• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వరండాలోనే శవాలు..నేలపైనే పేషెంట్లు, మూడు రాజధానులు తర్వాత కట్టొచ్చు కానీ.. జగన్ పై లోకేష్ సెటైర్

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం విఫలమవుతోందని ప్రతిపక్ష టిడిపి విమర్శిస్తోంది. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, తెలుగుదేశం పార్టీ నేతలు కావాలని అధికార పార్టీపై బురద జల్లుతున్నారని అధికార వైసిపి మాటల దాడి కొనసాగిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

కరోనా మృతదేహాలు, ఆ పక్కనే కోవిడ్ పేషెంట్లు.. ఆస్పత్రుల్లోదుస్థితి ఇది

కరోనా మృతదేహాలు, ఆ పక్కనే కోవిడ్ పేషెంట్లు.. ఆస్పత్రుల్లోదుస్థితి ఇది

రాష్ట్రంలో కరోనా దారుణ పరిస్థితులను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు నారా లోకేష్. వైయస్ జగన్ గారు.. ఒకసారి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ దృశ్యాలు చూడండి. కరోనా మృతదేహాలు, ఆ పక్కనే కోవిడ్ పేషెంట్లు,వారిని తీసుకు వచ్చిన బంధువులు.. హృదయ విదారకంగా ఉంది. వరండాలోనే శవాలు, నేలపైనే పేషెంట్లు ఎవరు బతికున్నారో ఎవరు చనిపోయారో తెలియని దుస్థితి అంటూ లోకేష్ రాష్ట్రంలో ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పరిస్థితిని ఒక వీడియో షేర్ చేసి మరీ సీఎం జగన్ కు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు.

మూడు రాజ‌ధానులు త‌రువాత క‌ట్టొచ్చుగానీ, ఒకే బెడ్డుపై ఉన్న ముగ్గురికి 3 బెడ్లు ఇవ్వండి

మూడు రాజ‌ధానులు త‌రువాత క‌ట్టొచ్చుగానీ, ఒకే బెడ్డుపై ఉన్న ముగ్గురికి 3 బెడ్లు ఇవ్వండి


ఇదే సమయంలో ఆస్పత్రుల్లో బెడ్ల కొరతపై జగన్ పై లోకేష్ సెటైర్ వేశారు.మూడు రాజ‌ధానులు త‌రువాత క‌ట్టొచ్చుగానీ, ఒకే బెడ్డుపై ఉన్న ముగ్గురికి 3 బెడ్లు కేటాయించి వారి ప్రాణాలు కాపాడండి అంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు. ప్రతిప‌క్ష‌నేతల్ని అక్ర‌మ అరెస్టులు చేయించ‌డంపై చేస్తోన్న స‌మీక్ష‌లు మాని, ముందు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో నేల‌పైనే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న‌ వారి ప్రాణాలు కాపాడండి అంటూ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించాలని సీఎం జగన్ కు హితవు పలికారు.

ఏ2 వైర‌స్ రెడ్డిగారే స్వ‌యంగా ఫోన్ చేసినా 104నుండి స్పందన లేదు

ఏ2 వైర‌స్ రెడ్డిగారే స్వ‌యంగా ఫోన్ చేసినా 104నుండి స్పందన లేదు

104కి కాల్ చేస్తే 3 గంట‌ల్లో బెడ్డు ఇవ్వాలని మీరంటారు.104 య‌జ‌మాని మామ‌గారైన‌ విశాఖ ఏ2 వైర‌స్ రెడ్డిగారే స్వ‌యంగా ఫోన్ చేసినా వారెత్త‌రు అంటూ రాష్ట్రంలో 104 పరిస్థితిపై అసహనం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కొన‌డానికి డ‌బ్బుల్లేవ‌ని చేతులెత్తేసి, చంద్ర‌బాబు గారు వ్యాక్సిన్ తెప్పించాలంటూ స‌ల‌హాల జీత‌గాడు స‌జ్జ‌ల వాగుతున్నారు.మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మీ వాళ్లే నమ్మలేకపొతున్నారు. మీకు అర్ధం అవుతోందా అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి పై విమర్శనాస్త్రాలు సంధించారు టీడీపీ నేత నారా లోకేష్.

ఏపీలో కరోనాపరిస్థితులపై నిత్య సమరం చేస్తున్న టీడీపీ

ఏపీలో కరోనాపరిస్థితులపై నిత్య సమరం చేస్తున్న టీడీపీ


ప్రతిరోజూ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా వివిధ జిల్లాలలో చోటు చేసుకుంటున్న దారుణ పరిస్థితులను టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆస్పత్రులలో వసతుల లేమిపై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున పోరాటమే చేస్తున్నారు. అయినప్పటికే పరిస్థితులు మారటం లేదని, జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Nara Lokesh satirized Jagan for the shortage of beds in hospitals. Although the three capitals were later constructed, CM Jagan was incensed that three patients who are in single bed should be allotted three beds first.He urged CM Jagan to focus on saving the lives of the covid patients.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X