టిడిపి అండగా ఉంటుందని లోకేష్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications