లోకేష్ పుట్టింది 23నే.. అందుకే చంద్రబాబుకీ 23 కష్టాలు: పుండుపై కారం చల్లిన ఆర్జీవీ!!
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు అయిన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైలుకు పంపించడం పై నేడు టిడిపి శ్రేణులు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ప్రజలు ఎవరూ బంద్ ను పట్టించుకోవడంలేదని, చంద్రబాబు చేసిన అవినీతి అంతటిదని వైసీపీ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబు నాయుడు 1977 సంవత్సరం నుంచి ఎన్నో స్కాములు చేశారని, అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ 45 సంవత్సరాల పాటు చంద్రబాబు చక్రం తిప్పారని, కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. చాలా కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటూ మేనేజ్ చేశారని పేర్ని నాని పేర్కొన్నారు.

అన్ని రోజులు న్యాయ స్థానాలను, ప్రజలను మోసం చేయలేరని, ఇంత కాలానికి చంద్రబాబు పాపం పండిందని పేర్కొన్నారు. ఇన్ని రోజులకు న్యాయం, ధర్మం గెలిచిందని పేర్ని నాని పేర్కొన్నారు. చట్ట ప్రకారమే చంద్రబాబు అరెస్టు జరిగిందని, సిఐడి అధికారులు చట్ట ప్రకారమే వ్యవహరించాలని పేర్కొన్న పేర్ని నాని దర్యాప్తు జరిగే కొద్దీ అన్ని పేర్లు బయటకు వస్తాయని తెలిపారు.
హెలికాప్టర్లో తీసుకు వెళ్తామంటే వద్దని, కావాలని రోడ్డు మార్గంలో హడావుడి చేయొచ్చని రోడ్డు మార్గంలోనే వచ్చారన్నారు .చంద్రబాబు పాపాల భైరవుడు అని యువతకు నైపుణ్యం పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నాడు అని పేర్ని నాని విమర్శించారు.ఇది మచ్చుకు ఒకటి మాత్రమేనని తీగ లాగితే డొంక కదిలినట్టు చంద్రబాబు చేసిన స్కాములు అన్ని బయటకు వస్తాయని పేర్ని నాని తెలిపారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన బాబు ఎంత గడ్డి కరవడానికి అయినా దిగజారుతారు అని పేర్ని నాని విమర్శించారు. పవన్ కళ్యాణ్, పురందరేశ్వరి చంద్రబాబును కాపాడుకోవడం కోసమే పనిచేస్తున్నారని పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు పేర్ని నాని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications