• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

power crisis in AP: విద్యుత్ సంక్షోభంపై కేంద్రం హెచ్చరించినా తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రపోతున్న జగన్ : లోకేష్

|
Google Oneindia TeluguNews

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో నెలకొన్న బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన లోకేష్ వైయస్ జగన్ రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేశారు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకపక్క విద్యుత్ చార్జీల పెంపు పేరుతో బాదుడే బాదుడు అంటూ మండిపడ్డారు. మరోపక్క విద్యుత్ కోతలతో రాష్ట్రంలో అంధకారం సృష్టిస్తున్నారని నిప్పులు చెరిగారు.

విద్యుత్ సంక్షోభంపై తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోతున్న జగన్ లో చలనం లేదు
విద్యుత్ కొరతపై ఏపీకి కేంద్రం ముందే హెచ్చరించినప్పటికీ ,సెప్టెంబర్ 2న ఏపీకి కేంద్రం లేఖ రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని నారా లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించి, బొగ్గు నిల్వలు పెంచుకోవాలని సూచించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా విఫలమైందని లోకేష్ ఆరోపించారు. బొగ్గు కొరత ఏర్పడుతుంది జాగ్రత్తపడండి అంటూ 40 రోజుల ముందే కేంద్రం హెచ్చరించినా, తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోతున్న వైయస్ జగన్ లో చలనం లేదని లోకేష్ మండిపడ్డారు.

Lokesh satires Jagan sleeping at Thadepalli Palace despite center warning over power crisis

ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్ ఆగిపోయింది: లోకేష్ సెటైర్
200 కోట్ల రూపాయలకు పైగా సొంత మీడియాకి ప్రకటనల రూపంలో దోచి పెట్టిన మీరు బొగ్గు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రెండు వందల పదిహేను కోట్ల బకాయిలను చెల్లించకపోవడం దారుణం అంటూ లోకేష్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో విధిస్తున్న విద్యుత్ కోతల గురించి తీవ్ర అసహనం వ్యక్తం చేసిన లోకేష్ ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్ ఆగిపోయింది అంటూ జగన్ పాలనలో కరెంటు కోతలు విధిస్తున్నారని ఎద్దేవా చేశారు. అవసరం మేర బొగ్గు నిల్వలు పెంచుకోవాలన్న కేంద్రం హెచ్చరికలను పెడచెవిన పెట్టి అవినీతి సొమ్ము నిల్వ చేసుకోవడంలో జగన్ రెడ్డి బిజీ అవడం వల్లనే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని లోకేష్ ధ్వజమెత్తారు.

ఏపీలో విద్యుత్ సంక్షోభంపై జగన్ సర్కార్ ని టార్గెట్ చేస్తున్న టీడీపీ
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మన కంటే తక్కువ సామర్థ్యం ఉన్న రాష్ట్రాలలో విద్యుత్ ఎక్కువ ఉత్పత్తి చేశాయని, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామర్థ్యం ఉన్నప్పటికీ, విద్యుత్ ఉత్పత్తి తక్కువ చేయడం జగన్ రెడ్డి అసమర్థత కాదా అంటూ విరుచుకుపడుతుంది. జగన్ రెడ్డి అవినీతి, అసమర్థత కారణంగానే ఏపీలో చీకట్లు ముసురుతున్నాయని నిప్పులు చెరుగుతోంది టిడిపి . గతంలో టీడీపీ హయాంలో ఆరు రూపాయలు పెట్టి విద్యుత్ ను కొనుగోలు చేస్తేనే అవినీతి అని గోల చేసిన జగన్ రెడ్డి ,ఇప్పుడు 20 రూపాయలు పెట్టి విద్యుత్ ను కొంటున్న మిమ్మల్ని ఏమనాలో చెప్పాలంటూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది.

విద్యుత్ రంగంపై కనీసం పర్యవేక్షణ లేదని మండిపాటు
ముందు చూపు లేకుండా ధర్మల్ విద్యుత్ ప్లాంట్ల మూసివేత, రాష్ట్రంలో ఇప్పటికే ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నా, విద్యుత్ సమస్య తీర్చాలని ఎడాపెడా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాలన్న ఆలోచనలు వెరసి రాష్ట్రం చీకట్లో కి వెళుతుంది అంటూ టిడిపి జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తుంది. కీలకమైన విద్యుత్ రంగంపై కనీస పర్యవేక్షణ లేకపోవడమే ప్రస్తుతం ఈ ఉపద్రవానికి కారణంగా తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విద్యుత్ సంక్షోభంపై బహిరంగ లేఖ కూడా రాశారు నారా లోకేష్ .

జగన్ ప్రభుత్వానికి విద్యుత్ సంక్షోభంపై లోకేష్ ప్రశ్నాస్త్రాలు
జగన్ సర్కారు హయాంలో ఏపీలో విద్యుత్ రంగం పూర్తిగా దెబ్బతిందని, విద్యుత్ వినియోగదారులకు భారంగా మారిన ట్రూ అప్ చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన రోజున విద్యుత్ ఒప్పందాల గురించి జగన్ రెడ్డి ప్రవచనాలు చెప్పారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవన్నీ అబద్ధాలని నిరూపించారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో విద్యుత్ కోతలు, బిల్లుల వాతలు అంటూ మండిపడ్డారు. విద్యుత్ రంగం నాశనం కావటానికి జగన్ కారణం అంటూ మండిపడ్డారు.

English summary
Lokesh slams Jagan govt attitude over power crisis, fires that jagan throwing Andhra Pradesh into darkness. Lokesh criticised the increase in electricity charges, and creating darkness in the state with power cuts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X